AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Group: మీకు తెలుసా.. ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తులు చాలా తెలివైనవారు.. కానీ స్వార్థపరులు.. ఎవరంటే..

రక్త పరీక్ష చేయడం ద్వారా మన ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకోవచ్చు.. ముఖ్యంగా వ్యక్తి బ్లడ్ గ్రూప్ తెలియడం వలన

Blood Group: మీకు తెలుసా.. ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తులు చాలా తెలివైనవారు.. కానీ స్వార్థపరులు.. ఎవరంటే..
Blood Groups
Rajitha Chanti
|

Updated on: Apr 07, 2022 | 7:19 PM

Share

రక్త పరీక్ష చేయడం ద్వారా మన ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకోవచ్చు.. ముఖ్యంగా వ్యక్తి బ్లడ్ గ్రూప్ తెలియడం వలన వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటాం. కానీ.. బ్లడ్ గ్రూప్ ద్వారా వ్యక్తిత్వం, అతని భవిష్యత్తు కూడా తెలుసుకోవచ్చని ఇటీవల కొన్ని అధ్యాయనాల్లో వెల్లడైంది. జ్యోతిష్యాన్ని సైన్స్ లోని అనేక భాగాలలో ఒకటిగా తీసుకోవచ్చు. జ్యోతిషశాస్త్రంలోని ఇతర విభాగాలలో కుండలి, హస్తసాముద్రికం, సంఖ్యాశాస్త్రం, ముఖ పఠనం, సంతకం పఠనం మొదలైనవి ఉన్నాయి. వీటి ద్వారా కూడా వ్యక్తి స్వభావం, అతని భవిష్యత్తు, మరెన్నో సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కానీ బ్లడ్ గ్రూప్ ద్వారా వ్యక్తి స్వభావం, భవిష్యత్తు, ఇతర విషయాల గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు బి బ్లడ్ గ్రూప్ వ్యక్తుల గురించి తెలుసుకుందామా.

బి బ్లడ్ గ్రూప్ వ్యక్తులు.. B బ్లడ్ గ్రూప్ వ్యక్తుల స్వభావం ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి చూస్తుంటారు. సమయం వచ్చినప్పుడు వీరు ఇతరుల కోసం తమ ప్రాణాలను ఇవ్వడానికి వెనుకాడరు. ఈ వ్యక్తులు చాలా భావోద్వేగ స్వభావం కలిగి ఉంటారు, ప్రతి సంబంధానికి గొప్ప ప్రాముఖ్యత ఇస్తారు. B బ్లడ్ గ్రూప్‌లోని వ్యక్తులు అందంగా, స్మార్ట్‌గా ఉంటారు.

లోపాలు.. B బ్లడ్ గ్రూప్‌లోని వ్యక్తులు ఎక్కువ పనులు చేయరు. వీరు స్వార్థపూరితమైన (సెల్ఫీష్) వ్యక్తులు. అంతేకాకుండా.. వీరు కొందరికి సహాయం చేయరు. దీంతో వీరు అనేక రకాల వివక్షలను ఎదుర్కోవాల్సి వస్తోంది. కోపం వారి ముక్కు మీద ఉంటుంది. అలాగే, ఖర్చు గురించి కూడా ఆలోచించరు.

లక్షణాలు.. B బ్లడ్ గ్రూప్‌లోని వ్యక్తులు చాలా సృజనాత్మకంగా ఉంటారు. ఈ వ్యక్తులు ఏ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయరు. వారు తాము అనుకున్న పనులను నెరవేర్చుకోవడానికి ఏదైనా చేయగలరు. ఇదే పద్దతి వీరికి నమ్మదగిన స్నేహితులను చేస్తుంది.

ప్రేమ జీవితం, వివాహిత జీవితం B బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు మంచివారు, హృదయపూర్వకంగా ఉంటారు. వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు అదృష్టవంతులు. ఎందుకంటే వారు తమ భాగస్వామిని ఎంతగానో గౌరవించడంతో పాటు వారి పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారు ఎల్లప్పుడూ తమ భాగస్వామిని ప్రత్యేకంగా భావిస్తారు.

గమనిక:- ఈ కథనం కేవలం సాధారణ ఉహలపై మాత్రమే ఆధారపడింది. టీవీ 9 తెలుగు దృవీకరించలేదు. అమలు చేయడానికి ముందు నిపుణులను సంప్రదించాలి.

Also Read: Ramarao On Duty: బుల్ బుల్ తరంగ్ అంటూ రాబోతున్న మాస్ మహారాజా.. రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్..

Rajamouli: ఆమిర్ ఖాన్ మా అగ్రిమెంట్ బ్రేక్ చేశారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి..

RGV: మరో ట్విస్ట్ ఇచ్చిన వర్మ.. డేంజరస్ సినిమాపై షాకింగ్ నిర్ణయం..

Ram Gopal Varma: వర్మను రాముడితో పోలుస్తూ పద్యం రాసిన రచయిత.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఆర్జీవీ..