AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Caste Change: ఎవరైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు కులాన్ని మార్చుకోవచ్చా? చట్టం ఏం చెబుతోంది..?

Caste Change: భారతదేశంలో ప్రతి మనిషికి కులం అనేది ఉంటుంది. పుట్టుకతోనే కులం (Cast) ఏర్పడుతుంది. కులం పేరుతోనే మీకో గుర్తింపు వస్తుంది. పుట్టిన తర్వాత అతను ఫలానా..

Caste Change: ఎవరైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు కులాన్ని మార్చుకోవచ్చా? చట్టం ఏం చెబుతోంది..?
Subhash Goud
|

Updated on: Mar 25, 2022 | 3:57 PM

Share

Caste Change: భారతదేశంలో ప్రతి మనిషికి కులం అనేది ఉంటుంది. పుట్టుకతోనే కులం (Cast) ఏర్పడుతుంది. కులం పేరుతోనే మీకో గుర్తింపు వస్తుంది. పుట్టిన తర్వాత అతను ఫలానా కులానికి చెందిన వాడని గుర్తింపు వచ్చేస్తుంది. పుట్టిన తర్వాత కులం సర్టిఫికేట్‌ (Caste Certificate) తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ఏ కులానికి చెందిన వాడనేది నమోదు చేస్తారు. ప్రస్తుతం కులాలను బట్టి ఉద్యోగాలు వస్తున్నాయి. అలాగే సమాజంలో కులం గురించి కొందరు పెద్దగా పట్టించుకోకపోయినా.. పెళ్లిళ్ల విషయాలలో తప్పనిసరిగా కులం పేరు ఉందుకు వస్తుంది. కొంతమంది ఈ కుల వ్యవస్థను మంచిదని భావించరు. ఇలాంటి పరిస్థితిలో కులం పేరును మార్చుకోవచ్చా..? అనే ప్రశ్న తలెత్తుతుంది. అంటే అతను ఒక కులం నుండి మరొక కులంలోకి మారవచ్చు. లేదా కావాలంటే కులాన్ని త్యజించవచ్చు. అంటే ఏ కులం లేకుండా జీవించవచ్చు. అందుకు ఈ రోజు మనం కులాన్ని మార్చడం గురించి మన రాజ్యాంగం ఏమి చెబుతుందో తెలుసుకుందాం.

కులం అంటే ఏమిటి?

రాజ్యాంగం ప్రకారం.. సుప్రీం కోర్టు తన ఒక తీర్పులో కులం అనే పదానికి అర్థాన్ని తెలిపింది. ‘కులం అనేది ఒక సామాజిక వర్గం, ఇది స్థిరంగా ఉంటుంది. ఇందులో ప్రతి వ్యక్తికి సభ్యత్వం పుట్టుకతో ఇవ్వబడుతుంది. ఇది పుట్టుకతో స్థిరంగా ఉంటుంది. అంటే ప్రతి బిడ్డ తన పుట్టుకతో పాటు ఒక కులం సభ్యత్వంతో పుడుతుంది. ప్రతి కులంతో పాటు, వారు కూడా కొన్ని సంప్రదాయాలపై హక్కును పొందుతారు.

కులాన్ని మార్చవచ్చా?

కులాన్ని మార్చేందుకు రాజ్యాంగంలో ప్రత్యేక చట్టం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే సుప్రీంకోర్టు కొన్ని నిర్ణయాలపై, కులాన్ని మార్చవచ్చా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి తన కులాన్ని మార్చుకోలేడని, అతను మతాన్ని మార్చుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిజానికి కులం అనేది మీ పుట్టుకకు సంబంధించిన ఒక వ్యవస్థ. లేదా తరగతి. అందుకే కులాన్ని ఎప్పటికీ మార్చుకోలేమని చెప్పొచ్చు.

మతం మారిన తర్వాత కులం ఏమవుతుంది?

ఎవరైనా మతం మార్చుకున్నారనుకోండి అప్పుడు అతని కులం ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. అధికారికంగా కులం పేరును మార్చుకోలేకపోయినా.. ఆ వ్యక్తి కొత్త మతంపై ఆధారపడి ఉంటుంది. అప్పుడు ఆ కులాన్ని ఎలా స్వీకరిస్తారనేది మతాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మతం మారిన తర్వాత కూడా కొత్త మతం ఆధారంగా కులం అని చెప్పవచ్చు. కానీ పుట్టినప్పటి నుంచి వచ్చిన కులం పేరు మాత్రం మారదు అని కోర్టు స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:

Puncture Guard Tyre: వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఈ టైర్లకు పంక్చర్‌ అయినా గాలి బయటకు పోదు!

Vodafone Idea: వొడాఫోన్‌ ఐడియా 8000 SIM కార్డ్‌లను బ్లాక్ చేసింది.. కారణం ఏంటంటే..!

Ola Electric Vehicles: ఓలా సంచలన నిర్ణయం.. కేవలం 5 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జింగ్‌..!