Ola Electric Vehicles: ఓలా సంచలన నిర్ణయం.. కేవలం 5 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జింగ్‌..!

Ola Electric Vehicles: ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక మొదటగా ఓలా నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అందుబాటులోకి..

Ola Electric Vehicles: ఓలా సంచలన నిర్ణయం.. కేవలం 5 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జింగ్‌..!
Follow us

|

Updated on: Mar 23, 2022 | 1:26 PM

Ola Electric Vehicles: ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక మొదటగా ఓలా నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ మార్కెట్లో విడుదల చేసింది. ఇక తాజాగా ఓలా వాహనదారులకు గుడ్‌న్యూస్ తెలిపారు ఓలా సీఈవో భవీస్‌ అగర్వాల్‌ (Bhavish Aggarwal). ఎలక్ట్రిక్ వాహనాలకు అతిపెద్ద సమస్యగా ఉన్న బ్యాటరీ ఛార్జింగ్‌ సమయానికి అతి త్వరలో చెకక్ష్‌ పెట్టనున్నట్లుఆ ఆయన వెల్లడించారు. భారత్ లో ఎలక్ట్రిక్‌ వాహనాల (Electric Vehicles) సెగ్మెంట్‌లో ఓలా ఓ సంచలన సృష్టించిందనే చెప్పాలి. ఈవీ స్కూటర్ అందుబాటులోకి తీసుకువచ్చిన ఓలా.. ఇప్పటికే లక్షన్నరకుపైగా బుకింగ్స్‌ను సొంతం చేసుకుంది. అలాగే బుకింగ్స్‌కు తగ్గట్లుగా కస్టమర్లకు స్కూటర్లను డెలివరీ చేస్తోంది. ఇప్పుడు వాహనాలకు ఛార్జింగ్‌ సమస్యకు చెక్‌ పెడుతూ పరిష్కారం చూపించే ప్రయత్నంలో ఉన్నట్లు

ఇక ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీలు, ఛార్జీంగ్‌ టెక్నాలజీలో ప్రగతి సాధించిన స్టోర్‌డాట్‌తో భాగస్వామిగా కలుస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో భారత్‌లో ఈవీలకు సంబంధించి సరికొత్త నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పారు. 2 వాట్స్‌, 4 వాట్స్‌కు సంబంధించి భారత్‌లోనే తయారీ, ఆర్‌అండ్‌ డీ సెంటర్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.

5 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జింగ్‌

ఓల ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు కేవలం 18 నిమిషాల్లోనే ఛార్జింగ్‌తో 78 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ ఫుల్‌ ఛార్జింగ్‌కు కనిష్టంగా 4 గంటల 48 నిమిషాల నుంచి గరిష్టంగా 6 గంటల నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. ఇక స్టోర్‌డాట్‌ టెక్నాలజీతో కేవలం 5 నిమిషాలకు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే ఇజ్రాయిల్‌కు చెందిన స్టోర్‌డాట్‌ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా బ్యాటరీ ఛార్జింగ్‌ టెక్నాలజీ. ఈ టెక్నాలజీతో కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో ఏకంగా 160 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చని ఓలా సీఈవో తెలిపారు.

ఇవి కూడా చదవండి

Newton Predicts: 2060లో ప్రపంచం అంతం కానుందా..? ప్రళయం ముంచుకొస్తుందా..? లేఖలో స్పష్టం చేసిన న్యూటన్‌..!

Google Chrome, Microsoft: మీరు గూగుల్‌ క్రోమ్‌, మైక్రోసాఫ్ట్ వాడుతున్నారా..? అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం హెచ్చరిక

Latest Articles
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. క్రిష్ 4 వచ్చేస్తున్నాడు..
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. క్రిష్ 4 వచ్చేస్తున్నాడు..
గుడ్డు.. వెరీగుడ్డు.. గాడిద గుడ్డు.. తెలంగాణలో పొలిటికల్ హీట్..
గుడ్డు.. వెరీగుడ్డు.. గాడిద గుడ్డు.. తెలంగాణలో పొలిటికల్ హీట్..
అతి తక్కువ ధరకే 1GBPS వేగంతో ఇంటర్నెట్.. బీఎస్ఎన్ఎల్ నుంచి..
అతి తక్కువ ధరకే 1GBPS వేగంతో ఇంటర్నెట్.. బీఎస్ఎన్ఎల్ నుంచి..
ఈ టిప్స్ పాటించారంటే.. మీ థై ఫ్యాట్ తగ్గి సన్నగా కనిపిస్తారు..
ఈ టిప్స్ పాటించారంటే.. మీ థై ఫ్యాట్ తగ్గి సన్నగా కనిపిస్తారు..
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మెల్ బాయ్స్.. ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మెల్ బాయ్స్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ప్రభాస్ ప్రపోజ్ చేస్తే రిజక్ట్ చేసిందట..! అన్నకే తప్పలేదు మనమెంత
ప్రభాస్ ప్రపోజ్ చేస్తే రిజక్ట్ చేసిందట..! అన్నకే తప్పలేదు మనమెంత
'కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా?'.. మాజీమంత్రి హరీష్‌ రావు
'కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా?'.. మాజీమంత్రి హరీష్‌ రావు
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
కిర్రాక్ లుక్.. క్రేజీ ఫీచర్స్.. కొత్త ఈ-బైక్ మామూలుగా లేదుగా..
కిర్రాక్ లుక్.. క్రేజీ ఫీచర్స్.. కొత్త ఈ-బైక్ మామూలుగా లేదుగా..