AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Newton Predicts: 2060లో ప్రపంచం అంతం కానుందా..? ప్రళయం ముంచుకొస్తుందా..? లేఖలో స్పష్టం చేసిన న్యూటన్‌..!

Newton Predicts: ప్రపంచం అంతం అనేది చాలా మందికి ఆసక్తి కలిగించే అంశం. ఈ విశాలమన అస్తిత్వం ముగింపు గురించి ఆలోచించడం అనేది హృదయాలను కదిలించే విషయం..

Newton Predicts: 2060లో ప్రపంచం అంతం కానుందా..? ప్రళయం ముంచుకొస్తుందా..? లేఖలో స్పష్టం చేసిన న్యూటన్‌..!
Newton Predicts
Subhash Goud
|

Updated on: Mar 23, 2022 | 12:16 PM

Share

Newton Predicts: ప్రపంచం అంతం అనేది చాలా మందికి ఆసక్తి కలిగించే అంశం. ఈ విశాలమన అస్తిత్వం ముగింపు గురించి ఆలోచించడం అనేది హృదయాలను కదిలించే విషయం. ఇక 2060లో భూమం అంతం కాబోతుందా..? ప్రళయం ముంచుకొస్తుందా..? ఇలాంటి విషయాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ అంచనాల లెక్కలతో పాటు పూర్తి వివరాలు న్యూటన్‌ (Newton)చెప్పాడని ప్రచారం జరుగుతోంది. 2060లో ప్రపంచం అంతం అవుతుందని ఆయన 1706లో లేఖ ( Letter)రాశాడు. ఎప్పటి నుంచో భూమి నిజంగానే అంతమైపోతుందనే భయాందోళన నెలకొంది. కాని ఇప్పటి వరకు అలాంటిదేమి జరగలేదు. ఇప్పుడు ఇలాంటి ఊహాగానాలే మళ్లీ ఊపందుకున్నాయి. యుగాంతం రాబోతుందంటూ మళ్లీ అంచనాలు ప్రారంభం అయ్యాయి. కొన్ని సూత్రాల ఆధారంగా న్యూటన్ ఈ విషయం చెప్పాడు. అతని సూత్రాలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

న్యూటన్ తన చివరి లేఖలలో..

సర్ ఐజాక్ న్యూటన్ తన చివరి లేఖలలో ప్రపంచం అంతం అవుతుందని ప్రస్తావించాడు. 2060 సంవత్సరం వరకు ప్రపంచం మనుగడ సాగితే.. అదే విధ్వంసం ప్రారంభమైన సంవత్సరం అవుతుందని తన లేఖలో స్పష్టం చేశాడు. న్యూటన్ ప్రపంచం అంతం కోసం ఒక సూత్రాన్ని కూడా ఇచ్చాడు. 1704 సంవత్సరంలో న్యూటన్ ఈ అంచనా వేశాడు. అంచనాతో పాటు న్యూటన్ ఈ సూచన కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన లేఖ ఒకటి ఆయన ఇంట్లో దొరికింది. న్యూటన్‌ 1727 లో మరణించాడు. ఆ తరువాత అతను రాసిన లేఖలు అతని ఇంట్లో లభించాయి. అయితే ఆయన రాసిన

న్యూటన్ గురించి సారా డ్రై పేపర్స్ రాసిన ది స్ట్రేంజ్ అండ్ ట్రూ ఒడిస్సీ ఆఫ్ ఐజాక్ న్యూటన్ మాన్యుస్క్రిప్ట్స్ లో ఈ వివరంగా వివరించబడింది. ఈ పుస్తకంలో న్యూటన్ తన జీవితంలో 10,000 నోట్లు, లేఖలు రాశారని రాశారు. 1800ల చివరలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి ఈ నోట్స్, లేఖలు తీసుకువచ్చినప్పుడు అవి చాలా గజిబిజిగా ఉన్నాయని సారా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. వాటిని సరి చేయడానికి 16 సంవత్సరాలు పట్టిందని వెల్లడించారు. 1936 లో అతని నోట్స్, లేఖలు వేలం వేయబడ్డాయి. వాటిని బ్రిటీష్ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ కొనుగోలు చేశారు. తరువాత ఈ నోట్లన్నీ జెరూసలెంలోని ఒక ప్రొఫెసర్ ‘సీక్రెట్స్ ఆఫ్ న్యూటన్’ అనే పుస్తక రూపంలో ప్రచురించారు. ఈ పుస్తకాన్ని ఇప్పటికీ జెరూసలేం విశ్వవిద్యాలయంలో ఉంచారు.

న్యూటన్ లేఖలో ఇలా రాశాడు..

అయితే న్యూటన్ ఒక గమనికలో ఇలా చేశాడు.. ‘ఒక వ్యక్తి తాను శాశ్వతంగా జీవిస్తానని అనుకుంటే.. అది అస్సలు సాధ్యం కాదు. అలాగే.. ఈ భూమికి కూడా ఒక రోజు ముగుస్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కొంతకాలం ఉంటుంది. ఆ తర్వాత కనిపించడు. దీని ఆధారంగా న్యూటన్ లెక్కించాడు. భూమి మీద తక్కువ జీవితకాలం ఉన్న జంతువుల ఆయువు 1,260 రోజులు. అయితే 1260 సంవత్సరాలలో ప్రపంచం ముగుస్తుందని న్యూటన్ తన లెక్కల ఆధారంగా చెప్పాడు. దీని తరువాత న్యూటన్ మనస్సులో ఈ 1,260 సంవత్సరాలు ఏ సంవత్సరం నుండి ప్రారంభించబడాలి అనే ప్రశ్న తలెత్తింది. దీని కోసం అతను 800 సంవత్సరాన్ని ప్రమాణంగా మార్చాడు. దీని వెనుక 800AD లో, రోమ్‌లో మత విప్లవం జరిగిందని.. రోమ్ రాజు చలిమాగన్ పోప్‌ను పాలన కంటే పైన ఉంచారని వాదించారు. న్యూటన్ లెక్కల ఆధారంగా 1260 నుండి 800 వరకు.. తర్వాత 2060 సంవత్సరం వచ్చింది.. అంటే 2060 ను ప్రపంచ ముగింపు సంవత్సరంగా లెక్కించాడు. ఈ సమయానికి ప్రపంచం అంతం కాకపోయినా.. దాని విధ్వంసం ప్రారంభమవుతుందని ఆయన లెక్కల సారాంశం. ఏదీ ఏమైనా మొత్తం మీద ప్రపంచం అంతం అయిపోతుందని వస్తున్న లేఖ వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

Google Chrome, Microsoft: మీరు గూగుల్‌ క్రోమ్‌, మైక్రోసాఫ్ట్ వాడుతున్నారా..? అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం హెచ్చరిక

Clouds: కొన్ని మేఘాలు నల్లగా ఎందుకు ఉంటాయి..? కారణాలు తెలుసుకోండి..!