Chanakya Niti: భార్యాభర్తల మధ్య ఇటువంటి రిలేషన్ లేకుంటే విడాకులకు దారితీస్తుందంటున్న చాణక్య
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Acharya Chanakyudu) రచించిన నీతి శాస్త్రం( Niti-Shastra)లో మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రస్తావించాడు. నీతి శాస్త్రంలో సమాజంలోని దాదాపు ప్రతి..
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Acharya Chanakyudu) రచించిన నీతి శాస్త్రం( Niti-Shastra)లో మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రస్తావించాడు. నీతి శాస్త్రంలో సమాజంలోని దాదాపు ప్రతి అంశానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. జీవించే కళను నేర్పుతాయి. చాణుక్యుడు నీతి శాస్త్రంలో ప్రస్తావించిన అంశాలను విషయాలను పాటిస్తే.. ఎంతటి కష్టమైనా తేలికగా పరిష్కరించుకోవచ్చు . నీతి శాస్త్రంలోని విషయాలు ప్రస్తుత సమాజంలో నేటి జనరేషన్ కు అనుసరణీయం. చాణుక్యుడు తన నీతి శాస్త్రంలో వైవాహిక జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను పేర్కొన్నాడు. భార్యాభర్తల మధ్య ఆరోగ్యకరమైన బంధం కొనసాగాలంటే కొన్ని తప్పులు చేయకూడదు అని చెప్పాడు. కొన్ని తప్పు చేస్తే.. సంతోషకరమైన వైవాహిక జీవితం చెడు మార్గంలో ప్రయాణిస్తుందని.. ఒకొక్కసారి విడాకులు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు.
- చాలా మంది తమ భాగస్వామితో చాలా విషయాల్లో అబద్ధాలు చెబుతుంటారు. ప్రతిసారీ అలాంటి అబద్ధాలను ఎవరూ సహించలేరు. అటువంటి పరిస్థితిలో.. భార్య భర్తల మధ్య సందేహాలు తలెత్తుతాయి బంధంలో దూరం పెరుగుతుంది.
- కోపం ఎటువంటి బంధాలు అనుబంధాలైనా నాశనం చేస్తుంది. చాలా కోపంగా ఉన్న భర్త.. ఆ కోపాన్ని భార్యపై చూపించడం ముఖ్యంగా తమ భాగస్వామిపై బహిరంగంగా మందలించడం బంధాలను బలహీన పరుస్తాయి. తమ భాగస్వామి ప్రతి చిన్న విషయానికి తమపై కోపం చూపించడం ప్రతి ఒక్కరూ తట్టుకోలేరు.
- ఎవరైనా సరే తమ భాగస్వామిని తక్కువ అంచనా వేస్తూ.. వారికి గౌరవం ఇవ్వకపోతే.. మీరు కూడా మీ గౌరవాన్ని కోల్పోతారు. భార్య భర్తల మధ్య గౌరవం లేని సంబంధం.. ఎక్కువ కాలం కొనసాగదు. అలాంటి సంబంధాలు నెమ్మదిగా భారంగా మారడం ప్రారంభిస్తాయి.
- వైవాహిక జీవితం ఎప్పుడూ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. తమ భాగస్వామిని మోసం చేసే వ్యక్తులు.. భాగస్వామి నమ్మకాన్ని కోల్పోతారు. అలా నమ్మకం లేని బంధం అనుబంధం ఎక్కువ కాలం కొనసాగదు.
- భార్యాభర్తల జీవితం పరస్పరం సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. పరిస్థితులు ఏమైనప్పటికీ, మీరు మీ భాగస్వామితో దాని గురించి బహిరంగంగా మాట్లాడాలి. మీరు మీ విషయాలను భాగస్వామి నుంచి దాచినట్లయితే, అది మీ సంబంధాన్ని బలహీనపరుస్తుంది. అందుకనే మీ పరిస్థితులను సందర్భానుసారంగా భాగస్వామితో చర్చిస్తుంటే.. మీ భాగస్వామి మీ పరిస్థితిని అర్థం చేసుకుంటారు. అవసరమైన సమయంలో మీ భాగస్వామి మద్దతు మీకు లభిస్తుంది.