Megastar Chiranjeevi: ఆర్ఆర్ఆర్ మూవీని ఫ్యామిలీతో కలిసి చూసిన చిరు.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన సుస్మిత

Megastar Chiranjeevi: దక్షిణాది మెగా మల్టీస్టారర్ మూవీ.. మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ (RRR) నాలుగేళ్ళ నిరీక్షణకు తెరదింపుతూ ఈరోజు (మార్చి 25వ తేదీ)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది..

Megastar Chiranjeevi: ఆర్ఆర్ఆర్ మూవీని ఫ్యామిలీతో కలిసి చూసిన చిరు.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన సుస్మిత
Chiru At Rrr Theater
Follow us
Surya Kala

|

Updated on: Mar 25, 2022 | 3:54 PM

Megastar Chiranjeevi: దక్షిణాది మెగా మల్టీస్టారర్ మూవీ.. మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ (RRR) నాలుగేళ్ళ నిరీక్షణకు తెరదింపుతూ ఈరోజు (మార్చి 25వ తేదీ)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎమోషనల్ డ్రామా లో కింగ్ అయిన రాజమౌళి(Rajamouli) మరొకసారి ఆర్ఆర్ఆర్ లో తన మార్కు చూపించారు. ఒక నటుడి లోని నటనని వెలికితీయగల సమర్ధవంతమైన దర్శకుడు దొరికితే ఎలా ఉంటుందో మరొకసారి నిరూపించబడిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచిందంటూ సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సెలబ్రెటీలు, నటీనటులు, సినీ ప్రేక్షకుల వరకూ ఈ సినిమాకు క్యూ కడుతున్నారు.  ఇప్పటికే ఎన్టీఆర్(NTR) , రామ్ చరణ్ (Ram Charan), రాజమౌళి లు తమ ఫ్యామిలీలతో సహా ఆర్ఆర్ఆర్ టీమ్ బెనిఫిట్ షోలను చూసింది.  తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబం తో కలిసి ట్రిపుల్ ఆర్ సినిమాను హైదరాబాద్ లోని ప్రిన్స్ మహేష్ బాబు సినిమా థియేటర్ AMB సినిమాస్ లో చూసారు. చిరంజీవి తల్లి అంజనా దేవి, కూతుర్లు సుష్మిత , శ్రీజ, మనువరాళ్ల తో కలిసి చిరంజీవి తనయుడు సినిమాను చూశారు.  ఈ ఈ సందర్భంగా టీవీ9 తో చిరంజీవి,  సుష్మితలు ఆర్ఆర్ఆర్ సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మెగాస్టార్ మాటల్లో: ఆర్ఆర్ఆర్ ఎలా ఉంది అంటే.. చెప్పడానికి మాటలు లేవని.. సింప్లి సూపర్బ్ అని అన్నారు. ముఖ్యంగా సినిమాలో చరణ్, తారక్ ల మధ్య బాండింగ్ ఫెంటాస్టిక్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.  ఇద్దరు డ్యాన్స్ లో ఒకరితో నొకరు పోటీపడి చేశారని వీరి డాన్స్ ఎపిక్, ఇంకా చెప్పాలంటే క్లాసిక్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. చలన చిత్ర పరిశ్రమలో ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని.. స్టార్ హీరోలు కలిసి నటించాలని మెగాస్టార్ చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.

చిరు తనయ సుష్మిత కొణిదెల:  ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తుంటే సంతోషముతో కడుపు నిండిపోయిందని చెర్రీ అక్క సుష్మిత అన్నారు.  సినిమా చూస్తున్నంత సేపు.. చరణ్, తారక్ లు నిజంగా అన్నదమ్ములేమో అనిపించిందని.. నిజమైన అన్నదమ్ముల్లా ఉన్నారని చెప్పారు. ఇక డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా ఏమీ చెప్పినా తక్కువే అంటూ తమ్ముడిపై, తారాకపై అభిమానాన్ని చాటుకుంది. తనకు సినిమా క్లైమాక్స్ లో ఇద్దరూ కలిసి రావడం అద్భుతమైన సీన్ అనిపించిందని.. ఆ సన్నివేశం తనకు  బాగా నచ్చిందని చెప్పింది సుష్మిత.

Also Read: RRR Public Talk: జక్కన్న మాస్టర్ మైండ్ మూవీ.. ట్రిపుల్ ఆర్‌పై పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..?

RRR: బెజవాడ అన్నపూర్ణ థియేటర్‌లో ఇది పరిస్థితి.. ఎక్కడ తేడా కొట్టిందంటే…?

పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..