Pit Viper: వామ్మో.. అత్యంత అరుదైన పాము.. వేట స్టైలే డిఫరెంట్….
అరుణాచల ప్రదేశ్‌లో 5 ఏళ్ల క్రితం.. అంటే 2019లో అరుదైన పాము కనిపించింది. అప్పటికి దాదాపు 70 ఏళ్ల తర్వాత మన దేశంలో ఇలాంటి పాము కనిపించిందని అప్పట్లో దాని గురించి వార్తలు వైరల్ అయ్యాయి. భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన సమయంలో ఇలాంటి రకం పాము కనిపించిందట. మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుందంటున్నారు. ఇంతకీ ఈ పాము పేరేంటి? దీనిలో ఎలాంటి లక్షణాలుంటాయో తెలుసకుందాం పదండి..

అరుణాచల్ ప్రదేశ్‌లో 2019లో అరుదైన పామును కనుగొన్నారు పరిశోధకులు. ఈ పాము పేరు పిట్ వైపర్. పశ్చిమ కమెంగ్ జిల్లా ఈగల్ నెస్ట్ లోని అడవుల్లో ఈ పామును కనుగొన్నారు పరిశోధకులు. చెట్ల ఆకుల్లో, చెట్ల మధ్య కలిసిపోయేలా ఉన్న దీని డిఎన్ఏపై పరిశోధనలు జరిపారు. దీనికి అరుణాచల్ పిట్ వైపర్ అని నామకరణం చేశారు. పాముకు ఒక రాష్ట్రం పేరు పెట్టడం అదే తొలిసారి. రక్తపింజర జాతికి చెందిన పిట్ వైపర్ రకాలలో ఇది ఐదోది. ముదురు ఎరుపు, గోధుమ రంగు కలయికలో ఉండే ఈ పిట్ వైపర్ పాము చాలా సులభంగా స్థానిక చెట్ల రంగులతో కలిసిపోతుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పాముకు తల భాగంలో రెండు వైపులా పిట్స్ ఉంటాయి. ఈ పాములకు మాత్రమే ఇలాంటి ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. అందుకే వీటిని పిట్ వైపర్ అంటారు.
పిట్ వైపర్లలో అప్పటివరకు నాలుగు రకాలున్నాయి. మలబార్ పిట్ వైపర్, హార్స్‌షూ పిట్ వైపర్, హంప్ నోస్డ్ పిట్ వైపర్, హిమాలయన్ పిట్ వైపర్. వీటిని 70 ఏళ్ల కిందటే కనుగొన్నారు. 2019లో ఐదో రకానికి చెందిన పిట్ వైపర్‌ను కనుగొన్నారు. ఈ పిట్ వైపర్ పాములకు అరుదైన లక్షణాలున్నాయి. జీవుల శరీరంలోని వేడి ద్వారా అది ఏ తరహా జీవో అంచనా వేయడంతో పాటు వాటి ఆధారంగా వేట సాగించడం వీటి ప్రత్యేకత. దొరికింది మగజాతికి చెందిన పిట్ వైపర్.
ఈ పాము కప్పలు, బల్లులు, క్రిమికీటకాలు, అడవి ఎలుకలను తింటుంది. మూమెంట్ ఇతర పాములకంటే చాలా స్లో ఉంటది. కాకపోతే కాటు వేసేటప్పుడు మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. అరుణాచల్ పిట్ వైపర్ అనేది సాధారణంగా కాటు వేయదు. కానీ ఒకవేళ కాటు వేస్తే మాత్రం దాదాపు 10 నిమిషాల్లోనే తీవ్ర ప్రభావం ఉంటుందట.





