AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్ష్మీ కటాక్షాన్ని పొందాలంటే ఈ వాస్తు చిట్కాలు పాటించండి..! ధనవృద్ధికి దారి చూపుతాయి..!

వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇల్లు ఎలా ఉంటే మన జీవితం అలా ఉంటుంది. ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు, మనశ్శాంతి లోపం వంటి సమస్యలు వస్తాయి. పండితులు సూచించే కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను పాటిస్తే ఇంట్లో శుభశక్తి వెల్లివిరుస్తుంది. సంపద, శాంతి, ఆరోగ్యంతో జీవించేందుకు ఈ వాస్తు చిట్కాలను పాటించండి.

Prashanthi V
|

Updated on: Feb 15, 2025 | 3:11 PM

Share
ఇంటిని ప్రతి రోజూ శుభ్రంగా ఉంచడం ఎంతో అవసరం. శుభ్రపరిచిన తర్వాత కొంత పసుపును నీటిలో కరిగించి తమలపాకులతో ఇంటి నాలుగు మూలలలో ప్రోచడం ద్వారా ప్రతికూల శక్తులను తొలగించవచ్చు. అలాగే గంగాజలం చల్లడం ద్వారా ఇంటికి శుభశక్తిని ఆహ్వానించవచ్చు. ఇది ఇంట్లో వాస్తు దోషాలను తొలగించి ధన ప్రాప్తిని పెంచుతుంది.

1 / 9
ఇంట్లో ఎండిపోయిన పువ్వులు లేదా ప్లాస్టిక్ పువ్వులను ఉంచడం మంచిది కాదు. ఇంటిలో ఎండిన పువ్వులు ఉంటే ఆ పుష్పాలను తొలగించి కొత్త పువ్వులను ప్రతిరోజూ ఉంచడం అవసరం. పువ్వులు తాజాగా ఉంటేనే ఇంట్లో శుభశక్తి ఎక్కువగా ఉంటుంది.

2 / 9
ఇంట్లోని దేవాలయంలో ప్రతిరోజూ ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. దీపారాధన సమయంలో గంట మోగించడం మంచిది. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి శుభశక్తిని ఆకర్షిస్తుంది. అలాగే శంఖాన్ని ఊదడం ద్వారా ఇంటి వాతావరణం పవిత్రంగా మారుతుంది. దేవతామూర్తులకు సమర్పించిన పుష్పాలను ప్రతి రోజు మార్చడం అవసరం. పాత పుష్పాలను అలాగే ఉంచడం మంచిది కాదు. అదేవిధంగా దేవతా చిత్రాలను ఎదురెదురుగా ఉంచడం సమస్యలను కలిగించవచ్చు.

3 / 9
ఇంట్లో ఈశాన్య మూలలో లేదా బ్రహ్మ స్థానం వద్ద శుభ సమయానికి స్ఫటిక శ్రీయంత్రాన్ని ప్రతిష్టించాలి. శ్రీయంత్రం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఆకర్షించడమే కాకుండా ఇంటిలోని వాస్తు దోషాలను కూడా తొలగిస్తుంది. ఇది శుభ ఫలితాలను ఇస్తుంది.

4 / 9
ఇంట్లో మతపరమైన గ్రంథాలను ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. అవి పశ్చిమ దిశలో ఉండాలి. పరుపు లేదా దిండు కింద మతపరమైన పుస్తకాలను ఉంచడం అనాగరికం. ఇది ఇంట్లో ఆర్థిక సమస్యలు, మనశ్శాంతి లోపానికి దారితీస్తుంది. అందుకే పవిత్ర గ్రంథాలను గౌరవంతో ఉంచాలి.

5 / 9
ఇంటికి ప్రధాన ద్వారం వద్ద అశోక వృక్షాలను నాటడం వాస్తు శాస్త్రం ప్రకారం ఎంతో శుభప్రదం. ఈ వృక్షాలు ఇంటిలో ధననిక్షేపాన్ని పెంచుతాయి. అదేవిధంగా ఈశాన్య దిశలో చెత్త పేరుకుపోకుండా చూడాలి. అక్కడ భారీ వస్తువులను ఉంచకూడదు.

6 / 9
ఇంటి గోడలపై ప్రశాంతతను కలిగించే బొమ్మలను ఉంచాలి. ప్రకృతి దృశ్యాలు, పుష్పాలు, పవిత్ర నదుల చిత్రాలు శుభప్రదంగా ఉంటాయి. అయితే యుద్ధ దృశ్యాలు, హింసాత్మక చిత్రాలు ఇంట్లో ఉంచకూడదు. ఇవి ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచి కుటుంబ సభ్యుల్లో విభేదాలు కలిగించవచ్చు.

7 / 9
ఇంట్లో ఉపయోగించే చీపురును ఎప్పుడూ ప్రధాన ద్వారం వద్ద ఉంచకూడదు. ఇలా చేస్తే ఇంట్లో వాస్తు దోషం పెరిగి ఆర్థిక నష్టం కలుగుతుంది. అలాగే చీపురుపై బరువైన వస్తువులు ఉంచకూడదు. ఇది ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరగడానికి కారణమవుతుంది.

8 / 9
కొందరు రాత్రి పూట నిద్రపోలేక ఇబ్బంది పడతారు. ఇది వాస్తు దోషం వల్ల కావచ్చు. అలాంటి వారు దక్షిణ దిశలో పడుకోవడం మంచిది. ఇది మానసిక ప్రశాంతతను పెంచి నిద్ర లేమిని తగ్గిస్తుంది.

9 / 9