AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Interesting Facts: ఇది ప్రపంచంలోనే అరుదైన గ్రామం.. మేఘాలపైన గ్రామం.. వీరికి వర్షం అంటే ఎంటో తెలియదు!

Interesting Facts: ఇది ప్రపంచంలోనే అరుదైన గ్రామం. సాధారణంగా ఇళ్ల నిర్మాణాలు భూమిపై నిర్మించుకుంటాము. కానీ ఈ గ్రామంలోని ఇళ్లు ఏకంగా మేఘాలపైనే ఉంటాయి. అంతేకాదు ఇక్కడి ప్రజలకు వర్షం అంటేనే తెలియదు. అస్సలు వర్షం కురియదు. మేఘాలపై ఇళ్లు ఉండటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Interesting Facts: ఇది ప్రపంచంలోనే అరుదైన గ్రామం.. మేఘాలపైన గ్రామం.. వీరికి వర్షం అంటే ఎంటో తెలియదు!
Interesting Facts
Subhash Goud
|

Updated on: Mar 25, 2026 | 11:32 AM

Share

Interesting Facts: మన దేశంలో ప్రతి ఏడాది ఎలాగోలా వర్షాలు పడుతూనే ఉంటాయి. కానీ ప్రపంచంలో ఒక గ్రామం మాత్రం వర్షం అనే పదానికే దూరంగా ఉంటుంది. అక్కడి ప్రజలు వర్షాన్ని చూడటం చాలా అరుదు. అయినప్పటికీ ఆ ప్రాంతం ప్రకృతి సౌందర్యంతో పర్యాటకులను, ఫోటోగ్రాఫర్లను ఆకర్షిస్తూ ఉంటుంది. అక్కడ ప్రజలకు వర్షం అంటేనే పెద్దగా తెలియదు. దీనిని వింటేనే మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. కానీ ఇది నిజం.

వర్షం కురవని గ్రామం – అల్ హుతైబ్

యెమెన్ దేశంలోని అల్ హుతైబ్ గ్రామం ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడ దాదాపు వర్షం పడదు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, దీనికి స్పష్టమైన భౌగోళిక కారణాలు ఉన్నాయి.

ఎందుకు ఇక్కడ వర్షం పడదు?

ఈ గ్రామం సముద్ర మట్టానికి చాలా ఎత్తులో, పర్వత ప్రాంతంలో ఉంది. ముఖ్యంగా ఇది మేఘాల కంటే ఎత్తులో ఉండటం విశేషం. సాధారణంగా మేఘాలు పర్వతాల చుట్టూ చేరినా, ఈ గ్రామం ఉన్న ఎత్తుకు చేరడం చాలా అరుదు. అందుకే ఇక్కడ వర్షపాతం దాదాపు ఉండదు.

ఇవి కూడా చదవండి

ప్రత్యేకమైన వాతావరణం:

అల్ హుతైబ్‌లో ఉదయం సమయంలో ప్రకాశవంతమైన సూర్యకాంతి కనిపిస్తుంది. గ్రామం కింద మేఘాలు తేలియాడుతూ ఉండటంతో అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. రాత్రి వేళల్లో చల్లని గాలులు వీచి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది.

నీటి అవసరాలు ఎలా తీర్చుకుంటారు?

  • వర్షం లేకపోయినా, అక్కడి ప్రజలు తమ జీవన విధానాన్ని పరిస్థితులకు అనుగుణంగా మార్చుకున్నారు.
  • భూగర్భ జలాలు, నీరు నిల్వ చేసి ఉంటాయి. ఇటువంటి వనరుల ద్వారా నీటి అవసరాలను తీర్చుకుంటున్నారు. వర్షంపై ఆధారపడకుండా జీవించడం వారికి అలవాటైంది.

ప్రకృతి సౌందర్యం – ప్రధాన ఆకర్షణ:

పర్వతాలపై నిర్మించిన రాతి ఇళ్లు, చుట్టూ తేలియాడే మేఘాలు ఈ గ్రామాన్ని మరింత అందంగా మార్చేస్తాయి. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి ఫోటోగ్రాఫర్లు ఇక్కడికి వస్తుంటారు.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత:

ఈ గ్రామం దావూదీ బొహ్రా ముస్లిం సమాజానికి ఒక ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా ఉంది. ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. మొత్తంగా వర్షం లేకపోయినా ప్రకృతి అందాలు, ప్రశాంతత, ఆధ్యాత్మికత కలిసిన అరుదైన గ్రామంగా అల్ హుతైబ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

ఇది కూడా చదవండి: Gold Price Today: ఉన్నట్టుండి షాకిచ్చిన బంగారం, వెండి.. భారీగా పెరిగిన ధరలు

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
43 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. కుప్పకూలిన బంగారం, వెండి
43 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. కుప్పకూలిన బంగారం, వెండి
ఎలిఫెంట్ క్యాంప్‌లో ఘనంగా గున్న ఏనుగు పుట్టినరోజు వేడుకలు
ఎలిఫెంట్ క్యాంప్‌లో ఘనంగా గున్న ఏనుగు పుట్టినరోజు వేడుకలు
వేసవిలో పెరుగు త్వరగా పులిసిపోతుందా? ఇలా చేయండి.. బెస్ట్‌ ట్రిక్
వేసవిలో పెరుగు త్వరగా పులిసిపోతుందా? ఇలా చేయండి.. బెస్ట్‌ ట్రిక్
హైదరాబాద్ కల్చర్ ను గొప్పగా చూపించే సినిమా ఇది: దిల్ రాజు
హైదరాబాద్ కల్చర్ ను గొప్పగా చూపించే సినిమా ఇది: దిల్ రాజు
అతి చిన్న వయసులోనే మరణించిన టాలీవుడ్ తోపు హీరోయిన్స్ వీరే!
అతి చిన్న వయసులోనే మరణించిన టాలీవుడ్ తోపు హీరోయిన్స్ వీరే!
నాడు ఐపీఎల్ ప్లేయర్‌గా ఎంట్రీ.. నేడు ఆర్సీబీకి ఓనర్‌గా రీఎంట్రీ..
నాడు ఐపీఎల్ ప్లేయర్‌గా ఎంట్రీ.. నేడు ఆర్సీబీకి ఓనర్‌గా రీఎంట్రీ..
నా అక్షరానికి వెలకట్టి చెల్లించిన ఏకైక హీరో.. శ్రీశ్రీ ఆసక్తికర క
నా అక్షరానికి వెలకట్టి చెల్లించిన ఏకైక హీరో.. శ్రీశ్రీ ఆసక్తికర క
ఇది ప్రపంచంలోనే అరుదైన గ్రామం.. మేఘాలపైన గ్రామం.. వర్షమే పడదు!
ఇది ప్రపంచంలోనే అరుదైన గ్రామం.. మేఘాలపైన గ్రామం.. వర్షమే పడదు!
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్..నగరాల్లో తక్కువ ధరకే హాస్టల్స్‌
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్..నగరాల్లో తక్కువ ధరకే హాస్టల్స్‌
నిరుద్యోగులకు TGPSC హెచ్చరిక.. OTR అప్‌డేట్‌కు నేడే ఆఖరి ఛాన్స్
నిరుద్యోగులకు TGPSC హెచ్చరిక.. OTR అప్‌డేట్‌కు నేడే ఆఖరి ఛాన్స్