AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకుంటున్నారా? ఇక కొత్త రూల్స్‌!

Indian Railways: భారత రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక టికెట్‌ విధానంలో కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వస్తోంది. ఇక టికెట్‌ క్యాన్సిలేషన్‌ విధానంలో కీలక మార్పులు చేస్తోంది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి దశల వారిగా అమలు చేయనున్నారు..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకుంటున్నారా? ఇక కొత్త రూల్స్‌!
Indian Railways
Subhash Goud
|

Updated on: Mar 25, 2026 | 7:11 AM

Share

Indian Railways: భారత రైల్వే టికెట్‌ క్యాన్సిలేషన్‌ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. రైలు బయలుదేరే సమయాన్ని ఆధారంగా చేసుకుని రిఫండ్‌ విధానాన్ని సవరించింది. ఈ కొత్త మార్పులను రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) ప్రకటించారు. ఈ విధానం ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు దశలవారీగా అమల్లోకి రానున్నాయి.

కొత్త నిబంధనలు:

  1. 72 గంటల ముందు క్యాన్సిలేషన్‌: ప్రయాణానికి 72 గంటల ముందే కన్ఫామ్‌ టికెట్‌ రద్దు చేస్తే గరిష్ట రిఫండ్‌ లభిస్తుంది. అయితే కొంత క్యాన్సిలేషన్‌ ఛార్జీలు మినహాయించి మిగతా మొత్తాన్ని తిరిగి ఇస్తారు.
  2. 72 నుంచి 24 గంటల మధ్య: ఈ సమయంలో టికెట్‌ రద్దు చేస్తే ‘స్టాండర్డ్‌ పెనాల్టీ’ వర్తిస్తుంది. టికెట్‌ ధరలో సుమారు 25% కోత విధించి మిగిలిన మొత్తాన్ని రిఫండ్‌ చేస్తారు.
  3. 24 నుంచి 8 గంటల మధ్య: ఇది ‘లేట్‌ క్యాన్సిలేషన్‌’గా పరిగణిస్తారు. టికెట్‌ ధరలో 50% కోత విధించి మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తారు.
  4. 8 గంటల లోపు లేదా ట్రైన్‌ బయల్దేరిన తర్వాత: ఈ సమయంలో టికెట్‌ రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్‌ ఉండదు.

ప్రయాణికులకు అదనపు సౌకర్యాలు:

  1. బోర్డింగ్‌ పాయింట్‌ మార్పు: ఇప్పుడు ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు బోర్డింగ్‌ స్టేషన్‌ను మార్చుకునే అవకాశం ఉంది.
  2. కౌంటర్‌ టికెట్‌ క్యాన్సిలేషన్‌: ఇప్పటివరకు ట్రైన్‌ ప్రారంభ స్టేషన్‌లో మాత్రమే క్యాన్సిల్‌ చేసుకునే అవకాశం ఉండగా, ఇకపై ఏ స్టేషన్‌లోనైనా రద్దు చేసుకోవచ్చు.
  3. TDR ఆటోమేటిక్‌ రిఫండ్‌: ఇ-టికెట్‌ కలిగిన ప్రయాణికులు ఇకపై మాన్యువల్‌గా TDR ఫైల్‌ చేయాల్సిన అవసరం లేదు. నిబంధనల ప్రకారం ఆటోమేటిక్‌గా రిఫండ్‌ ప్రాసెస్‌ అవుతుంది.
  4. ట్రావెల్‌ క్లాస్‌ అప్‌గ్రేడ్‌: కౌంటర్‌ టికెట్‌ ఉన్నవారు ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు తమ క్లాస్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న క్యాన్సిలేషన్‌ ఛార్జీలు:

  • ఏసీ ఎగ్జిక్యూటివ్‌ / ఫస్ట్‌ క్లాస్‌: రూ.240 + GST
  • ఏసీ 2 టైర్‌: రూ.200 + GST
  • ఏసీ 3 టైర్‌ / ఛైర్‌ కార్‌: రూ.180 + GST
  • స్లీపర్‌: రూ.120
  • సెకండ్‌ క్లాస్‌: రూ.60

సమయం ఆధారంగా రిఫండ్‌ (పాత విధానం):

  • 48 గంటల ముందు: ఫిక్స్‌డ్‌ ఛార్జీలు
  • 48–12 గంటల మధ్య: 25% కోత
  • 12–4 గంటల మధ్య: 50% కోత
  • 4 గంటల లోపు: రిఫండ్‌ లేదు

మొత్తం మీద ఈ మార్పులు ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగించేలా, రిఫండ్‌ ప్రక్రియను సులభతరం చేసేలా రూపొందించారు.

ఇది కూడా చదవండి: Gold Price Today: కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
లబ్ధిదారులకు బిగ్‌ అలర్ట్.. ఆ లిస్ట్‌లో పేరు లేకుంటే రేషన్ కార్డు
లబ్ధిదారులకు బిగ్‌ అలర్ట్.. ఆ లిస్ట్‌లో పేరు లేకుంటే రేషన్ కార్డు
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక లీటర్‌ పెట్రోల్‌ కేవలం రూ.82కే..!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక లీటర్‌ పెట్రోల్‌ కేవలం రూ.82కే..!
రూపాయి ఖర్చులేని చిట్కా.. ఎండిపోయిన మనీ ప్లాంట్ పచ్చగా మారిపోద్ది
రూపాయి ఖర్చులేని చిట్కా.. ఎండిపోయిన మనీ ప్లాంట్ పచ్చగా మారిపోద్ది
ఆ సినిమా కోసం 2 నెలల్లో 16 కిలోలు తగ్గా.. సత్యదేవ్ ..
ఆ సినిమా కోసం 2 నెలల్లో 16 కిలోలు తగ్గా.. సత్యదేవ్ ..
బియ్యంలో పురుగులు పడుతున్నాయా?ఈ చిన్న చిట్కాలతో సమస్యకు గుడ్‌బై !
బియ్యంలో పురుగులు పడుతున్నాయా?ఈ చిన్న చిట్కాలతో సమస్యకు గుడ్‌బై !
మరో రూ.5 మేర పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? కారణం ఇదే!
మరో రూ.5 మేర పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? కారణం ఇదే!
చేపలు తిన్న తర్వాత శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
చేపలు తిన్న తర్వాత శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
స్టార్ హీరోలకే షాకిచ్చిన 63 ఏళ్ల హీరోయిన్..
స్టార్ హీరోలకే షాకిచ్చిన 63 ఏళ్ల హీరోయిన్..
ఇక అలాంటివేమి కుదరదు..వంట నూనెల ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం
ఇక అలాంటివేమి కుదరదు..వంట నూనెల ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం
బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే..
బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే..