AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish: చేపలు తిన్న తర్వాత శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..? ఇవి తెలిస్తే నోరెళ్లబెడతారు..

చేప పేరు వినగానే మాంసాహార ప్రియులకు నోరూరుతుంది. కానీ వాటిలో ఉండే సన్నటి ముళ్ళ వల్ల చాలామంది చేపలు తినడానికి వెనుకాడుతుంటారు. కొందరైతే ముళ్లు గొంతులో గుచ్చుకుంటాయనే భయంతో వీలైనంత దూరంగా ఉంటారు. అయితే ముళ్లకు భయపడి చేపలను దూరం చేసుకుంటే, అమూల్యమైన ఆరోగ్యాన్ని చేతులారా వదిలేసుకున్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Krishna S
|

Updated on: Jun 07, 2026 | 7:29 AM

Share
గుండెకు శ్రీరామరక్ష: చేపలలో లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇవి రక్త ప్రసరణను సక్రమంగా ఉంచడంతో పాటు రక్తనాళాల్లో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను సమర్థవంతంగా తగ్గిస్తాయి. వారంలో కనీసం రెండు సార్లు చేపలను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండెపోటు, ఇతర గుండె సంబంధిత సమస్యల ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

1 / 5
జ్ఞాపకశక్తి డబుల్: పిల్లల నుండి పెద్దల వరకు అందరి మెదడు పనితీరును మెరుగుపరచడంలో చేపలలోని పోషకాలు అద్భుతంగా సహాయపడతాయి. ఇవి జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచడమే కాకుండా నేటి ఆధునిక కాలంలో వేధిస్తున్న మానసిక ఒత్తిడి , ఆందోళనలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీ డైట్‌లో క్రమం తప్పకుండా చేపలను చేర్చుకుంటే వయసు పెరిగినా మెదడు చురుకుదనం తగ్గకుండా ఉంటుంది.

2 / 5
 హై క్వాలిటీ ప్రోటీన్: కండరాల పెరుగుదలకు, శారీరక బలానికి ప్రోటీన్ చాలా అవసరం. చేపలలో అత్యంత నాణ్యమైన ప్రోటీన్ లభిస్తుంది. ఇది శరీరంలోని దెబ్బతిన్న కణజాలాలను త్వరగా బాగుచేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లేవారు, క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు తమ కండరాల దృఢత్వం కోసం చికెన్, మటన్ కంటే చేపలను ఎంచుకోవడం అత్యంత ఉత్తమమైన ఆప్షన్.

3 / 5
బరువు కంట్రోల్: చేపలలో కొవ్వు శాతం చాలా తక్కువగా, పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ డైట్. అయితే నూనెలో డీప్ ఫ్రై చేసిన చేపల కంటే... చేపల పులుసు, ఉడకబెట్టిన లేదా గ్రిల్ చేసిన చేపలను తినడం వల్ల పూర్తి పోషకాలు అందుతాయి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. వీటిలో ఉండే విటమిన్ డి, కాల్షియం వంటి ఖనిజాలు ఎముకలను ఉక్కులా మార్చడంతో పాటు శరీర రోగనిరోధక శక్తిని  బూస్ట్ చేస్తాయి.

4 / 5
ఆరోగ్యకరమైన జీవితానికి చేపలు ఒక గొప్ప ఆహారం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేదా అలర్జీలు ఉన్నవారు తమ ఆహారపు అలవాట్లను మార్చుకునే ముందు ఒకసారి వైద్యులను సంప్రదించడం మంచిది. అంతేకాకుండా ఏదైన మితంగా తినడమే మంచిది.

5 / 5
Follow Us
చేపలు తిన్న తర్వాత శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

స్టార్ హీరోలకే షాకిచ్చిన 63 ఏళ్ల హీరోయిన్..

ఇక అలాంటివేమి కుదరదు..వంట నూనెల ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం

బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే..

ఛాలెంజ్‌..జస్ట్‌ 10 రోజులు టీ తాగడం మానేస్తే,.శరీరంలో జరిగేది ఇదే

జీలకర్ర vs మెంతుల నీళ్లు.. పొట్ట కొవ్వు తగ్గించడానికి ఏది బెస్ట్?

తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..?

సామాన్యులకు బిగ్‌ షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!

Video: గాయపడిన పక్షికి ప్రేమగా ఆహారం తినిపించిన తోటి నేస్తం!

మహిళలకు అదిరిపోయే శుభవార్త.. రూ.4 వేలు తగ్గిన బంగారం ధర..