AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంకుల మూసివేత.. కిలో మీటర్ మేర క్యూ కట్టిన వాహనాలు

Hyderabad: పెట్రోల్ బంకులు మూసేస్తున్నారని పుకార్లతో భారీగా హైదరాబాదులో క్యూ కట్టిన వాహనదారులు. నగరంలో ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల కిలోమీటర్ మేర వాహనదాలు కూ కట్టాయి. ఒక్కసారిగా భారీగా రద్దీ ఏర్పడటంతో ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులకు సర్ది చెబుతున్నారు. అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది.

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంకుల మూసివేత.. కిలో మీటర్ మేర క్యూ కట్టిన వాహనాలు
Petrol Pump
Subhash Goud
|

Updated on: Mar 25, 2026 | 7:43 AM

Share

Hyderabad: గత రెండు రోజులుగా నగరంలోని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన కూడళ్లలో ఉన్న అనేక పెట్రోల్ బంకుల వద్ద “నో స్టాక్” బోర్డులు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఎండలు మండుతున్న సమయంలో ఇంధనం లేక ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, అందుబాటులో ఉన్న కొద్ది బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న పుకార్లు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి పెట్రోల్‌ బంకుల వద్ద వాహనదారులు భారీ స్థాయిలో క్యూకట్టారు.

అసలు కారణం ఇదే..

ప్రస్తుతం యుద్ధం కారణంగా పెట్రోల్‌ విషయంలో పుకార్లు షికారు చేస్తున్నాయి. సాధారణంగా ఇంధన కొరత అంటే నిల్వలు తక్కువయ్యాయని భావిస్తారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అలాంటిది కాదని తెలుస్తోంది. ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీలు తీసుకొచ్చిన కొత్త ఆర్థిక నిబంధనలే ఈ కృత్రిమ కొరతకు కారణంగా మారాయి.

ఇది కూడా చదవండి: Gold Price Today: కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..

పుకార్లను నమ్మి..

పెట్రోల్ బంకులు మూసేస్తున్నారని పుకార్లతో భారీగా హైదరాబాదులో క్యూ కట్టిన వాహనదారులు. ఒక్కసారిగా భారీగా రద్దీ ఏర్పడటంతో ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులకు సర్ది చెబుతున్నారు. అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో పెట్రోల్‌ బంకు యజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టిస్తూ సొమ్ము చేసుకుటున్నాయి.

ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ఎల్పిజి తగినంత రాష్ట్రంలో ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ.. వాహనదారులు ఏ మాత్రం పట్టించుకోకుండా ఆందోళనకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో ప్రకటనలు, పుకార్లతో నమ్మి భారీగా పెట్రోల్ బంకల వద్ద వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకుంటున్నారా? ఇక కొత్త రూల్స్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us