Indian Railway New Rule: రైలులో ప్రయాణించాలంటే ఆ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసే ఆలోచనల్లో భారత రైల్వే..!
RT-PCR నెగటివ్ రిపోర్టుకు బదులుగా.. ప్రయాణీకులకు కరోనా టీకా సర్టిఫికేట్ తప్పనిసరి చేయాలని భావిస్తోంది. ఈ నిబంధనతో టీకా తీసుకునేవారి సంఖ్య వేగంగా పెరుగుతుందని...
కరోనా వైరస్ ప్రభావం భారత రైల్వే సేవలపై కూడా పడింది. ప్రస్తుతం అన్ని రైల్వేలు రైళ్లను కూడా నడపడం లేదు. మరియు ప్రయాణీకులకు ప్రయాణానికి సంబంధించి అనేక నియమాలు రూపొందించబడ్డాయి. అనేక రాష్ట్రాల మాదిరిగా RTPCR నివేదికను అంటే రైలులో వచ్చే ప్రయాణీకులకు కరోనా టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. ఈ కారణంగా మీరు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ప్రయాణించడానికి కరోనా పరీక్ష చేయించుకోవాలి. అయితే, త్వరలోనే రైల్వే ఈ నిబంధనలలో మార్పులు చేసే అవకాశం ఉంది.
ప్రయాణ సమయంలో కరోనా టెస్ట్ రిపోర్ట్ అవసరాన్ని రైల్వేలు త్వరలోనే తొలగించగలవని దీనికి కొత్త నిబంధనలు జారీ చేయవచ్చని తెలుస్తోంది. అటువంటి పరిస్థితిలో ప్రయాణికుల కోసం రైల్వే ప్రణాళిక ఎలా ఉంటుదనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది.
ఓ ప్రముఖ ఎకనామిక్ పత్రిక నివేదిక ప్రకారం.. త్వరలో రైలులో ప్రయాణించడానికి కరోనా RT-PCR పరీక్షను నిర్వహించాల్సిన అవసరం ఉండక పోవచ్చని తెలుస్తోంది. అనేక రాష్ట్రాలకు వెళ్లడానికి RT-PCR నెగటివ్ రిపోర్ట్ అవసరం ఉంటుంది. ఈ నియమం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని…. ఇప్పుడు ఈ నియమాన్ని మార్చవచ్చని తెలుస్తోంది.
ఏమి మారుతుంది?
ఈ నివేదిక ప్రకారం RT-PCR నెగటివ్ రిపోర్టుకు బదులుగా.. ప్రయాణీకులకు కరోనా టీకా సర్టిఫికేట్ తప్పనిసరి చేయాలని భావిస్తోంది. ఈ నిబంధనతో టీకా తీసుకునేవారి సంఖ్య వేగంగా పెరుగుతుందని అనుకుంటోంది. ప్రయాణీకులు కావాలనుకుంటే వారు తమ టీకాల ధృవీకరణ పత్రాన్ని ఆరోగ్య సేతు యాప్‌లో కూడా చూపవచ్చు. టీకా ప్రక్రియ వేగంగా సాగితే ప్రయాణికులు నమ్మకంగా ప్రయాణించే అవకాశం ఉంది.
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి రిజర్వు చేసిన టిక్కెట్లపై మాత్రమే ప్రయాణించడం, సామాజిక దూరం, తప్పనిసరి మాస్కులు ధరించడం వంటి కోవిడ్ నియమాలు అమలు చేయబడ్డాయి. వీటితో పాటు రైలులోని ఎసి కోచ్‌లో ప్రయాణికులకు దుప్పట్లు మొదలైనవి కూడా ఇవ్వడం లేదు.