Marriage Function: మొదలు కానున్న పెళ్లిళ్ల సీజన్.. 40 లక్షల వివాహలు..రూ. 5లక్షల కోట్ల వ్యాపారం జరగనున్నట్లు అంచనా

Marriage Function: కరోనా వైరస్(Corona Virus) క్రమంగా అదుపులోకి రావడంతో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. అంతేకాదు.. ప్రభుత్వం కరోనా నిబంధనలను కొనసాగిస్తూ ఆంక్షలను తొలగించింది. ఇప్పటికే హోలీ పండగ..

Marriage Function: మొదలు కానున్న పెళ్లిళ్ల సీజన్.. 40 లక్షల వివాహలు..రూ. 5లక్షల కోట్ల వ్యాపారం జరగనున్నట్లు అంచనా
Marraige
Follow us

|

Updated on: Mar 31, 2022 | 1:00 PM

Marriage Function: కరోనా వైరస్(Corona Virus) క్రమంగా అదుపులోకి రావడంతో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. అంతేకాదు.. ప్రభుత్వం కరోనా నిబంధనలను కొనసాగిస్తూ ఆంక్షలను తొలగించింది. ఇప్పటికే హోలీ పండగ (Holi Festival) సందర్భంగా దేశ వ్యాప్తంగా వ్యాపారం జోరుగా సాగింది. ఇప్పుడు వ్యాపారస్తులు పెళ్ళిళ్ళ సీజన్ కు రెడీ అవుతున్నారు. రెండేళ్లుగా మూగబోయిన పెళ్లిళ్ల సీజన్‌..కరోనా తగ్గుముఖం పట్టడంతో ఏడాది మొదటి పెళ్ళిళ్ళ సీజన్ బ్యాండ్‌ బాజాలతో మళ్ళీ కళను సంతరించుకోనుంది. దేశ వ్యాప్తంగా ఏప్రిల్‌ నుంచి జులై వరకు పెళ్లిళ్ల సీజన్‌ కొనసాగనుంది. దీంతో వివాహ శుభకార్యాలు ఘనంగా జరిపించేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకూ ఈ నాలుగు నెలల్లో దేశవ్యాప్తంగా దాదాపు 40లక్షల వివాహాలు జరగనున్నట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు రూ.5లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగనున్నట్లు వ్యాపార సంఘాలు అంచనా వేస్తున్నాయి. నిజానికి పెళ్లి వేడుకలో పెట్టె డబ్బులో ఎక్కువ భాగం వస్తువులు, బట్టలు, నగలు, వంటి అనేక రంగాల వ్యాపార సంస్థలకు వెళ్తుంది.

దేశంలో కరోనా నియంత్రణలో భాగంగా కొంతమంది కొవిడ్‌ ఆంక్షలు మధ్య పరిమిత సంఖ్యలో సన్నిహితుల మధ్య వివాహ వేడుకను నిర్వహించారు. అయితే ఎక్కువమంది తమ ఇంట పెళ్లి ఘనంగా జరపుకోవాలని చుట్టాలు, స్నేహితులు అందరూ రావాలి అంటూ పెళ్ళిళ్ళను వాయిదా వేసుకున్నారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం కరోనా అదుపులోకి వచ్చింది. దీంతో కరోనా కు ముందు ఏ విధంగా వివాహవేడుకలను నిర్వహించేవారో అదే విధంగా ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్‌ కు మునుపటి శోభ తీసుకుని రానున్నదని తెలుస్తోంది. వచ్చే నాలుగు నెలల్లో దేశవ్యాప్తంగా మొత్తం 40లక్షల వివాహాలు జరుగుతాయని.. సుమారు రూ.5లక్షల కోట్ల లావాదేవీలు జరిగే అవకాశం ఉందని కన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (CAIT) పేర్కొంది. ఈ పెళ్ళిళ్ల సీజన్‌లో దేశ రాజధాని ఢిల్లీలోనే మూడు లక్షలకు పైగా వివాహాలు జరుగుతాయని.. దీని వల్ల దాదాపు ₹ 1 లక్ష కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు.

ఒక్కో పెళ్లికి సగటున రూ. 2 లక్షల అంచనా వ్యయంతో దాదాపు ఐదు లక్షల వివాహాలు జరుగుతాయని CAIT జాతీయ అధ్యక్షుడు BC భారతియా అంచనా వేశారు. దాదాపు 10 లక్షల వివాహాలు ఒక్కో పెళ్లికి రూ. 5 లక్షలు ఖర్చు చేస్తాయని.. అదే సంఖ్యలో పెళ్లిళ్లకు రూ. 10 లక్షలు ఖర్చు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 50,000 పెళ్లిళ్లు రూ. 50 లక్షల అంచనాతో జరగనుండగా.. మరో 50వేల వివాహవేడుకలు కోటి రూపాయల ఖర్చుతో చేయనున్నారని సీఏఐటీ తెలిపింది. భారతీయ వివాహాలలో 20% ఖర్చు వధూవరుల ఆభరణాలకే అవుతుండగా.. 80శాతం ఇతర ఖర్చులు పెడుతున్నట్లు సమాచారం. ఆభరణాలు, దుస్తులు, పాదరక్షలు, గ్రీటింగ్ కార్డ్‌లు, డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, పండ్లు, ఎలక్ట్రానిక్స్ బైక్స్, కార్లు, కల్యాణ మండపాలు మొదలు, అలంకరణ, క్యాటరింగ్‌, ఆభరణాలు, నూతన వస్త్రాలు, ఆహ్వాన పత్రికలు, వాహనాలుతోపాలు భిన్న రంగాల్ల్లో వ్యాపార లావాదేవీలు పెరుగుతాయని పేర్కొంది. వివాహ వేడుక సందర్భంగా ఇంటి మరమ్మతులు, పెయింటింగ్స్ లకు కూడా భారీ గ పెట్టుబడి పెడతారు. దీంతో ఈ రంగలో కూడా వ్యాపార లావాదేవీలు జరగనున్నాయని తెలుస్తోంది.

Also Read:

Viral Video: కర్మ సిద్ధాంతం నిజమేనని ఈ వీడియో చూస్తే మీరూ నమ్ముతారు.

Vastu Tips: ఈ మొక్కను ఇంట్లో నాటడం శుభప్రదం.. దీని ప్రయోజనాలు ఏమిటంటే..