Tenkasi: కక్కుర్తి తగలెయ్య! ఆటోలో 25 మంది విద్యార్ధులను కుక్కిన స్కూల్‌ టీచర్‌..వైరల్ వీడియో!

బాధ్యతాయుతమైన టీచర్‌ వృత్తిలో కొనసాగుతూ ముక్కుపచ్చలారని పసిపిల్లలను ఆటోలో ఎలా కుక్కుతుందో చూడండి..

Tenkasi: కక్కుర్తి తగలెయ్య! ఆటోలో 25 మంది విద్యార్ధులను కుక్కిన స్కూల్‌ టీచర్‌..వైరల్ వీడియో!
School Kids
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 31, 2022 | 12:53 PM

Viral Video of a teacher loading over 25 kids in an auto: తమిళనాడులోని తెన్‌కాశి జిల్లాకు చెందిన అవుడయ్యనూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలకు చెందిన ఒక టీచర్, 25 మంది పాఠశాల విద్యార్థులను (School students) ఒకే ఆటోలో కుక్కుతున్న వీడిమొ ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. 6 నుంచి 10 ఏళ్ల వయసున్న చిన్నారులను దగ్గరుండి ఆటోలో ఓవర్‌లోడ్ చేయించడం ఈ వీడియోలో కనిపిస్తుంది. పైగా వీడియో తీస్తున్న వ్యక్తిని దుర్భషలాడుతూ, వీడియో చిత్రీకరించకుండా అడ్డుకోవడం కూడా ఈ వీడియోలో చూడొచ్చు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..

అవుడయ్యనూర్ గ్రామం (Avudaiyanur village)లోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలకు ఇటీవల కాలంలో అడ్మిషన్లు తీసుకునే విద్యార్ధుల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులను ఇతర ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ చేయాలని విద్యాశాఖ భావించింది. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు.. ట్రాన్ఫర్ల నుంచి తప్పించుకోవడానికి ఓ పథకం పన్నారు. అదేంటంటే.. సమీప గ్రామాల నుంచి పాఠశాలకు వచ్చే పిల్లలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని నమ్మబలికి, తమ పాఠశాలలో అడ్మిషన్‌ తీసుకునేలా పిల్లల తల్లిదండ్రులను ఒప్పించారు. చేసిన వాగ్ధానం ప్రకారం పిల్లలకు బస్సు లేదా వ్యాన్‌ ఏర్పాటు చేయడానికి బదులు.. ఒకే ఒక ఆటోలో ప్రమాదకర రీతిలో పిల్లలను ఎక్కించి పాఠశాలకు తీసుకెళ్లడం ప్రారంభించారు. దీనిపై కొంత మంది తల్లిదండ్రులు పాఠశాల యాజమన్యానికి పలు మార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని వాపోయారు. సమాచారం అందుకున్న తెన్‌కాశి జిల్ల ఛీప్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ (CEO) సదరు పాఠశాల టీచర్లు, హెడ్‌ మాస్టర్‌ను తక్షణమే విచారణకు హాజరవ్వాల్సిందిగా బుధవారం (మార్చి 30) ఆదేశించారు.

పాఠశాల తీరుపై ఛీప్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ (CEO) ఎమ్‌ కబీర్‌, బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ (BEO) ముత్తులింగం మీడియాతో మాట్లాడుతూ.. సంఘటనపై విచారణకు ఆదేశించామని, విచారణ అనంతరం నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు మోటారు వాహన చట్టాన్ని ఉల్లంఘించినందుకు పావూర్‌చత్రం పోలీసులు ఆటోరిక్షా డ్రైవర్ అతియప్పన్ (38)పై కేసు నమోదు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో పలు స్కూల్ వాహనాలు ప్రమాదాలకు గురైన సంఘటనలు చోటుచేసుకోవడంతో, ప్రమాదాలను అరికట్టడానికి తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక మోటర్‌ వెహికల్స్‌ చట్టాన్ని 2012 (రెగ్యులేసన్స్‌ అండ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ స్కూల్‌ బస్సెస్) తీసుకొచ్చింది. ఐతే అనేక పాఠశాలలు ఈ నిబంధనను పెడచెవిన పెట్టి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.

Also Read:

NAAC Recruitment 2022: రూ.50 వేల జీతంతో..నేషనల్ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడియేషన్‌ కౌన్సిల్‌లో ఉద్యోగాలు..అర్హతలివే!