AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: నార్త్ ఈస్ట్ కార్నర్‌లో ఇల్లు కొనాలని అనుకుంటున్నారా..?

వాస్తు శాస్త్రం ప్రకారం.. నార్త్ ఈస్ట్ కార్నర్‌లో ఇల్లు ఉండటం చాలా శుభమని నమ్ముతారు. ఈ ప్రాంతం ధనవృద్ధి, ఆరోగ్యం, విద్య, సంతోషాన్ని కలిగిస్తుందని భావిస్తారు. ఇక్కడి శక్తి సానుకూలంగా ఉంటుంది కాబట్టి పూజ గది, నీటి ట్యాంక్ వంటివి ఇక్కడ ఏర్పాటు చేయడం మంచిదట.

Vastu Tips: నార్త్ ఈస్ట్ కార్నర్‌లో ఇల్లు కొనాలని అనుకుంటున్నారా..?
Vastu Tips
Prashanthi V
|

Updated on: Jan 26, 2025 | 9:55 PM

Share

నార్త్ ఈస్ట్ కార్నర్‌లో ఇల్లు కొనాలని అనుకుంటున్నారా..? ఈ విషయాలు మానసికంగా, శారీరకంగా మీరు సుఖంగా ఉండే విధంగా ఉన్నాయని తెలుసుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం.. అత్యంత పవిత్రమైన దిక్కు ఈశాన్య (North-East) కోణం. ఇది సానుకూల శక్తిని ప్రసరించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆ కారణంగా ఈ దిక్కులో ఇల్లు ఉండటం చాలా శుభమని నమ్ముతారు. అయితే ఈ శుభకరమైన దిక్కులో ఇల్లు ఉండాలంటే కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం అవసరం.

ఈశాన్య దిక్కు ప్రాముఖ్యత

ఈశాన్య దిక్కు పవిత్రతను, ధనవృద్ధిని, ఆరోగ్యం, శాంతి, విజయం సాధనతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా దేవతలకు సంబంధించిన స్థలంగా భావించబడుతుంది. ఆరోగ్యం, సంతోషం తరగని ప్రవాహాలను ఈ దిక్కు నుంచి పొందవచ్చు. ఇది జ్ఞానం, విద్యతో కూడా సంబంధం కలిగి ఉండడం వల్ల ఈ దిక్కులో ఇల్లు ఉంటే పిల్లలు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారని నమ్ముతారు.

జాగ్రత్తలు తప్పనిసరి

ఈశాన్య కోణంలో ఇల్లు ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. మురికి, బరువులు లేదా అనవసరమైన వస్తువులు దానిలో ఉంచకూడదు. అదేవిధంగా ఈశాన్య దిక్కు లోనే నీటి బావి, బోరు లేదా ట్యాంక్ ఉంటే అది మరింత శుభప్రదంగా ఉంటుంది.

కొన్ని ముఖ్యమైన నియమాలు

ఈశాన్య దిక్కులో వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ఉంటే చాలా మంచిది. పూజ గదిని ఈశాన్య కోణంలో ఏర్పాటు చేయడం ఉత్తమం. వంటగదిని ఈశాన్య లోపల ఏర్పాటు చేయకూడదు ఎందుకంటే ఇది అగ్ని, నీటి తత్వాల మధ్య వివక్షకు దారితీస్తుంది. ఈశాన్య కోణంలో మరుగుదొడ్డి ఏర్పాటు చేయడం మంచిది కాదని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. అది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందట. ఈశాన్య దిక్కులో మెట్లు ఉండకూడదు.

వాస్తు దోషాలు

ఈశాన్య కోణంలో వాస్తు దోషాలు ఏర్పడితే వాటిని పరిష్కరించడానికి వివిధ పరిష్కారాలు ఉన్నాయి. మొదటగా ఆ ప్రాంతం శుభ్రంగా ఉంచడం, బరువులు తొలగించడం, అశుభాల నుండి దూరంగా ఉండడం చాలా అవసరం. కొన్నిసార్లు వాస్తు నిపుణుల సలహా తీసుకోవడం కూడా మంచి పరిష్కారం.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)