Name Change: మీ పేరు మార్పు చేసుకోవాలనుకుంటున్నారా..? ఈ విధానాలను మీరు తప్పకుండా అనుసరించాలి..!

Name Change: కొందరికి రకరకాల పేర్లు పిలుస్తుంటారు. ఇంట్లో ఒక పేరుతో పిలుస్తుంటే.. బయట మరో పేరుతో పిలుస్తుంటారు. అంతేకాదు కొందరైతే వివిధ గుర్తింపునకు సంబంధించిన..

Name Change: మీ పేరు మార్పు చేసుకోవాలనుకుంటున్నారా..? ఈ విధానాలను మీరు తప్పకుండా అనుసరించాలి..!
Follow us

|

Updated on: May 29, 2021 | 1:36 PM

Name Change: కొందరికి రకరకాల పేర్లు పిలుస్తుంటారు. ఇంట్లో ఒక పేరుతో పిలుస్తుంటే.. బయట మరో పేరుతో పిలుస్తుంటారు. అంతేకాదు కొందరైతే వివిధ గుర్తింపునకు సంబంధించిన పత్రాల్లో పేర్లు, ఇంటి పేరు వేరేవేరుగా ఉంటాయి. అలాంటి సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనలు మరింత కఠినతరం ఉండటంతో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ల నుంచి ఆధార్‌ కార్డు వరకు ఒకే పేరుతో ఉంటే పనులు జరుగుతాయి. లేకపోతే ఇబ్బందులు పడక తప్పదు. అలాగే చాలా మందిలో ఓటర్‌ ఐడి, రేషన్‌ కార్డుల్లో ఒక పేరు ఉంటే ఆధార్‌ కార్డులో మారు పేరు ఉంటుంది. అలాగే భారతీయులు ఇతర దేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టు తీసుకోవాలంటే కూడా అన్ని పత్రాలపై ఒకే పేరు ఉండటం చాలా ముఖ్యం. అటువంటి సమయంలో సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారం కూడా ఉంది. భారతదేశంలో పేరు మార్చడానికి మూడు విధానాలు తప్పనిసరి. ఇవి లేకుండా మీ పేరును మార్చలేరు. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ. అవి ఏంటంటే..

1. అఫిడవిట్‌ సమర్పణ: పేరు మార్చడానికి అఫిడవిట్‌ తయారీ. 2. ప్రకటన ప్రచురణ: పేరు మార్పు కోసం పత్రిక ప్రకటన ఇవ్వాలి. 3. గెజిట్‌ నోటిఫికేషన్‌: పేరు మార్పునకు సంబంధించిన నోటిఫికేషన్‌ గెజిట్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రచురించబడాలి.

అఫిడవిట్‌ ఇవ్వడం..

పేరు మార్చడానికి మొదట మీరు అఫిడవిట్‌ సమర్పించాల్సి ఉంటుంది. దీని కోసం మీరు నోటరీ కోసం అడ్వకేట్‌ను సంప్రదించాలి. దీని తర్వాత నోటరీ అవసరమైన స్టాంప్‌ పేపర్‌పై పేరు మార్చడానికి అఫిడవిట్‌ సిద్ధం చేస్తారు. దీనిపై మీరు మీ ప్రస్తుత పేరు, మీరు మార్పు చేసుకునే కొత్త పేరును పేర్కొనాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం చిరునామా కూడా ముఖ్యం. అలాగే స్టాంప్‌ పేపర్‌పై అఫిడవిట్‌ను ముద్రించిన తర్వాత ఇద్దరి సాక్షుల సంతకం. చట్టపరమైన ప్రక్రియపై గెజిట్‌పై ఇద్దరు అధికారుల సంతకం కావాలి. అయితే ఒక ప్రవాస భారతీయుడు తన పేరును మార్చుకోవాల్సి వస్తే అతడు భారతదేశం హైకమిషన్‌ కార్యాలయం లేద భారత రాయబార కార్యాలయం చేత సంతకం చేయబడిన అఫిడవిట్‌ కలిగి ఉండాలి. ఏవైనా సందేహాలున్నా నోటరీ వద్ద తెలుసుకోవచ్చు.

వార్తపత్రికల్లో ముద్రించడం:

మీ పేరు మార్పు గురించి స్థానిక వార్తపత్రికల్లో ప్రచురించాలి. ఇందులో మీరు పేరు మార్పు గురించి ప్రచురితం అయ్యేలా చూడాలి. కనీసం రెండు పత్రికల్లో ఈ ప్రచురణ కావాలి. ఒకటి రాష్ట్ర అధికార భాషలో, మరొకటి ఆంగ్ల దినపత్రికలో తప్పకుండా ప్రచురించాలి.

గెజిట్‌ నోటిఫికేషన్‌

చివరికి మీరు మీ గెజిట్‌ పేరును నోటిఫికేషన్‌లో ప్రచురించాలి. పేరు మార్పుపై ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌ కార్యాలయంలో పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ విధానాలు పూర్తయిన తర్వాత పేరు మార్పు జరుగుతుంది.

ఇవీ కూడా చదవండి:

Viral News: అక్కడ వర్షం పడితే వజ్రాలే.. జోరందుకున్న డైమండ్స్ వేట.. ఎక్కడో తెలుసా.?

Viral News: వామ్మో 16 గంటల స్నానం.. ఆ మహిళ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానాలిస్తున్న నెటిజన్లు..

Latest Articles
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు