Viral News: అక్కడ వర్షం పడితే వజ్రాలే.. జోరందుకున్న డైమండ్స్ వేట.. ఎక్కడో తెలుసా.?

అక్కడ వర్షాలు పడితే చాలు.. మట్టిలో వజ్రాలు పండుతాయి. చినుకు చినుకు పడే కొద్దీ మట్టి పొరల్లో దాగిన విలువైన వజ్రాలు బయట పడతాయి...

Viral News: అక్కడ వర్షం పడితే వజ్రాలే.. జోరందుకున్న డైమండ్స్ వేట.. ఎక్కడో తెలుసా.?
Dimonds
Follow us
Ravi Kiran

|

Updated on: May 29, 2021 | 11:22 AM

అక్కడ వర్షాలు పడితే చాలు.. మట్టిలో వజ్రాలు పండుతాయి. చినుకు చినుకు పడే కొద్దీ మట్టి పొరల్లో దాగిన విలువైన వజ్రాలు బయట పడతాయి. దీంతో అక్కడి స్థానికులతో పాటు..పక్క జిల్లాలు, రాష్ట్రాల నుండి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ వజ్రాల వేట సాగిస్తుంటారు. తెల్లవారింది మొదలు…తిరిగి పొద్దుగూకే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వజ్రాల వేటకొనసాగిస్తారు. ఇదంతా ఎక్కడో కాదు..ఏపీలోని కర్నూలు జిల్లాలో…

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చిన్న జొన్నగిరి గ్రామంలో మే 27న ఓ రైతుకు విలువైన వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి కోటి ఇరవై ఐదు లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే, బహిరంగ మార్కెట్‌లో ఈ వజ్రం విలువ సుమారు నాలుగు కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఇదిలా ఉంటే పెరవలికి చెందిన మరో ఇద్దరికీ రెండు ఖరీదైన వజ్రాలు లభ్యమైనట్లుగా తెలుస్తోంది. బొప్పాయి తోటలో కలుపు తొలగిస్తున్న మహిళా కూలీకి వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని ఓ వ్యాపారి 70 వేలకు కొనుగోలు చేశాడు. అలాగే పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న మరో మహిళా కూలికి వజ్రం లభ్యం కాగా, పెరవలికి చెందిన వ్యాపారికి 40 వేలకు అమ్మినట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడి స్థానిక రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో వేట సాగిస్తున్నారు.

కోట్లు విలువ చేసే వజ్రాల ను అక్కడి వ్యాపారస్తులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు ఇంత భారీ మొత్తంలో వజ్రాలు దొరికినా అక్కడి రెవెన్యూ అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని, ఆ దరిదాపులకి కూడా వెళ్లరనే విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యంత విలువైన వజ్రాలను వ్యాపారులు తక్కువ రేట్‌కు కొని ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

Also Read:

Viral News: వామ్మో 16 గంటల స్నానం.. ఆ మహిళ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానాలిస్తున్న నెటిజన్లు..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్.. ప్రయాణీకులు లేక.. పలు ప్రత్యేక రైళ్లు రద్దు.. వివరాలివే..

TS Eamcet: తెలంగాణ ఎంసెట్ వాయిదా పడే అవకాశం.! ఆగష్టులో నిర్వహణ.!!