తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్.. ప్రయాణీకులు లేక.. పలు ప్రత్యేక రైళ్లు రద్దు.. వివరాలివే..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్య అలెర్ట్. కోవిడ్ ప్రభావం కారణంగా ప్రయాణీకుల సంఖ్య తగ్గడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్.. ప్రయాణీకులు లేక.. పలు ప్రత్యేక రైళ్లు రద్దు.. వివరాలివే..
Follow us
Ravi Kiran

|

Updated on: May 29, 2021 | 10:41 AM

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్య అలెర్ట్. కోవిడ్ ప్రభావం కారణంగా ప్రయాణీకుల సంఖ్య తగ్గడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది. విజయవాడ మీదుగా నడుస్తున్న ఎనిమిది రైళ్లను జూన్ 11 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు కీలక ప్రకటనలో తెలియజేశారు. విశాఖపట్నం నుంచి కాచిగూడ వచ్చే ప్రత్యేక రైళ్లును జూన్‌ 1వ తేది నుంచి 10వ తేది వరకు నిలిపివేసింది దక్షిణ మధ్య రైల్వేశాఖ. ఇక కాచిగూడ, విశాఖపట్నం, భువనేశ్వర్‌–పుణే, పుణే–భువనేశ్వర్‌, అలాగే కడప టూ విశాఖపట్నం, లింగపల్లి నుంచి విశాఖట్నం ట్రైన్లు కూడా రద్దు కాబోతున్నట్లు అనౌన్స్‌మెంట్‌ చేసింది.

ఇక ఇప్పటికే.. పలు ప్రాంతాల మధ్య నడిచే 28 ప్రత్యేక రైళ్లను రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 30 రైళ్లు సైతం రైల్వేశాఖ రద్దు చేసింది. శతాబ్ది, జనశతాబ్ది, దురంతో, రాజధాని రైళ్లు రద్దు చేస్తున్నట్లు స్పషంచేసింది. కరోనా ఉధృతి కారణంగా రైళ్లలో రద్దీ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇక యస్‌ తుఫాన్‌ ప్రభావంతో, దేశవ్యాప్తంగా పలు రైళ్లను ఇప్పటికే క్యాన్సల్‌ చేసింది రైల్వేశాఖ. 22 ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

విజయవాడ మీదుగా వెళ్లే రద్దైన రైళ్లు వివరాలు ఇలా ఉన్నాయి..

  • విశాఖపట్నం–కాచిగూడ (08561) – జూన్‌ 1-10
  • కాచిగూడ–విశాఖపట్నం (08562) – జూన్‌ 2-11
  • భువనేశ్వర్‌–పుణే (02882) – జూన్‌ 1-8
  • పుణే–భువనేశ్వర్‌ (02881) – జూన్‌ 3-10
  • కడప–విశాఖపట్నం (07488) – జూన్‌ 1-10
  • విశాఖపట్నం–కడప (07487) – జూన్‌ 2-11
  • విశాఖపట్నం–లింగంపల్లి (02831) – జూన్‌ 1-10
  • లింగంపల్లి–విశాఖపట్నం (02832) – జూన్‌ 2-11

Also Read:

మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?

టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?

సర్కస్‌ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు