IBPS 2021-22 Calendar: బ్యాంక్ ఎగ్జామ్స్ క్యాలెండర్ విడుదల చేసిన IBPS… ఏ పరీక్ష ఎప్పుడుందంటే..
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) 2021-22 సంవత్సరానికి సంబంధించిన వార్షిక క్యాలెండర్ను బుధవారం విడుదల చేసింది. 2021-22 సంవత్సరానికి ibps వార్షిక క్యాలెండర్ను

IBPS 2021-22 Calendar: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) 2021-22 సంవత్సరానికి సంబంధించిన వార్షిక క్యాలెండర్ను బుధవారం విడుదల చేసింది. 2021-22 సంవత్సరానికి ibps వార్షిక క్యాలెండర్ను అధికారిక వెబ్ సైట్ ibps.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల్లో ఉండే క్లర్క్, పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల తేదీలు ఇందులో ఉంటాయి.
తాజాగా విడుదలైన క్యాలెండర్ ప్రకారం ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష ఆగస్ట్ 28, 29 మరియు సెప్టెంబర్ 4, 5, 21న జరుగనున్నాయి. అలాగే మెయిన్ ఎగ్జామ్ అక్టోబర్ 31న జరుగనుంది. ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 9, 10, 16, 17న జరుగుతుంది. ఇక మెయిన్ ఎగ్జామ్ నవంబర్ 27న జరుగుతుంది. అలాగే స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ 18, 26 తేదీలలో జరుగుతుండగా.. దాని మెయిన్ ఎగ్జామ్ వచ్చే ఏడాది జనవరి 30న జరుగుతుంది. వీటితోపాటు ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీసర్ స్కేల్-I ప్రిలిమినరీ ఎగ్జామ్స్.. ఆగస్ట్ 1, 7, 8, 14 మరియు 21 తేదీలలో జరుగుతాయి. ఆఫీసర్ స్కేల్ -I మెయిన్ ఎగ్జామ్ సెప్టెంబర్ 25న జరుగుతుంది. ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్ అక్టోబర్ 3న జరుగుతుంది. అలాగే ఆఫీసర్స్ స్కేల్ II, III సింగిల్ ఎగ్జామ్ సెప్టెంబర్ 25న జరుగుతుంది.
ఇక ఈ పోస్టులకు సంబంధించిన ఖాళీల వివరాలు, అర్హతలు, అలాగే ఎంపిక విధానం, పరీక్షా విధానంతోపాటు, ఏఏ ప్రాంతాల్లో ఎన్ని ఖాళీలున్నాయనే వివరాలను ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్లో నిర్ణిత సమయంలో విడుదలచేయనుంది. మరిన్ని వివరాలను అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్లో తెలుసుకోవచ్చు.
Also Read:
IMD Recruitment 2021: ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. చివరితేదీ ఎప్పుడంటే ?
