AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IMD Recruitment 2021: ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. చివరితేదీ ఎప్పుడంటే ?

భారత ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖకు చెంది ఢిల్లీలోని భారత వాతావరణ శాఖ (ఇండియా మెటీయోరాలాజికల్ డిపార్ట్ మెంట్ IMD)పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

IMD Recruitment 2021: ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. చివరితేదీ ఎప్పుడంటే ?
Rajitha Chanti
|

Updated on: Feb 02, 2021 | 5:12 PM

Share

భారత ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖకు చెంది ఢిల్లీలోని భారత వాతావరణ శాఖ (ఇండియా మెటీయోరాలాజికల్ డిపార్ట్ మెంట్ IMD)పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సైంటిస్ట్ ఈ, సైంటిస్ట్ డీ, సైంటిస్ట్ సీ మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఎలాంటి ఎగ్జామ్ రాయవలసిన అవసరం లేదు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేయనుంది. ఆన్ లైన్ ద్వారా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

సైంటిస్ట్ E : 8 పోస్టులు

☛ ఫోర్ కాస్టింగ్, ఇన్‏స్ట్రుమెంటేషన్, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాలలో సైంటిస్ట్ ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ☛ ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 60% మార్కులతో సంబంధిత సబ్జెక్టులలో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. ☛ అభ్యర్థులకు దరఖాస్తు చేసే చివరితేదీ వరకు 50 ఏళ్లు దాటకూడదు.

సైంటిస్ట్ D : 29 పోస్టులు

☛ ఫోర్ కాస్టింగ్, ఇన్‏స్ట్రుమెంటేషన్, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగ్రికల్చర్ మెటీయోరాలజి డిపార్ట్‏మెంట్స్‏లలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ☛ ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 60% మార్కులతో సంబంధిత సబ్జెక్టులలో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. ☛ అభ్యర్థులకు దరఖాస్తు చేసే చివరితేదీ వరకు 50 ఏళ్లు దాటకూడదు.

సైంటిస్ట్ C : 17 పోస్టులు

☛ ఫోర్ కాస్టింగ్, ఇన్‏స్ట్రుమెంటేషన్ డిపార్ట్‏మెంట్స్‏లలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ☛ ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 60% మార్కులతో సంబంధిత సబ్జెక్టులలో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. ☛ అభ్యర్థులకు దరఖాస్తు చేసే చివరితేదీ వరకు 40 ఏళ్లు దాటకూడదు.

ఆన్ లైన్‏లో దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 22 చివరితేదీ. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి https://mausam.imd.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Also Read:

SpaceX Launch Schedule : ఆ నలుగురితో యాత్రకు సిద్ధమవుతున్న ‘స్పేస్‌ఎక్స్’.. ఈ ఏడాది చివరినాటికి అంతరిక్షంలోకి..