Bitter Gourd: కాకరకాయ మరీ చేదుగా ఉందా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చేదు మాయం అవుతుంది..!
కరకాయ పేరు వింటేనే కొందరు యాక్ అంటారు. మరికొందరు ఆరోగ్యానికి కారణం అంటూ లొట్టలేసుకుని తింటారు. అయితే, ఎక్కువమంది మాత్రం కాకరకాయ తినడానికి భయపడుతారు.

కరకాయ పేరు వింటేనే కొందరు యాక్ అంటారు. మరికొందరు ఆరోగ్యానికి కారణం అంటూ లొట్టలేసుకుని తింటారు. అయితే, ఎక్కువమంది మాత్రం కాకరకాయ తినడానికి భయపడుతారు. కారణం దాని చేదు గుణం. అందుకే ‘హేట్ ఫుడ్ లిస్ట్’ లో కాకరకాయ ఫస్ట్ గా ఉంటుంది. కాకరకాయ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకారి. అయినప్పటికీ దానిని తినేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. కాకరకాయ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతంది. మధేమేహ బాధితులు దీనిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. క్యాన్సర్‌తో పోరాడుతుంది. అనేక ఇతర అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే, దీనిని తినకపోవడానికి కారణం.. దాని చేదు గుణం. మరి ఆ చేదును తగ్గించే చిట్కాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
1. కాకరకాయ పైపొట్టు తీసేయాలి..
కాకరకాయ పై పొట్టును తీసేయాలి. దీనిని తీసేయడం వల్ల కాస్త చేదు తగ్గిపోతుంది. ఆ తరువాత దీనిని వండుకుని తింటే చేదు ఉండదు.
2. బెల్లం వేసుకోవాలి..
కాకరకాయ కూరలో కాస్త బెల్లం వేస్తే చేదు తగ్గుతుంది. ఇది కూరకు మంచి టేస్ట్ ఇస్తుంది. అప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.




3. ఫ్రై చేసుకోవడం..
కొంతమంది కాకరకాయను కూరగా కంటే ఫ్రై చేస్తే ఎక్కువగా తింటారు. ఫ్రై చేయడం వల్ల కాకరకాయ చేదు తగ్గుతుంది. డీప్ ఫ్రై చేయడం వల్ల కాకరకాయ చేదు ఉండదు.
4. కాకరకాయ గింజలు తొలగించాలి..
కాకరకాయను వండే ముందు.. అందులోని గింజలను తొలగించాలి. ఆ గింజలను తొలగించడం వలన కాకరకాయ చేదు తగ్గుతుంది.
5. ఉప్పు రాయాలి..
కాకరకాయ చేదును తగ్గించడానికి ఉప్పును ఉపయోగించవచ్చు. ముందుగా కాకరకాయను తీసుకుని దాని పొట్టును తొలగించాలి. ఆ తరువాత గింజలను తొలగించాలి. ఆ తరువాత ఉప్పు తీసుకుని, కాకరకాయపై బాగా రుద్దాలి. వీటిని ఒక గిన్నెలో వేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
6. సోక్..
ఒక గిన్నెలో ½ కప్పు నీరు, ½ కప్పు వెనిగర్, 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేయాలి. తర్వాత ఆ మిశ్రమంలో తరిగిన పొట్లకాయను నానబెట్టాలి. 20-30 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు నీటిని తీసివేసి, కాకరకాయను మంచినీటిలో కడగాలి.
మరిన్ని ఆఫ్‌బీట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..