Nellore Rural Politics: మరింత హీటెక్కిన నెల్లూరు రాజకీయం.. ఆదాల, కోటంరెడ్డి మధ్య ముదిరిన వార్.. ఆయననే గెలిపించుకుంటామన్న కార్పొరేటర్లు..
నెల్లూరు రాజకీయం రోజురోజుకీ రంజుగా మారుతోంది.! ధిక్కారస్వరం వినిపించిన కొటంరెడ్డికి వేగంగా చెక్ పెడుతోంది YCP హైకమాండ్.! వరుస సమావేశాలతో పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తోంది. కోటంరెడ్డి వైపు చూస్తున్న వారిని కట్టడి చేస్తోంది.
నెల్లూరు రూరల్ సీటుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది వైసీపీ. అందుకే కీలక నేతలంతా అక్కడే మకాం వేస్తున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వీడినా.. పార్టీ బలం ఏమాత్రం తగ్గలేదని నిరూపించే ప్రయత్నం చేస్తోంది. కార్పొరేటర్లంతా తనవైపే ఉన్నారన్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కామెంట్స్‌తో అలెర్ట్ అయిన నియోజకవర్గ ఇంఛార్జ్, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రూరల్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 26 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో 18 మంది మీటింగ్ వచ్చారు. మేయర్ స్రవంతి సహా 8 మంది గైర్హాజరయ్యారు.
గతంలో కార్పొరేటర్లకు స్వేచ్ఛ ఉండేది కాదని.. ఇకపై ఏ సమస్యలున్నా స్వేచ్ఛగా తనని కలవొచ్చని చెప్పారు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు ఆనం విజయ్‌కుమార్. నెల్లూరు రూరల్‌లో వైసీపీకి తిరుగులేని ప్రజాబలం ఉందని స్పష్టం చేశారు.
ఇకపై పూర్తిస్థాయిలో నెల్లూరు రూరల్‌పైనే ఫోకస్ చేయాలని నిర్ణయించారు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తిచేయడంతోపాటు.. నెల్లూరుకు రింగ్ రోడ్డు హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం