Brain Foods : పరీక్ష సమయంలో మీ పిల్లలకు ఇవి తినిపించండి.. జ్ఞాపకశక్తి పెరుగుతుంది..!

మనం ఏది తిన్నా మన ఆరోగ్యంతో పాటు మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది. మెదడు మన మొత్తం శరీరాన్ని నియంత్రిస్తుంది, కాబట్టి వారు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం.

Brain Foods : పరీక్ష సమయంలో మీ పిల్లలకు ఇవి తినిపించండి.. జ్ఞాపకశక్తి పెరుగుతుంది..!
Brain Food
Follow us

|

Updated on: Feb 08, 2023 | 6:39 AM

మనం ఏది తిన్నా మన ఆరోగ్యంతో పాటు మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది. మెదడు మన మొత్తం శరీరాన్ని నియంత్రిస్తుంది, కాబట్టి వారు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. మనస్సు ఆరోగ్యంగా లేకుంటే, మన సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. మీ ఆహారం సరిగ్గా ఉంటే, మెదడు చురుకుగా పని చేస్తుంది. దాని సామర్థ్యం కూడా పెరుగుతుంది. మీకు చురుకైన మనస్సు కావాలంటే, మెదడును ఆరోగ్యంగా ఉంచే ఈ 5 బ్రెయిన్ ఫుడ్స్‌ని మీ డైట్‌లో చేర్చుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా పిల్లలకు ఎగ్జామ్స్ సమయంలో ఇది బాగా పని చేస్తుంది. ఒకసారి ఏది చదివినా గుర్తుండిపోతుంది. ఈ ఫుడ్స్ పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఈ 5 సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ ఫుడ్స్ మీ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి..

బ్లూబెర్రీ..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీ మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే.. ఆహారంలో బ్లూబెర్రీస్ తప్పనిసరి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, బెర్రీలు, మల్బరీ వంటి పండ్లు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బ్లూబెర్రీస్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. దీని కారణంగా మెదడులో వాపు ఉండదు. ఇది శరీరం నుండి ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తొలగిస్తుంది.

డార్క్ చాక్లెట్..

చాక్లెట్ తినడం ఇష్టమైతే.. డార్క్ చాక్లెట్ తినడం మంచిది. ఇది మెదడును చాలా షార్ప్‌గా చేస్తుంది. కెఫిన్, ఫ్లేవనాయిడ్‌లతో సహా అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు డార్క్ చాక్లెట్‌లో ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్ మీ లెర్నింగ్, మెమరీ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. ఒక పరిశోధన ప్రకారం.. డార్క్ చాక్లెట్ తినడం వల్ల మేధో పరీక్షలో ఉత్తీర్ణత సాధించే సామర్థ్యం కూడా పెరుగినట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

గుమ్మడికాయ గింజలు..

చాలా మంది గుమ్మడికాయ గింజలను తీసివేస్తారు. కానీ ఇది అద్భుతమైన సూపర్ ఫుడ్. దీని ధర కిలో 600 రూపాయలు కావడానికి కారణం ఇదే. యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్ వంటి మూలకాలు గుమ్మడి గింజల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మనస్సును చురుకుగా ఉంచుతాయి. ఒక పరిశోధన ప్రకారం.. గుమ్మడికాయ గింజలలో చాలా సూక్ష్మపోషకాలు ఉన్నాయి. దీని కారణంగా మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు సంబంధిత అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.

బాదం..

మెదడు పనితీరును మెరుగుపరచడంలో బాదం సూపర్‌ఫుడ్ లా పని చేస్తుంది. మెదడును చురుకుగా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ప్రతిరోజూ బాదంపప్పు తింటే వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. ఆలోచనా శక్తి పెరుగుతుంది. బాదం పప్పులో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చెడు కొవ్వును తొలగించి, మంచి కొవ్వును పెంచుతాయి.

పసుపు..

పసుపు ఉపయోగం ద్వారా అనేక రకాల వ్యాధులను నయం చేయవచ్చు. ఆయుర్వేదంలో పసుపు కి ప్రత్యేక స్థానం ఉంది. పసుపు ఆరోగ్య రక్షణిగా మాత్రమే కాదు.. మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ సమ్మేళనం.. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్, డిమెన్షియా వంటి మతిమరుపు సమస్యను కూడా నయం చేస్తుంది. మెదడులోని అమిలాయిడ్ శిధిలాలను కూడా తొలగిస్తుంది. ఈ అమిలాయిడ్ వల్ల అల్జీమర్స్ వ్యాధి వస్తుంది. కర్కుమిన్ సెరోటోనిన్, డోపమైన్ హార్మోన్లను సక్రియం చేయడం ద్వారా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..