AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentines Day: ప్రేమికుల రోజున డేటింగ్ చేసేందుకు హెల్ప్ చేయండి సార్.. అభిమాని ప్రశ్నకు దినేష్ కార్తీక్ రిప్లై అదిరిపోయిందిగా..

Dinesh Karthik: ప్రస్తుతానికి దినేష్ కార్తీక్ వ్యాఖ్యతగా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో కార్తీక్ వ్యాఖ్యత పాత్రలో కనిపించనున్నాడు.

Valentines Day: ప్రేమికుల రోజున డేటింగ్ చేసేందుకు హెల్ప్ చేయండి సార్.. అభిమాని ప్రశ్నకు దినేష్ కార్తీక్ రిప్లై అదిరిపోయిందిగా..
కార్తీక్, దీపిక రెండు విధాలుగా వివాహం చేసుకున్నారు. మొదట హిందూ ఆచారంలో, రెండోసారి క్రైస్తవ ఆచారంలో చేసుకున్నారు. మొదట్లో కార్తీక్ ఆట కారణంగా దీపికకు అంతగా నచ్చలేదు.
Venkata Chari
|

Updated on: Feb 07, 2023 | 10:00 PM

Share

వాలెంటైన్స్ వీక్ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ ప్రియమైన వారిని ఇంప్రెస్ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంటలు ఈ ప్రత్యేక సందర్భంగా కోసం ఎదురుచూస్తుంటారు. అయితే, మరోవైపు ఇష్టపడని వారు కూడా ఉంటారు. భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ ట్విట్టర్‌లో #AskDK ప్రశ్నోత్తరాల సెషన్‌ను నిర్వహించాడు. అయితే, ఇందులో కొందరు అభిమానులు వాలెంటైన్స్ డే గురించి ప్రశ్నలు అడిగారు. వాలెంటైన్స్ డేని ప్రత్యేకంగా ఒకరితో గడపడానికి ఒక అభిమాని వికెట్ కీపర్ కం బ్యాటర్‌ని సహాయం అడిగాడు. దీంతో కార్తీక్ ఈ ప్రశ్నకు తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చాడు.

ప్రస్తుతానికి దినేష్ కార్తీక్ వ్యాఖ్యతగా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో కార్తీక్ వ్యాఖ్యత పాత్రలో కనిపించనున్నాడు.

ఇవి కూడా చదవండి

తన ఖాళీ సమయంలో, కార్తీక్ ట్విట్టర్‌లో #AskDK సెషన్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఓ అభిమాని “సార్ ఈ సంవత్సరం వాలెంటైన్స్ డేని ఎవరితోనైనా జరుపుకోవడానికి నాకు సహాయం చెయ్యండి” అంటూ అడిగాడు. ప్రతిస్పందనగా, కార్తీక్ అద్దంలో ఒక వ్యక్తి తనను తాను చూసుకునే ఫొటోను పంచుకున్నాడు. దీంతో నెటిజన్లు ఫిదా అయ్యారు.

ట్వీట్ ఇక్కడ చూడండి..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..