Luggage Stolen On Train: రైలు ప్రయాణంలో మీ లగేజీ దొంగలించారా? అలా ఫిర్యాదు చేస్తే ఆ బాధ్యత వారిదే..!
రైల్వే స్టేషన్లల్లో కూడా వేల కొద్దీ జనం ఉంటారు. ఇందులో కొందరు దొంగలు కూడా ఉంటారు. కాబట్టి ప్రయాణ సమయంలో కొంచెం ఏమరుపాటుతో ఉన్నా మన సామగ్రి దొంగలించే అవకాశం ఉంటుంది. ఇలా మన లగేజీ దొంగలిచడం అనేది మనకు చాలా బాధ కలిగిస్తుంది. అయితే రైలులో సామగ్రి పోగొట్టుకున్న సందర్భంలో ఫిర్యాదు చేయవచ్చని చాలా మందకి తెలియదు. అలాగే కొందరు తమ వస్తువులను తిరిగి పొందలేరని భావించి ఫిర్యాదు చేయడం వ్యర్థమని కూడా అనుకుంటూ ఉంటారు.

రైలు ప్రయాణం అనేది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ మార్గాల్లో ఒకటి ఉంటుంది. తక్కువ ఖర్చుతో మీరు కోరుకున్న గమ్యస్థానానికి సురక్షితమైన రవాణా రైలు ప్రయాణం వల్ల సాధ్యమవుతుంది. అయితే ప్రయాణం అంటేనే ఓ చోటు నుంచి మరో చోటుకు వెళ్లడం. ఈ సమయంలో మనతో పాటు చాలా మంది ప్రయాణిస్తూ ఉంటారు. అలాగే రైల్వే స్టేషన్లల్లో కూడా వేల కొద్దీ జనం ఉంటారు. ఇందులో కొందరు దొంగలు కూడా ఉంటారు. కాబట్టి ప్రయాణ సమయంలో కొంచెం ఏమరుపాటుతో ఉన్నా మన సామగ్రి దొంగలించే అవకాశం ఉంటుంది. ఇలా మన లగేజీ దొంగలిచడం అనేది మనకు చాలా బాధ కలిగిస్తుంది. అయితే రైలులో సామగ్రి పోగొట్టుకున్న సందర్భంలో ఫిర్యాదు చేయవచ్చని చాలా మందకి తెలియదు. అలాగే కొందరు తమ వస్తువులను తిరిగి పొందలేరని భావించి ఫిర్యాదు చేయడం వ్యర్థమని కూడా అనుకుంటూ ఉంటారు. ఈ నమ్మకానికి విరుద్ధంగా రైల్వే అధికారులు వారి కోల్పోయిన సామగ్రిని చాలా మంది ప్రయాణికులను విజయవంతంగా తిరిగి చేర్చారని నివేదికలు సూచిస్తున్నాయి. కాబట్టి రైలులో లగేజీ పొగొట్టుకుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి? వంటి విషయాలను ఓ సారి తెలుసుకుందాం.
మీరు రైలులో లేదా స్టేషన్‌లో మీ వస్తువులను పొగొట్టుకుంటే వెంటనే సమీప రైల్వే అధికారులను, లేదా రైల్వే పోలీస్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్)ని సంప్రదించడం చాలా ముఖ్యం. వారు మీ లగేజీని గుర్తించలేకపోతే మీరు ఆర్‌పీఎఫ్‌ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) ఫైల్ చేసే అవకాశం ఉంది. లగేజీ దొంగతనం జరిగినప్పుడు లేదా కదులుతున్న రైలు నుండి మీ వస్తువులు దొంగలిస్తే ముందుగా టీసీ, కోచ్ అటెండెంట్ లేదా గార్డుని సంప్రదించారు. వారు మీకు ఎఫ్‌ఐఆర్ ఫారమ్‌ను అందిస్తారు. దానిని కచ్చితంగా పూరించి అధికారులకు తిరిగి ఇవ్వాలి. తదుపరి చర్య కోసం ఈ ఫిర్యాదు స్థానిక పోలీస్ స్టేషన్‌కు పంపుతారు.
రైలు దిగిపోవాలా?
ఫిర్యాదును ఫైల్ చేయడానికి మీరు మీ ప్రయాణానికి అంతరాయం కలిగించాల్సిన అవసరం లేదని నిబంధనలు పేర్కొంటున్నాయి. ఏదైనా రైల్వే స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్ సహాయ పోస్ట్‌లను సందర్శించి ఫిర్యాదు చేయవచ్చు. రైల్వే పోలీసులు మీ వస్తువులు కనుగొంటే వారు ఫిర్యాదు దాఖలు చేసిన స్టేషన్‌కు తీసుకువస్తారు. అనంతరం మీకు ఆయ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. అవసరమైన పత్రాలను ధ్రువీకరించిన తర్వాత మీ సామగ్రి మీకు తిరిగి ఇస్తారు. అయితే విలువైన వస్తువు లేదా ఖరీదైన వస్తువు రికవరీ అయితే దానిని జోనల్ కార్యాలయానికి పంపే ముందు గరిష్టంగా 24 గంటల పాటు స్టేషన్‌లో ఉంచుతారు.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..



