Happy Holi 2021: ఈ రంగుల హోలీకి అందమైన కోట్స్‌తో మీ ఆత్మీయులను విష్ చేయాండిలా..
Holi 2021: హోలీ... రంగుల రంగేళి... చిన్నా, పెద్ద వయసుతో సంబంధం లేకుండా.. ఆనందంగా రంగులు జల్లుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు.
Holi 2021: హోలీ… రంగుల రంగేళి… చిన్నా, పెద్ద వయసుతో సంబంధం లేకుండా.. ఆనందంగా రంగులు జల్లుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. నూతన ప్రకృతికి స్వాగతం పలుకుతూ.. ఫాల్గుణ పూర్ణిమ నాడు హోలిని జరుపుకుంటారు. సతీ దేవిని కోల్పోయిన శివుడు ఒక గుహలో తప్పస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ తప్పస్సు నుంచి శివుడిని మేల్కోల్పడానికి పార్వతి దేవి రాగా.. ఆమెకు సహయంగా వచ్చిన మన్మథుడు.. పరమేశ్వరుడిపైకి మన్మథ బాణాన్ని విసురుతాడు. దాంతో వెంటనే తప్పస్సు నుంచి బయటకు వచ్చిన శివుడు తన మూడో కన్ను తెరచి.. మన్మథుడిని భష్మం చేస్తాడు. ఆ కామదహనమే.. హోలీ జరుపుకోవడానికి కారణమంటుంటారు.
గతేడాది కరోనా మహామ్మారి కారణంగా హోలీ సంబరాలకు పర్మిషన్ లేదు. కానీ ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనల మధ్య హోలీ వేడుకలను జరుపుకుంటున్నారు చాలామంది. ఇక దూరంగా ఉన్న తమ ఆత్మీయులకు హోలీ శుభాకాంక్షలు అందమైన కోట్స్ చెప్పాండిలా.. అందుకు మీ కోసం అందమైన కోట్స్ ఇక్కడ..
* వసంత గమనంలో వస్తుంది రంగుల హోలీ.. నింపుతుంది మీ జీవితాలలో ఆనందాల కేళీ.. హోలీ శుభాకాంక్షలు..
* అన్ని రంగులు ఉంటేనే ప్రకృతికి అందం.. అన్ని మతాలు కలిసి ఉంటేనే దేశానికి అందం… హోలీ శుభాకాంక్షలు..
* సప్తవర్ణ శోభితమైన.. సలక్షణమైన పండుగ… వసంత శోభతో పరిడవిల్లే.. నవనవోన్మేషమైన వేడుక.. రంగుల కేళి.. హోళీ పండుగ సందర్భంగా.. ఆత్మీయులైన మిత్రులందరికీ శుభాకాంక్షలు..
* హరివిల్లులోని రంగులన్నీ.. మురళీ నాదములోని మధువు.. కలిసి వచ్చి ఒక చోట చేరి హోలీ నాడు ఆనందింపచేయాలని కోరుతూ.. మీకు హోలీ శుభాకాంక్షలు..
* మీ జీవితాన్ని రంగులమయం చేసుకోవడం.. మీ చేతుల్లోనే ఉంది.. హోలీ శుభాకాంక్షలు..
* హోలీ రంగుల కేళీ.. మీ జీవితంలో నిండాలి రంగోలీ.. ఆరోగ్యం.. ఐశ్వర్యాలతో వర్థిల్లాలి! హోలీ శుభాకాంక్షాలు.
* హోలీ రోజున ఒకరికొకరు చల్లుకొనేవి రంగులు కావు.. అనురాగ, అప్యాయతలు కలిసిన పన్నీటి రంగుల జల్లులు. హోలీ శుభాకాంక్షాలు.
Also read:
Holi 2021: ఈ హోలీ రోజున మీ ఇంట్లోనే సులభంగా ఈ స్నాక్స్ తయారు చేసుకొండిలా.. మరింత రుచిగా..
Holi 2021: హోలీలో వాడే గులాల్ రంగు నుంచి మీ జుట్టును ఈ విధంగా కాపాడుకోండిలా..