Valentines Day 2021: ప్రేమికుల రోజు సందడి.. మీ ప్రేయసికి ఈ గిఫ్ట్స్ ఇచ్చి ప్రేమను చెప్పేయండి..

ప్రేమికుల రోజు వచ్చేసింది. మీ ప్రేమను తెలపడానికి.. వారితో స్వచ్ఛమైన బంధాన్ని కలుపుకునేందుకు సరైన రోజే ఈ వాలెంటైన్ డే. అందుకే ఈ రోజు

Valentines Day 2021: ప్రేమికుల రోజు సందడి.. మీ ప్రేయసికి ఈ గిఫ్ట్స్ ఇచ్చి ప్రేమను చెప్పేయండి..
Valentine GiftImage Credit source: Pixabay
Follow us
Rajitha Chanti

| Edited By: TV9 Telugu

Updated on: Oct 22, 2024 | 4:41 PM

ప్రేమికుల రోజు వచ్చేసింది. మీ ప్రేమను తెలపడానికి.. వారితో స్వచ్ఛమైన బంధాన్ని కలుపుకునేందుకు సరైన రోజే ఈ వాలెంటైన్ డే. అందుకే ఈ రోజు మీకు ఇష్టమైన వారికి రకారకాల గిఫ్ట్స్ ఇచ్చి మనసులోని మాటను వ్యక్తపరచండి.. అందుకోసం మీకోసం కొన్ని గిఫ్ట్ ఐడియాస్..

ప్రేమికుల రోజు వస్తుందంటే చాలు మార్కెట్లోకి రకాల రకాల షాపులు అందమైన గిఫ్ట్స్ కలెక్షన్లతో రెడీగా ఉంటాయి. అలాగే అదిరిపోయే ఆఫర్లను కూడా ప్రకటిస్తుంటాయి. మరీ ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ ప్రియమైన వారి కోసం కానుకలను సిద్ధం చేసుకోండి.

హ్యాప్రీ హార్ట్స్..

మీప్రేమను తెలియజేయడానికి మీరు అందమైన కానుకలను ఎంచుకుంటే మంచిది. అందుకోసం హృదయాకారంలో ఉండే జ్యువెలరీని కానుకగా ఇస్తే బెటర్. అందులో ముఖ్యంగా రింగ్స్, బ్రాస్ లెట్స్, ఇయర్ రింగ్స్ లాంటివి మీ ప్రేయసికి గిఫ్ట్ గా ఇచ్చి ఈ వాలెంటైన్ డేను స్పెషల్ గా జరుపుకోండి.

ఫిట్ నెస్ బ్యాండ్..

మీకు ఇష్టమైన వారికి ఫిట్ నెస్ బ్యాండ్ గిఫ్ట్ గా ఇవ్వడం ఉత్తమం. ఎందుకంటే ఇవి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేలా చేయవచ్చు. ఇందులో రకరకాల డిజైన బ్యాండ్లు ఉంటాయి. వాటికి తగ్గట్టుగా ధరలు కూడా ఉంటాయి. షియోమి ఎంఐ బ్యాండ్ 4, ఫిట్ బిట్ వెర్సా వరకు చాలా రకాల బ్యాండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

హెడ్ ఫోన్స్..

చాలా మందికి సంగీతం వినడం ఇష్టం. ఎక్కడికైన వెళ్తున్న.. ఏదైన పనిచేస్తున్న సాంగ్స్ వింటుంటారు. ఈ క్రమంలో వారికి మంచి హెడ్ ఫోన్స్ ఇచ్చి వారిపట్ల మీ ప్రేమను తెలియజేయండి. ఇందుకోసం మార్కెట్లో చాలా మంచి బ్రాండ్ల హెడ్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్ లెస్ జెడ్ రూ.1,999 నుంచి.. యాపిల్ పాడ్స్ మ్యాక్స్ హెడ్ ఫోన్స్ రూ.59,900 వరకు అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్ వాచ్..

ప్రస్తుతం అంతా టెక్నాలజీ ప్రియులే ఉన్నారు. మారుతున్న కాలంతోపాటు వారి ఇష్టాలకు అనుగుణంగా మారుతున్నారు. ఇక ప్రస్తుతం స్మార్ట్ వాచ్‏లను ఇష్టపడనివారుండరు. మీరు మీ ప్రేయసికి కాస్త ఖరీదైన స్మార్ట్ వాచ్‏లను కానుకగా ఇచ్చి ప్రేమను తెలపండి. ఇందుకోసం మార్కెట్లో ఎన్నో రకాల బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్, గెలాక్సీ గేర్, యాపిల్ వాచ్, షియోమీ లాంటీ బ్రాండ్స్ అందమైన డిజైన్స్‏తో ఉన్నవి సెలక్ట్ చేసుకోని మీ ప్రియురాలికి కానుకగా ఇవ్వండి.

యాక్షన్ కెమెరా..

ఎప్పుడు ఇచ్చే.. హార్ట్ సింబల్స్, టెడ్డీ బేర్స్, చాక్లెట్స్ కాకుండా ఈసారి కాస్త కొత్తగా ప్రయత్నించండి. మీ ప్రియురాలికి ఈసారి కాస్త వినుత్నంగా కెమెరాను గిఫ్ట్ గా ఇవ్వండి. మీ ప్రేయసికి యాక్షన్ కెమెరాను గిఫ్ట్ గా ఇవ్వవచ్చు. ఇక ఈ కెమెరాను గిఫ్ట్‏గా ఇవ్వాలనుకుంటే.. గో ప్రో హీరో 8 బ్లాక్ యాక్షన్ కెమెరాను బహుమతిగా అందించండి.

పచ్చబొట్టు..

మీ ప్రేమను మాటల్లో చెప్పడానికి మీకు దైర్యం చాలకపోవచ్చు. మీకు నచ్చిన వారి పేరును పచ్చబొట్టుగా వేసుకోని వారిపట్ల మీకున్న ఇష్టాన్ని తెలియజేయవచ్చు. వస్తువులతో కాకుండా ఈసారి కొత్తగా పచ్చబొట్టు ద్వారా మీ ప్రేమను తెలపండి.

Also Read:

Hug Day 2021: ప్రేమలోని స్వచ్ఛతను, నిజాయితీని తెలిపేదే ఆత్మీయ స్పర్శ.. కౌగిలింతతో భావాలను తెలిపేయండిలా..