పెట్టుడు పళ్లకు చెక్.. ఒక్క ఇంజక్షన్‌తో అందమైన చిరునవ్వు మీ సొంతం..!
ఓల్డ్ ఏజ్‌లో తినడానికి పళ్లు లేకపోయినా..అనుకోని ప్రమాదంలో పళ్లన్నీ రాలిపోయినా కట్టుడు పళ్లు పెట్టడం తెలిసిందే కదా...ఉదయం, సాయంత్రం వాటిని క్లీన్ చేసుకోవడం ఓ పని. మాంసాహారం తినాలనుకున్నా సరిగా కుదిరేది కాదు.. తరచూ ఊడిపోయి ఇబ్బందులు పెట్టేవి. అయితే త్వరలో ఈ పెట్టుడు పళ్లతో పనిలేదంటున్నారు శాస్త్రవేత్తలు..

ఇంకెన్ని అద్భుతాలు చేస్తుందో ఈ విజ్ఞాన శాస్త్రం. ఇప్పటికే మానవ శరీరంలో ప్రతి అవయవానికి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసే విధానం చూస్తున్నాం.. కొన్ని అవయవాల విషయంలో నేచురల్‌గా హీల్ అయ్యి కొత్త ఆరోగ్య విధానాలను చూస్తూ ఉన్నాం… కానీ ఇది వినడానికే నమ్మబుద్ధి కానీ విజ్ఞాన శాస్త్ర అద్భుతం. మానవుడు పుట్టినప్పటినుంచి డెంటల్ టెక్నాలజీలో వస్తున్న మార్పులు పెట్టుడు పళ్ళ వరకే పరిమితమయ్యాయి. కొందరికి పుట్టుకతో నోటిలో పళ్ళు రాకపోతే పెట్టుడు పళ్లే గతి. వృద్ధాప్యంలో ఊడిపోయిన, ప్రమాదవశాత్తు పళ్ళు విరిగిపోయినా ప్రస్తుతం ఇదే సిస్టం. ఈ పెట్టుడు పళ్ళతో చాలా రకాల ఇబ్బందులు ఉన్నా.. అంతకుమించి ఎలాంటి ఆల్టర్నేటివ్ లేకపోవడంతో ఇప్పటివరకు జనాలు పెట్టుడు పళ్లతోనే అడ్జస్ట్ అవుతున్నారు. కానీ ఇప్పుడు జపాన్ శాస్త్రవేత్తలు విరిగిపోయిన, ఊడిపోయిన పళ్ళను ఒకే ఒక్క ఇంజక్షన్ తో మళ్ళీ తిరిగి పెరిగేలా చేస్తామంటున్నారు.
USAG-1 యాంటీ బాడీ ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్‌కి సిద్ధమవుతుంది. USAG-1 పేరుతో తయారు చేస్తున్న ఈ డ్రగ్ గత నాలుగేళ్లుగా ప్రయోగాత్మకంగా ఎలుకలు, పెరెట్లపై పరీక్షలు జరిపారు. ఎలుకలు ఇతర జంతువులలో ఈ డ్రగ్ వల్ల కొత్త పళ్ళు రావడం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకపోవడంతో ఇక మనుషులపై క్లినికల్ ట్రయల్ చేయడానికి జపాన్ శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు.
బోన్ మారో జెనటిక్ ప్రోటీన్లు అధికంగా ఉన్న USAG-1 ఇంజక్షన్ వల్ల పళ్ళు మాత్రమే పెరిగేలా ప్రయోగాల చేశారు. ఊడిపోయిన, విరిగిపోయిన పళ్లో మిగిలి ఉన్న చిన్న నరాలకు ఈ ఇంజక్షన్ పంపి తద్వారా కొత్త పళ్ళను తెప్పిస్తారు. మానవాళి మనుగడలో ఇదొక అద్భుత ఆవిష్కరణ అని చెప్పొచ్చు. 2030లోగా దీన్ని మార్కెట్లోకి తీసుకురావాలని జపాన్ ప్రయత్నిస్తుంది. శాస్త్రవేత్తలు మేము పళ్ళను కొత్తగా తెప్పించడం కాదు…. మీ చిరునవ్వులను తిరిగి తెప్పిస్తున్నామంటూ కొటేషన్ ఇస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..