Vastu Tips: కొత్త ఇంటిని కొంటున్నారా.? ఓసారి వీటిని చెక్ చేసుకోండి..
ఇంటిని కొనుగోలు చేసే ముందు ప్రతీ ఒక్కరినీ మొదట వాస్తు గురించే ఆలోచిస్తారు. లక్షలు పెట్టి కొనుగోలు చేసే ఇల్లు వాస్తుకు అనుకూలంగా ఉండాలని భావిస్తుంటారు. అందుకోసం మంచి వాస్తు పండితులను తీసుకెళ్లి మరీ వాస్తు చూపించుకుంటారు. ఇక కొత్త ఇంటిని కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా కొన్ని వాస్తు నియమాలను పాటించాలని...

ఇంటిని కొనుగోలు చేసే ముందు ప్రతీ ఒక్కరినీ మొదట వాస్తు గురించే ఆలోచిస్తారు. లక్షలు పెట్టి కొనుగోలు చేసే ఇల్లు వాస్తుకు అనుకూలంగా ఉండాలని భావిస్తుంటారు. అందుకోసం మంచి వాస్తు పండితులను తీసుకెళ్లి మరీ వాస్తు చూపించుకుంటారు. ఇక కొత్త ఇంటిని కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా కొన్ని వాస్తు నియమాలను పాటించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాంటి కొన్ని వాస్తు నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
* కొత్త ఇంటిని కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా చూడాల్సిన అంశాల్లో గది ఆకృతి ఒకటి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు చతురస్రాకారంలో లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. ఇలా ఉంటేనే వాస్తు ప్రకారం పర్‌ఫెక్ట్‌గా ఉన్నట్లు.
* ఇక ఇంట్లోకి వెంటిలేషన్ దారాలంగా వచ్చేలా చూసుకోవాలి. అందుకోసం ఇంటి చుట్టూ కంపౌండ్ వాల్ ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉంటే ఇంట్లోకి గాలి, వెలుతురు దారాలంగా వస్తుంది.
* ఇక ఇంట్లో భోజనం చేసే విషయంలో కూడా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా డైనింగ్ స్పేస్ ఎట్టి పరిస్థితుల్లో మెయిన్ డోర్‌కు దగ్గర లేదా ఎదురుగా లేకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
* ప్రవేశ ద్వారం నిర్మాణానికి మంచి నాణ్యమైన చెక్కను ఉపయోగించారో లేదో చూసుకోవాలి. వీలైనంత వరకు మెయిన్ డోర్ టేక్‌తో చేసిందై ఉంటే బెస్ట్. నాణ్యమైన కలపతో లేకపోతే త్వరగా చెదలు పట్టే అవకాశాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.
* మెయిన్ డోర్‌కు దగ్గరగా బాత్‌రూమ్ లేకుండా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే ప్రధాన ద్వారానికి నలుపు రంగు లేకుండా చూసుకోవాలి.
* అలాగే ఇంట్లో ఉండే తలుపులు, కిటికీలు కచ్చితంగా సరి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి.
* ఇంట్లో బోర్ కచ్చితంగా ఈశాన్యం దిశలో ఉండాలి. అలాగే ఈశాన్యం మూల పెద్దగా వచ్చేలా ఉండాలి. ఈశాన్యంలో బాత్‌రూమ్ పొరపాటున కూడా లేకుండా చూసుకోవాలి.
* బెడ్‌రూమ్ నైరుతి దిశలో ఉండేలా చూసుకోవాలి. అలాగే బెడ్‌రూమ్‌లో ఉండే అటాచ్ బాత్‌రూమ్ మంచం పడకుండా చూసుకోవాలి. ఇక వంట గది ఆగ్నేయ దిశలో ఉండాలి.
నోట్: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




