whale vomit: వాంతి విలువ రూ. 10 కోట్లు.. ఇంతకీ ఏంటా వాంతి.? ఎందుకంత రేటు.. తెలుసుకోండి..
Whale vomit: వాంతి అనే పేరు వింటేనే అసహ్యమేస్తుంది. మరి అదే వాంతి అదృష్టాన్ని తెచ్చి పెడితే. రాత్రికి రాత్రి జీవితాలను మార్చేస్తే.. ఇలాంటి ఘటన ఒకటి యెమెన్ దేశంలో చోటు చేసుకుంది. అయితే అది ఒక వేల్ వాంతి దీనిని అంబర్‌గ్రీస్‌గా పిలుస్తారు. వివరాల్లోకి వెళితే..
Whale vomit: వాంతి అనే పేరు వింటేనే అసహ్యమేస్తుంది. మరి అదే కక్కు అదృష్టాన్ని తెచ్చి పెడితే. రాత్రికి రాత్రి జీవితాలను మార్చేస్తే.. ఇలాంటి ఘటన ఒకటి యెమెన్ దేశంలో చోటు చేసుకుంది. అయితే అది ఒక వేల్ వాంతి దీనిని అంబర్‌గ్రీస్‌గా పిలుస్తారు. వివరాల్లోకి వెళితే.. యెమెన్‌కు చెందిన 35 మంది జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లారు. ఆ సమయంలో వారికి నీటిలో తేలుతున్న ఒక విచిత్ర వస్తువు కనిపించింది. తీరా అది ఏంటా.. అని తరిచి చూడగా అది స్పెర్మ్ వేల్ వాంతి అని నిర్ధారించారు. దీని విలువ అక్షరాల రూ. 10 కోట్లకు పైమాటే. అయితే జాలర్లు ఈ స్పెర్మ్ వేల్ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును తమ వృత్తిపై ఆధారపడి జీవిస్తోన్న కొందరు పేదలకు కొంత సొమ్మును ఇవ్వనున్నట్లు తెలిపారు. గతంలోనూ ఇలాంటి స్పెర్మ్ వేల్ దొరికిన ఘటనలు పలుసార్లు వెలుగులోకి వచ్చాయి.
ఇంతకీ ఈ స్పెర్మ్ వేల్ ఎందుకంత కాస్లీ..
ఒక తిమింగళం వాంతి ఇంత ఎక్కువ ధర ఎందకనే ప్రశ్న సహజంగానే వస్తుంది. ఈ విషయం తెలియాలంటే ఈ వాంతి కథ తెలుసుకోవాలి. సహజంగా తాజాగా ఉన్న ఈ స్పెర్మ్ వేల్ కంపు కొడుతుంది. కానీ.. ఓసారి గట్టిపడ్డాక మాత్రం సువాసన వెదజల్లుతుంది. అందుకే దీనికి పెర్ఫ్యూమ్ ఇండస్ట్రీలో తెగ క్రేజ్. దానికి తగ్గట్టుగానే ధర కూడానూ. తిమింగలం జీర్ణ వ్యవస్థలోని పిత్తాశయం నుంచి వెలువడ్డ స్రావం నుంచి ఇది తయారవుతుంది.
Also Read: వెబ్‌సైట్ ద్వారా ఆనందయ్య మందు పంపిణీ.. వేగంగా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం యంత్రాంగం
ఇవాళ గ్రేటర్ హైదరాబాద్‌లో డ్రైవర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్.. పేర్లు నమోదు చేయించుకున్నారా..