First Date Tips: ప్రియురాలితో డేట్‌కు వెళ్తున్నారా? ఈ సీక్రెట్ టిప్స్ మీకోసమే..
మొదటిసారి డేట్‌కి వెళ్తున్న వారిలో కాస్త ఒత్తిడి ఉంటుంది. దీని కారణంగా చాలా ఉద్విగ్నభరితంగా ఫీలవుతారు. కాస్త ఆందోళన కూడా ఉంటుంది. ఇందుకు కారణం.. ఫస్ట్ మీట్ ఎలా జరుగుందో, ఎలా మాట్లాడుతామో, లుక్స్ ఎలా ఉంటుందో అని. ఇలా ఎన్నో అంశాలు ఫస్ట్ డేట్‌పై ఇంపాక్ట్ చూపుతాయి.

మొదటిసారి డేట్‌కి వెళ్తున్న వారిలో కాస్త ఒత్తిడి ఉంటుంది. దీని కారణంగా చాలా ఉద్విగ్నభరితంగా ఫీలవుతారు. కాస్త ఆందోళన కూడా ఉంటుంది. ఇందుకు కారణం.. ఫస్ట్ మీట్ ఎలా జరుగుందో, ఎలా మాట్లాడుతామో, లుక్స్ ఎలా ఉంటుందో అని. ఇలా ఎన్నో అంశాలు ఫస్ట్ డేట్‌పై ఇంపాక్ట్ చూపుతాయి. ఇక ఫస్ట్ డేట్ సమయంలో కడుపు ఉబ్బరం, నోటి దుర్వాసన వంటి విషయాలు కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. వీటి కారణంగా డేట్‌లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. మరి ఫస్ట్ డేట్‌కి వెళ్లే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి కీలక వివరాలు ఇప్పుడు మీకోసం..
ఫస్ట్ డేట్‌కు వెళ్లే ముందు వీటిని అస్సలు తినొద్దు..
ఫైబర్..
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే, డేట్‌కి వెళ్లే ముందు అధిక ఫైబర్ ఫుడ్స్ తినొద్దు. బ్రోకలీ, క్యాబేజీ వంటి కూరగాయలను తినొద్దు. ఇవి అధిక ఫైబర్ కలిగి ఉంటాయి. దీని వల్ల మీకు గ్యాస్ సమస్య రావచ్చు. వోట్స్, బ్రెడ్ వంటి ఆహారాలు కూడా తినొద్దు.
పాల ఉత్పత్తులు..
డేట్‌కి వెళ్లే ముందు పాల ఉత్పత్తులను తినొద్దు. గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను కలిగిస్తుంది. పాల ఉత్పత్తులలో లాక్టోస్ ఉంటుంది. పాల ఉత్పత్తులలో పాలు, పెరుగు, చీజ్ వంటి ఉత్పత్తులు ఉంటాయి. లాక్టోస్ జీర్ణం కావడం కష్టం. అందుకే డేట్‌కి వెళ్లే ముందు వీటిని తీసుకుని ఇబ్బంది పడకండి.




బీన్స్..
బీన్స్‌లో చక్కెర కంటెంట్ ఉంటుంది. జీర్ణం అవడంలో ఇబ్బంది ఎదరవుతుంది. ఈ కారణంగా గ్యాస్ సమస్యతో బాధపడే అవకాశం ఉంది. పప్పులు, శనగలు మొదలైన ఆహారపదార్థాలు కూడా తినకుండా ఉండాలి. ఒకవేళ వీటిని తీసుకుంటే అసౌకర్యంగా ఫీలయ్యే అవకాశం ఉంది.
వెల్లుల్లి..
వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే డేట్‌కి వెళ్లే ముందు వెల్లుల్లి తినడం మానుకోవాలి. దీని వల్ల నోటి దుర్వాసన వస్తుంది.
ఉల్లిపాయ..
డేట్‌కి వెళ్లే ముందు ఉల్లిపాయలు తినడం మానుకోవాలి. ఇందులో సల్ఫ్యూరిక్ సమ్మేళనం ఉంటుంది. దీని వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంది.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..