AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పొలం దున్నుతున్న రైతు కళ్లల్లో ఒక్కసారిగా మెరుపు.. రాత్రికి రాత్రే మారిన జీవితం!

కర్నూలు జిల్లాలో వజ్రాల వేటలో రైతు పంట పండింది. పొలం పనులు చేస్తున్న సమయంలో రైతుకు ఓ వజ్రం దొరికింది. వెంటనే వేలం నిర్వహించిన వ్యాపారులు భారీ ధరకు దక్కించుకున్నారు. డబ్బులు, బంగారాన్ని ఆ రైతుకు చెల్లించి వజ్రాన్ని దక్కించుకున్నారు. కర్నూలు జిల్లా ఒక్కటే మాత్రమే కాదు అటు అనంతపురం జిల్లాలోని పొలాలు, స్థలాల్లో కూడా ఈ వజ్రాల వేట కొనసాగుతోంది.

Andhra Pradesh: పొలం దున్నుతున్న రైతు కళ్లల్లో ఒక్కసారిగా మెరుపు.. రాత్రికి రాత్రే మారిన జీవితం!
Diamond
J Y Nagi Reddy
| Edited By: TV9 Telugu|

Updated on: Jun 13, 2024 | 11:06 AM

Share

కర్నూలు జిల్లాలో వజ్రాల వేటలో రైతు పంట పండింది. పొలం పనులు చేస్తున్న సమయంలో రైతుకు ఓ వజ్రం దొరికింది. వెంటనే వేలం నిర్వహించిన వ్యాపారులు భారీ ధరకు దక్కించుకున్నారు. డబ్బులు, బంగారాన్ని ఆ రైతుకు చెల్లించి వజ్రాన్ని దక్కించుకున్నారు. కర్నూలు జిల్లా ఒక్కటే మాత్రమే కాదు అటు అనంతపురం జిల్లాలోని పొలాలు, స్థలాల్లో కూడా ఈ వజ్రాల వేట కొనసాగుతోంది.

గత కొద్ది రోజులుగా జనాలు పొలాల్లో వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రైతును అదృష్టం వరించింది. పొలంలో పనులు చేస్తుండగా ఓ వజ్రం దొరికింది. దీంతో అతని జీవితమే మారిపోయింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో రాజు అనే రైతు పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. దొరికిన వజ్రాన్ని జొన్నగిరి చెందిన వజ్రాల వ్యాపారికి 8 లక్షల 15 వేల రూపాయలు నగదు, 4 తులాల బంగారు ఇచ్చి కొనుగోలు చేశాడు. ఈ ఖరీఫ్ సీజన్‌లో దాదాపుగా 34 వజ్రాలు దొరికినట్లు సమాచారం.

గతంలో వర్షాలు సరైన క్రమంలో రాకపోవడంతో వజ్రాలు తక్కువ దొరికేవి. ఈ సంవత్సరం ముందస్తుగా వర్షాలు రావడంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో చాలా వజ్రాలలు దోరుకుతుండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం వజ్రాల అన్వేషణ కోసం భారీగా జొన్నగిరి పగిడిరాయి, పెరవలి ప్రాంతాలకు తరలివస్తున్నారు. ఒకసారి తమ అదృష్టం పరీక్షించుకోవడానికి చిన్నాపెద్దా, మహిళలు, ఉద్యోగులు అందరూ వజ్రాల వేట కోసం భారీగా జొన్నగిరికి తరలి వస్తున్నారు. ఏకంగా పత్తికొండ, గుత్తి, ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు లాడ్జిల్లో ఉంటూ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వజ్రాలు వెతికి మళ్ళీ సాయంత్రం లాడ్జులకు చేరుకుని బసచేస్తున్నారు. ఒక్క వజ్రం దొరికితే తమ అదృష్టం తమ తలరాతలు మారిపోతాయని అంటున్నారు వజ్రాల అన్వేషకులు.

మరోవైపు, తుగ్గలి, మద్దికేర మండలలోని జొన్నగిరి పగిడిరాయి గొల్లవాని పల్లె అనంతపురం పెరవలి ఈ గ్రామాల్లో వజ్రాలు ఎక్కువగా దొరుకుతుండడంతో వజ్రాల వ్యాపారస్తులు తమ అనుచరులను నియమించుకుని వజ్రాలు దొరికిన వెంటనే తమ దగ్గరికి వచ్చేలా ప్రయత్నాలు చేసుకున్నారు. అయితే ఇక్కడ దొరికిన వారికి వజ్రం ఎంత విలువ చేస్తోందో అవగాహన లేకపోవడంతో వజ్రాల వ్యాపారస్తులు ఎంత కొంత ముట్టచెప్పి సొమ్మ చేసుకుంటున్నారన్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…