AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: దైవం మనుష్య రూపేణా.. ఊపిరాడక ఇబ్బంది పడుతున్న చిన్నారి ప్రాణాలు కాపాడిన పోలీసు..

దేవుడిగా వచ్చి ప్రమాదంలో ఉన్న మనుషులు, లేదా జంతువుల ప్రాణాలను కాపాడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. పాలు తాగుతూ ఊపిరాడక స్థితిలో ఉన్న చిన్నారిని దేవుడిగా వచ్చిన ఓ పోలీసు అధికారి వచ్చి కాపాడాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్‌గా మారింది. నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటుంది.

Viral Video: దైవం మనుష్య రూపేణా.. ఊపిరాడక ఇబ్బంది పడుతున్న చిన్నారి ప్రాణాలు కాపాడిన పోలీసు..
Viral News
Surya Kala
|

Updated on: Jun 12, 2024 | 8:26 PM

Share

కష్ట సమయాల్లో సహాయం చేయడానికి దేవుడు కొన్నిసార్లు మానవ రూపంలో కనిపిస్తాడని పెద్దల సామెత. ఈ మాట అక్షరాలా నిజం అనిపించేలా కొన్ని సంఘటనలకు సంబంధించిన వార్తల విన్నపుడు అనిపిస్తుంది ఎవరికైనా.. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు కొందరు భగవంతుని రూపంలో వచ్చి ఆ కష్టాలను తీరుస్తారు. అలాంటి సమయంలో ఆ మనిషిని దైవంగా చూస్తారు. ఇలా దేవుడిగా వచ్చి ప్రమాదంలో ఉన్న మనుషులు, లేదా జంతువుల ప్రాణాలను కాపాడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. పాలు తాగుతూ ఊపిరాడక స్థితిలో ఉన్న చిన్నారిని దేవుడిగా వచ్చిన ఓ పోలీసు అధికారి వచ్చి కాపాడాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్‌గా మారింది. నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటుంది.

అమెరికాలోని మిచిగాన్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ నవజాత శిశువు పాలు తాగుతూ ఉక్కిరిబిక్కిరి అయింది. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పాలైంది. దీంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఏం చేయాలో తోచక రోడ్డు పక్కనే ఉన్న పోలీసుల వద్దకు వెళ్లి చిన్నారిని కాపాడమంటూ అప్పగించారు. సకాలంలో ప్రథమ చికిత్స అందించి చిన్నారి ప్రాణాలు కాపాడాడు పోలీసు అధికారి. ఈ సంఘటన 2020లో జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వీడియో మళ్లీ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ది ఫిగెన్ అనే X ఖాతాలో షేర్ చేయబడిన వీడియో “పోలీసు అధికారి మూడు వారాల నవజాత శిశువు ప్రాణాలను రక్షించాడు” అనే శీర్షికతో ఉంది. భయాందోళనకు గురైన కుటుంబం తమ చేతిలో ఉన్న నవజాత శిశువును పోలీసు అధికారి వద్దకు తీసుకువస్తున్నట్లు ఒక వైరల్ వీడియో చూపిస్తుంది. తన చిన్నారిని కాపాడాలంటూ చిన్నారి తల్లి పోలీసులను వేడుకుంది. ఆ సందర్భంగా ఆ పోలీసు అధికారి ప్రథమ చికిత్స చేసి చిన్నారి ప్రాణాలను కాపాడి రియల్ హీరో అయ్యాడు. ఒక రోజు క్రితం షేర్ చేసిన ఈ వీడియో 6.9 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఎప్పటి వీడియో అయినా సరే పోలీసు అధికారి చేసిన పనిని హర్షించదగినది అంటూ చిన్నారి ప్రాణాలను కాపాడిన పోలీసు అధికారిని ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్