Updated: మోడ్రెన్ దుస్తుల్లో గుడిలో యువతి.. దీపంతో సిగరెట్.. దీని వెనుక నిజం ఇదే

ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోలో ఒక అమ్మాయి గుడిలో సిగరెట్ తాగుతూ, ఆ తరవాత జారి కింద పడిన దృశ్యాలు చూడొచ్చు. ఐతే ఇది నిజంగా జరిగిన ఘటన కాదు, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని తాజాగా మేము తెలుసుకున్నాం.

Updated: మోడ్రెన్ దుస్తుల్లో గుడిలో యువతి.. దీపంతో సిగరెట్.. దీని వెనుక నిజం ఇదే
Viral Video
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jun 17, 2024 | 8:21 PM

(Clarity: ఈ వీడియో స్క్రిప్టెడ్ అని అవగాహన కోసం తీయబడింది అని నిర్ధారించుకుని.. సవరించడం జరిగింది)

దేవాలయాలను సందర్శించేటప్పుడు భారతీయ సంస్కృతి ప్రకారం దుస్తులు ధరించడం మంచిది. అంతేకాదు భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించాలని అనేక దేవాలయాలలో డ్రెస్ కోడ్ కూడా అమలులో ఉంది. అయినా కూడా కొంతమంది మోడ్రన్ డ్రెస్ వేసుకుని గుడికి వస్తుంటారు. అదే విధంగా ఇక్కడ ఓ యువతి మోడ్రెన్ దుస్తులు ధరించి ఆలయానికి రావడమే కాదు పవిత్ర స్థలంలో సిగరెట్ తాగుతూ కనిపించింది. ఆ తర్వాత ఆ యువతి సిగరెట్ తాగుతూ మొబైల్ ఫోన్ మాట్లాడుతుండగా జారిపడి పడింది. నడుము విరిగినట్లు వీడియోలో ఉంది. ఈ దృశ్యం ఆలయంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిందంటూ నెట్టింట తెగ వార్తలు సర్కులేట్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను శుభాంగి పండిట్ (బేబీమిశ్రా_) తన X ఖాతాలో షేర్ చేసారు. అయితే ఇది పూర్తిగా  స్క్రిప్టెడ్ వీడియో అని తాజాగా వెల్లడైంది. ‘3RD EYE’  యూట్యూబ్ ఛానల్‌ వారు ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించినట్టు వివరణ ఇచ్చారు. ఈ ఛానల్‌లో ఇలాంటి స్క్రిప్టెడ్ వీడియోలు చాలా ఉన్నాయి.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..