AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి మండపంలోనే రెచ్చిపోయిన వధువు.. పెట్టింది తినలేదని వరుడి చెంప ఛెళ్లుమనిపించింది..

వినియోగదారులు దీనిపై రకరకాలుగా వ్యాఖ్యానించారు. వీడియోలో ఇదంతా చూసిన జనాలు షాకైపోయారు. సంతోషం అంబరాన్నంటాల్సిన పెళ్లిలో ఇదేం గొడవని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదంతా ఏదో ప్రాంక్‌ వీడియోలా ఉందని కొందరు అంటుండగా, అసలు కారణమేంటనేది తెలియకపోవడంతో జనాలు రకరకాల కామెంట్స్‌ చేశారు.

పెళ్లి మండపంలోనే రెచ్చిపోయిన వధువు.. పెట్టింది తినలేదని వరుడి చెంప ఛెళ్లుమనిపించింది..
The Bride Slapped The Groom
Jyothi Gadda
|

Updated on: Jun 12, 2024 | 7:56 PM

Share

పెళ్లికి సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తరచుగా మనం వివాహ వేడుకలో జరిగే సరదాలు, ప్రత్యేకమైన ఆచారాలు, విచిత్రాలను చూస్తుంటాం. ప్రతి వివాహ వేడుక వధూవరులకు చాలా ప్రత్యేకమైనది. చిరకాలం గుర్తుంచుకోదగినది. ఈ ఆచారాలలో కొన్ని వధువు, వరుడి మధ్య తగాదాలను కూడా చూస్తుంటాం. ప్రస్తుతం, అటువంటి ఒక వింత ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట సందడిగా మారింది. ఇందులో పెళ్లికి వేధికపైనే వధువు వరుడిని ఈడ్చి కొట్టడం చూసి అందరూ షాక్‌ అయ్యారు. ఇంతకీ ఆమె ఎందుకు అలా కొట్టింది..? అసలేం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ వైరల్ వీడియోలో పెళ్లి మండపంలో వధూవరులు మెడలో వరమాల ధరించి ఉన్నారు. మండపంలో ఇద్దరూ నిలబడి ఒకరికొకరు నోరు తిపి చేయించుకుంటున్నారు. ఇందులో భాగంగా వధువు వరుడికి రసగుల్లా తినిపిస్తోంది. అయితే, వరుడు ఆమెను ఆటపట్టించాలనే కోరికతో సరదా పనిచేశాడు. వధువు తన నోటికి రసగుల్ల అందించే సమయానికి కాస్త ముందుకు వెనక్కి కదులుతూ ఉన్నాడు. పెళ్లికొడుకు చేస్తున్న డ్రామా చూసి వధువు చిర్రెత్తిపోయింది. అతడిపై కోపంతో ఊగిపోయింది. వెంటనే అతడి చెంప చెల్లుమనించేలా ఒక్కటిచ్చింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. ఆ వెంటనే తేరుకుని బిగ్గరగా నవ్వడం ప్రారంభిస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో Instagramలో @crazy_writer_01 ఖాతాలో షేర్‌ చేయబడింది. వీడియోను మిలియన్లకు పైగా వీక్షించారు. లక్షల సంఖ్యలో లైక్‌లను సంపాదించింది. వినియోగదారులు దీనిపై రకరకాలుగా వ్యాఖ్యానించారు. వీడియోలో ఇదంతా చూసిన జనాలు షాకైపోయారు. సంతోషం అంబరాన్నంటాల్సిన పెళ్లిలో ఇదేం గొడవని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదంతా ఏదో ప్రాంక్‌ వీడియోలా ఉందని కొందరు అంటుండగా, అసలు కారణమేంటనేది తెలియకపోవడంతో జనాలు రకరకాల కామెంట్స్‌ చేశారు.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్