AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: సముద్రం ఒడ్డున విహరిస్తున్న దంపతులు.. హ‌ఠాత్తుగా భార్యను మింగేసిన ఇసుక..

ఫిప్స్‌బర్గ్‌లోని పోఫామ్ బీచ్ స్టేట్ పార్క్ వద్ద సముద్ర తీరం వెంబడి ప్యాట్రిక్, జామీ అకార్డ్ దంపతులు సంతోషంగా షికారు చేస్తున్నారు. ఇంతలో ఆ మహిళ ఒక్కసారిగా ఇసుకలో కూరుకుపోయింది. భర్తకు అసలు విషయం అర్థమయ్యే సమయానికి భార్య నడుము లోతు ఇసుకలో పాతుకుపోయింది. ఆమె అదృష్టవంతురాలు ఇంకా చెప్పాలంటే భూమి మీద ఆమెకు ఇంకా నూకలు తినే రోజులు ఉన్నాయేమో.. వెంటనే స్పందించి భర్త.. ఆమెను పైకి లాగాడు.

Viral News: సముద్రం ఒడ్డున విహరిస్తున్న దంపతులు.. హ‌ఠాత్తుగా భార్యను మింగేసిన ఇసుక..
Sand Swallows WomanImage Credit source: associated press photo
Surya Kala
|

Updated on: Jun 12, 2024 | 8:04 PM

Share

కొన్నిసార్లు ప్రజలు నమ్మలేని సంఘటనలు కనిపిస్తాయి. అలాంటి ఘటనే ఈ రోజుల్లో చర్చనీయాంశమైంది. నిజానికి ఓ మహిళ తన భర్తతో కలిసి సముద్రపు ఒడ్డున ఆనందంగా షికారు చేస్తుండగా ఒక్కసారిగా భూమి మింగేసింది. ఈ వింత ఘటన చూసిన మొదట భర్త స్పృహ కోల్పోయాడు. తర్వాత త్వరగా స్పందించి తన భార్యను ప్రమాదం నుంచి కాపాడుకున్నాడు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన కథ సినిమా కథ కంటే తక్కువేం కాదు.

వాస్తవానికి ఫిప్స్‌బర్గ్‌లోని పోఫామ్ బీచ్ స్టేట్ పార్క్ వద్ద సముద్ర తీరం వెంబడి ప్యాట్రిక్, జామీ అకార్డ్ దంపతులు సంతోషంగా షికారు చేస్తున్నారు. ఇంతలో ఆ మహిళ ఒక్కసారిగా ఇసుకలో కూరుకుపోయింది. భర్తకు అసలు విషయం అర్థమయ్యే సమయానికి భార్య నడుము లోతు ఇసుకలో పాతుకుపోయింది. ఆమె అదృష్టవంతురాలు ఇంకా చెప్పాలంటే భూమి మీద ఆమెకు ఇంకా నూకలు తినే రోజులు ఉన్నాయేమో.. వెంటనే స్పందించి భర్త.. ఆమెను పైకి లాగాడు. లేకుంటే ఆమె ప్రాణాలు కోల్పోయేది. తరువాత ఒక టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జామీ ఇలా అన్నాడు. ‘పాట్రిక్ నన్ను బయటకు తీసిన వెంటనే.. ఏమి జరిగిందో చూడటానికి మేము వెనక్కి తిరిగాము.. ఎందుకంటే తాను నడుస్తున్న సమయంలో తన కాళ్ల కింద గొయ్యి వంటివి ఏమి లేవని చెప్పింది.

మహిళను పూర్తిగా మింగెయ్యని గొయ్యి

జామీ ఇంకా మాట్లాడుతూ.. ‘బిలం పూర్తిగా చదునైన భూమిలా ఉంది. అక్కడ చూస్తే అక్కడ గొయ్యి ఉన్నట్టు అనిపించలేదని తెలిపింది. ఇదే విషయంపై వ్యవసాయ, సంరక్షణ, అటవీ శాఖ అధికార ప్రతినిధి జిమ్ బ్రిట్ మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయని.. అయితే ఈ ఘటన సినిమాల్లో చూపించే ఘటనలకు కాస్త భిన్నంగా ఉంటుందని చెప్పారు. అలాంటి ఇసుకను ఊబిగా పిలుస్తారని తెలిపారు. లేదా సూపర్ సాచురేటెడ్ ఇసుక అని కూడా పిలుస్తారు. అది మిమ్మల్ని పూర్తిగా మింగేయదు. ఇలా చిక్కుకున్న ఏ వ్యక్తి అయినా తనను తాను ఆ గొయ్యి నుంచి బయటకు రాగలడు అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇసుకలో గుంటలు ఎలా ఏర్పడతాయి?

వాతావరణ మార్పుల కారణంగా పోఫామ్ బీచ్ స్టేట్ పార్క్ చుట్టూ తుఫానులు తరచుగా సంభవిస్తాయని, ఈ తుఫానులు సముద్రంలోకి ప్రవహించే నదుల మార్గాన్ని మార్చాయని, దీని కారణంగా ఇక్కడ ఇసుక మెత్తగా మారిందని.. దీని కారణంగా కొంతమంది ఇలాంటి సంఘటనలను ఎదుర్కోవలసి వస్తుందని బ్రిట్ చెప్పారు

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..