Calf Birthday: ఇది మా బిడ్డలాంటిదే.. అశీర్వదించండి.. ఆవు దూడకు పుట్టినరోజు వేడుకలు చేసిన రైతు
ఆవులను తమ కన్న బిడ్డల మాదిరిగా కంటికి రెప్పలా చూసుకుంటోంది ఓ కుటుంబం. నుషులకు జరిగినట్టుగానే వాటికి సైతం వేడుకలు నిర్వహిస్తున్నారు. పాడిపశువులు మానవ జీవితంలో సగభాగం అనే విధంగా నిరూపిస్తున్నారు. తమ గోమాతకు పుట్టిన ఆవు దూడకు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆ ప్రాంతం వాసులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
మూగజీవాల పట్ల కొందరి ప్రేమ అపారం. వాటిని కన్న బిడ్డల్లాగా, కంటికి రెప్పలా చూస్తూ ప్రేమను పంచుతుంటారు. ముఖ్యంగా కుక్క, పిల్లి, పక్షులలో అయితే చిలుకలు, పావురాళ్లు ఇలా ఎవరికి నచ్చిన వాటిని వాళ్ళు పెంపుడు జంతువులగా పెంచుతున్నారు. మానవ జీవితంలో పాడిపశువులు కూడా ఒక ముఖ్య భాగం. మన పూర్వీకుల నుంచి ఆవులను దేవతలలా పూజిస్తుంటారు. గోమాతను పూజిస్తే సర్వ పాపాలు తొలగి ఆయురారోగ్యాలు పొందుతారని కొందరి నమ్మకం.
అయితే ఇక్కడ మాత్రం ఏకంగా ఆవులను తమ కన్న బిడ్డల మాదిరిగా కంటికి రెప్పలా చూసుకుంటోంది ఓ కుటుంబం. నుషులకు జరిగినట్టుగానే వాటికి సైతం వేడుకలు నిర్వహిస్తున్నారు. పాడిపశువులు మానవ జీవితంలో సగభాగం అనే విధంగా నిరూపిస్తున్నారు. తమ గోమాతకు పుట్టిన ఆవు దూడకు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆ ప్రాంతం వాసులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాక ఆ కార్యక్రమానికి హాజరైన వారంతా దానిని ఆశీర్వదించి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పశ్చిమగోదావరి జిల్లా పాలకోడూరు మండలం గోరకనమూడిలో రామకృష్ణ కు చెందిన ఆవుకు ఏడాది క్రితం ఆవు దూడ జన్మించింది. ఆ ఆవు దూడ పై ఎంతో ప్రేమను పెంచుకున్నాడు రామకృష్ణ. అవు దూడ 21వ రోజున ఉయ్యాల కట్టి ఏకంగా బారసాల ఫంక్షన్ చేశాడు. చుట్టుపక్కల వారిని బారసాల ఫంక్షన్ కు పిలిచి దూడకు ఆశీర్వచనాలు అందించారు. అప్పట్లో ఆ విషయం ఆ ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆవు దూడ పుట్టి ఒక సంవత్సరం పూర్తయింది. దాంతో దానికి పుట్టినరోజు వేడుకలు జరపాలని రామకృష్ణ నిర్ణయించుకున్నాడు.
ఆవు దూడ పుట్టినరోజు కోసం ఒక ప్రత్యేక కేకును తయారు చేయించాడు. ఆ కేకును దాని ముందు ఉంచి కట్ చేయించి ప్రేమగా దానికి తినిపించాడు. మనుషులు తమ కన్న బిడ్డలకు ఏ విధంగా పుట్టినరోజు వేడుకలు జరుపుతారో అచ్చం సేమ్ టు సేమ్ తన ఆవు దూడకు పుట్టినరోజు వేడుకలు వైభవంగా నిర్వహించాడు రామకృష్ణ. చుట్టుపక్కల వారిని పుట్టిన రోజు వేడుకలకు ఆహ్వానించి వారితో ఆశీర్వచనాలు అందించాడు. రామకృష్ణకు ఆవు దూడ మీద ఉన్న ప్రేమను చూసి స్థానికులంతా అతనిని అభినందిస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…