AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snakes: భారత్‌లోని ఈ రాష్ట్రం పాములకు స్వర్గధామం.. ఈ ఒక్కచోటే ఎన్ని రకాల పాములో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వేల రకాల పాము జాతులు ఉన్నాయి. ఒక్క భారత్ విషయానికి వస్తే పాములకు ఈ దేశం ప్రత్యేక స్థానం ఇచ్చింది. మన దేశంలో సర్పాలను దేవతలుగా పూజిస్తారన్న విషయం తెలిసిందే. అయితే, ఒక్క భారత్ లోనే పదుల సంఖ్యలో పాము జాతులు ఉన్నాయి. అందులో ఒక్క రాష్ట్రంలో మాత్రమే అత్యధిక పాము జాతులున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.

Snakes: భారత్‌లోని ఈ రాష్ట్రం పాములకు స్వర్గధామం.. ఈ ఒక్కచోటే ఎన్ని రకాల పాములో తెలుసా?
snake hood
Bhavani
|

Updated on: May 12, 2025 | 7:08 PM

Share

భారతదేశం విభిన్న జీవవైవిధ్యంలో సుసంపన్నమైన దేశం. ముఖ్యంగా పాముల జాతుల విషయంలో ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పాము అత్యంత ప్రమాదకరమైన విష జీవిగా పరిగణించబడుతుంది. సాధారణంగా అన్ని చోట్లా పాములు ఉంటాయి. ఇది భూమి మీద నివసించే ఒక జీవి. విషకారి అయినా కాకపోయినా, పాముని చూడగానే జనాలు భయపడతారు. వివిధ రాష్ట్రాల్లో వాతావరణం, ఆవాస వ్యవస్థలు, ఆహార వనరులు పాముల జనాభాను పెంచుతున్నాయి. అత్యధిక పాముల జనాభా ఉన్న భారతీయ రాష్ట్రాల గురించి తెలుసుకుందాం.

1. అస్సాం

పాముల జాతులు: 50 కంటే ఎక్కువ విశేషాలు: అస్సాంలోని దట్టమైన అడవులు, చిత్తడి నేలలు పాములకు అనువైన ఆవాసం. కింగ్ కోబ్రా, పైథాన్ వంటి జాతులు ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి.

2. కేరళ

పాముల జాతులు: సుమారు 60

విశేషాలు: పశ్చిమ కనుమల జీవవైవిధ్య కేంద్రంగా కేరళ పాములకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తుంది. కామన్ క్రైట్, రస్సెల్స్ వైపర్ ఇక్కడ సాధారణం. పాముల పాపులేషన్ లో కేరళ టాప్ లో నిలిచింది.

3. కర్ణాటక

పాముల జాతులు: సుమారు 40 విశేషాలు: అడవులు, గడ్డి భూములు వంటి విభిన్న ఆవాసాలు కర్ణాటకలో పాముల జనాభాను పెంచుతున్నాయి. స్పెక్టకల్డ్ కోబ్రా ఇక్కడ ప్రముఖం.

4. పశ్చిమ బెంగాల్

పాముల జాతులు: 50 కంటే ఎక్కువ విశేషాలు: సుందర్‌బన్స్ మడ అడవులు నీటి పాములు, వైపర్‌లకు ఆశ్రయం ఇస్తాయి.

5. తమిళనాడు

పాముల జాతులు: సుమారు 50 విశేషాలు: తీర ప్రాంతాలు, కొండ ప్రాంతాలు సా-స్కేల్డ్ వైపర్, కింగ్ కోబ్రా వంటి జాతులకు అనువైనవి.

6. ఒడిశా

పాముల జాతులు: సుమారు 40 విశేషాలు: తీర, అటవీ ప్రాంతాలు మోనోకల్డ్ కోబ్రా, పైథాన్‌లకు ఆవాసంగా ఉన్నాయి.

7. ఉత్తర ప్రదేశ్

పాముల జాతులు: సుమారు 30 విశేషాలు: వ్యవసాయ భూములు, నదులు చెకర్డ్ కీల్‌బ్యాక్, కామన్ క్రైట్‌లకు అనుకూలం.

ఈ రాష్ట్రాలు వాతావరణం, ఆహార వనరులు, విభిన్న ఆవాస వ్యవస్థల కారణంగా పాముల జనాభాకు కేంద్రంగా ఉన్నాయి. పాముల రక్షణ, మానవ-పాము సంఘర్షణ నివారణ కోసం అవగాహన కల్పించడం ముఖ్యం.