AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care Tips: ఒత్తైన పట్టులాంటి జుట్టు కోసం ద్రాక్ష గింజల నూనె బెస్ట్ మెడిసిన్.. ఎలా ఉపయోగించాలంటే..

సీజనల్ ఫ్రూట్ ద్రాక్ష తినడానికి మాత్రమే కాదు.. వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ద్రాక్షలోని విత్తనాలలో స్త్రీ అందానికి అవసరమైన ఔషధం కూడా ఉంటుంది. అవును స్త్రీ అందాన్ని పెంచే ఆమె జుట్టు పెరుగులకు ద్రాక్ష గింజలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ విత్తనాల నుంచి తయారు చేసిన నూనె జుట్టుకు రాసుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటంటే..

Hair Care Tips: ఒత్తైన పట్టులాంటి జుట్టు కోసం ద్రాక్ష గింజల నూనె బెస్ట్ మెడిసిన్.. ఎలా ఉపయోగించాలంటే..
Grapes Seeds Oil
Surya Kala
|

Updated on: May 13, 2025 | 6:10 AM

Share

మహిళలు తమ జుట్టు బాగా పెరగడానికి అనవసరమైన నూనెలు , రకరకాల చిట్కాలను పాటిస్తారు. అయితే అవి వారు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. ప్రస్తుత వాతావరణంలో జుట్టు సంరక్షణ కూడా అంత సులభం కాదు. కనుక జుట్టు పెరగడానికి తల చర్మం ఆరోగ్యానికి మంచి ఆయిల్ మసాజ్ కూడా చేయాలి. దీని కోసం చాలా మంది రోజ్మేరీ లేదా కొబ్బరి నూనెను ఉపయోగిస్తారు. అయితే ఈ ఆయిల్స్ బదులుగా, ద్రాక్ష గింజల నూనె జుట్టుకి పోషకాలను అందిస్తుంది. ఈ రోజు ఈ ద్రాక్ష నూనెను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

ద్రాక్ష గింజల నూనె చర్మ సంరక్షణకు మంచిదా, కదా… అసలు ద్రాక్ష గింజల నూనెను ఎందుకు ఉపయోగించాలి? అనే విషయాన్నీ చర్మవ్యాధి నిపుణురాలు, కన్సల్టెంట్ డాక్టర్ కళ్యాణి దేశ్‌ముఖ్ చెప్పారు. ద్రాక్ష గింజల నూనె జుట్టుకు మెరుపు, మృదుత్వాన్ని జోడించడంలో సహాయపడుతుంది, ఇది జుట్టును ఆరోగ్యంగా, మరింత శక్తివంతంగా చేస్తుంది. ద్రాక్ష గింజల నూనె తేలికపాటి ఆకృతి, బలమైన పోషకాలను, జుట్టు ఆరోగ్యంతో పాటు అనేక రకాల ప్రయోజనాలను అందిస్తాయి. ఇది చాలా తేమను అందిస్తుంది. పొడి, గిరజాల జుట్టుకు పోషణను అందించడానికి అనువైనది. జుట్టు కుదుళ్లలోకి చొచ్చుకుపోయే ఈ నూనె సామర్థ్యం తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది.

పొడిబారడాన్ని తగ్గిస్తుంది. జుట్టు మెత్తగా పట్టుకుచ్చులా ఉండేలా చేస్తుంది. ద్రాక్ష గింజల నూనెలో ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ముఖ్యంగా “లినోలెయిక్ ఆమ్లం, ఇది జుట్టు తంతువులను బలపరుస్తుంది. జుట్టు ఊడిపోవడాన్ని, జుట్టు చివర్లు చీల్చడాన్ని తగ్గిస్తుంది.” ఈ నూనె బలోపేతం ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ద్రాక్ష గింజల నూనె పొడిబారడం, దురద , తేమను తగ్గించడం ద్వారా చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా ద్రాక్ష గింజల నూనెలో విటమిన్ E అధిక సాంద్రతలో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

“ఆక్సీకరణ నష్టం, పర్యావరణ ఒత్తిళ్ల నుంచి జుట్టును రక్షించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్” అని కనికా మల్హోత్రా చెప్పారు. అదనంగా ఈ ద్రాక్ష గింజల నూనెలో ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, ముఖ్యంగా లినోలెయిక్ ఆమ్లం అధిక సాంద్రతలో ఉంటాయి. ఇది తేమ నిలుపుదల , జుట్టు పెరుగుదలకు అవసరం. ద్రాక్ష గింజల నూనెలో కెరోటినాయిడ్లు, OPC (ఒలిగోమెరిక్ ప్రోయాంతోసైనిడిన్స్) వంటి పాలీఫెనాల్స్ కూడా ఉంటాయి, ఇవి శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. తల చర్మం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ఈ పోషకాలు జుట్టును బలోపేతం చేయడానికి, మెరుపును పెంచడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి కలిసి పనిచేస్తాయి, అయితే ద్రాక్ష గింజల నూనే పొడిగా లేదా ముతకగా ఉన్న జుట్టుకు తగినంత తేమను అందించకపోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)