Tibet Earthquake strikes: టిబెట్‌లో అర్ధరాత్రి భారీ భూకంపం.. భయంతో ఇళ్ళ నుంచి పరుగులు తీసిన జనం.. ఉత్తర్ ప్రదేశ్, బీహార్ పై ప్రభావం
టిబెట్‌లో బలమైన భూకంపం సంభవించింది, తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది., దీని ప్రభావం మన దేశంలోని ఉత్తర్ ప్రదేశ్, బీహార్ వరకు ఉంది. ఈ ప్రాంతంలోని భౌగోళిక కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఎన్‌సిఎస్ సమాచారం ఇస్తోంది. అదే సమయంలో పరిపాలన, విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతానికి భూకంపం వల్ల జరిగిన నష్టం గురించి ఎటువంటి సమాచారం అందలేదు.

ఆదివారం అర్ధరాత్రి తర్వాత భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:41 గంటలకు టిబెట్‌లో బలమైన భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. NCS ప్రకారం భూకంప కేంద్రం టిబెట్ ప్రాంతంలో ఉంది. అయితే ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గురించి ఎటువంటి సమాచారం అందలేదు. అయితే ఈ భూకంపం ప్రభావం మన దేశంలోని ప్రధాన నగరాలైన ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో కూడా కనిపించింది. దీంతో ఈ ప్రాంతంలోని భౌగోళిక కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఎన్‌సిఎస్ సమాచారం ఇచ్చింది. అదే సమయంలో, పరిపాలన.. విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తం అయ్యాయి. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.
An earthquake with a magnitude of 5.7 on the Richter Scale hit Tibet at 02.41 am (IST) today: National Center for Seismology (NCS) pic.twitter.com/NiHQVlTWWi
ఇవి కూడా చదవండి— ANI (@ANI) May 11, 2025
టిబెట్‌లో ఈ రోజు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం టిబెట్‌ను కుదిపేసింది. భూకంపం ఎంత బలంగా వచ్చిందంటే అర్ధరాత్రి నిద్రపోతున్న టిబెటన్ ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీయాల్సి వచ్చింది. అయితే ఈ భూకంపం వల్ల ఎంత నష్టం జరిగింది అనే విషయంపై ఎటువంటి సమాచారం లేదు.
దీని ప్రభావం యుపి-బీహార్ వరకు కనిపించింది
ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ , బీహార్ సరిహద్దు ప్రాంతాలలో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయి. ప్రజలు తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు, కొందరు తేలికపాటి ప్రకంపనల గురించి మాట్లాడారు, మరికొందరు దీనిని భయానక సంఘటనగా పేర్కొన్నారు.
భూకంపాలకు సున్నితంగా ఉంటుంది
ఈ భూకంప కేంద్రం టిబెట్‌లో ఉందని..దీని తీవ్రత మధ్యస్థం నుంచి ఎక్కువగా ఉందని NCS తెలిపింది. భూకంప దృక్కోణంలో చూస్తే హిమాలయ ప్రాంతం చాలా సున్నితంగా ఉంటుందని.. ఇటువంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఈ ప్రాంతంలోని భౌగోళిక కదలికలను తాము నిఘా ఉంచుతున్నామని ఎన్‌సిఎస్ తెలిపింది. తద్వారా ఏదైనా ప్రమాదాన్ని సకాలంలో అంచనా వేయవచ్చని చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




