AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Smoothies: పండుగ సీజన్ లో ఎక్కువ తినేసి.. ఆ తర్వాత ఇబ్బందులా.. నోరూరించే ఈ స్మూతీలపై ఓ లుక్కేయండి..

పండుగ సీజన్‌ అంటే మనకు చెప్పలేనంత ఆనందం. కొత్త బట్టలు, రకరకాల పూజలు, నోరూరించే మిఠాయిలు.. ఇలా ఒక్కటేమిటి.. పండుగ పస్తుందంటే చాలు.. దాని గురించి ఆలోచిస్తూ గడిపేస్తుంటాం. ఆ రోజు వచ్చాక ఎంతో..

Healthy Smoothies: పండుగ సీజన్ లో ఎక్కువ తినేసి.. ఆ తర్వాత ఇబ్బందులా.. నోరూరించే ఈ స్మూతీలపై ఓ లుక్కేయండి..
Banana Smoothie
Ganesh Mudavath
|

Updated on: Nov 02, 2022 | 5:54 PM

Share

పండుగ సీజన్‌ అంటే మనకు చెప్పలేనంత ఆనందం. కొత్త బట్టలు, రకరకాల పూజలు, నోరూరించే మిఠాయిలు.. ఇలా ఒక్కటేమిటి.. పండుగ పస్తుందంటే చాలు.. దాని గురించి ఆలోచిస్తూ గడిపేస్తుంటాం. ఆ రోజు వచ్చాక ఎంతో ఎంజాయ్ చేస్తాం. లడ్డూలు, బర్ఫీలు ఇతర రుచికరమైన వంటకాలతో బొజ్జ నింపేసుకుంటాం. ఆ సమయంలో డైట్ అనే విషయాన్ని అస్సలు పట్టించుకోం. అయితే.. తర్వాత ఎదురయ్యే పరిస్థితులు మనకెంతో అసౌకర్యం కలిగిస్తాయి. ఎన్నో రకాల అనారోగ్యాన్ని మోసుకొస్తాయి. ఫిట్‌నెస్ ను దెబ్బ తీస్తుంది. కేలరీలు ఖర్చు చేసేందుకు తీవ్రంగా కష్టపడుతుంటారు. జిమ్ కు వెళ్లడం, తినకుండా ఉండటం చేస్తుంటారు. అయితే అలాంటివేమీ చేయకుండా రుచికరమైన , హెల్త్ టిప్స్ కలిగి ఉన్న ఈ  ఫుడ్ ను ఓ పట్టు పడితే.. పండుగ సీజన్ తర్వాత వచ్చే ఇబ్బందులను చిటికెలో తరిమేయవచ్చు.

పపాయ స్మూతీ.. బొప్పాయి ముక్కలు, పుచ్చకాయ ముక్కలు, ద్రాక్ష పండ్లు, ప్లం ఫ్రూట్ ముక్కలను ఓ కప్పులో వేసుకోవాలి. వీటికి అర కప్పు ఓట్స్ కలపాలి. ఒక గ్లాస్ పాలు, టేబుల్ స్పూన్ తేనెను యాడ్ చేయాలి. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటే నోరూపించే పపాయ స్మూతీ రెడీ అయినట్లే..

దోసకాయ స్మూతీ..ఒక దోసకాయను కోసి బ్లెండర్లో వేయాలి. కొత్తిమీర ఆకులు కుడా వేసుకోవాలి. తగినంత నీళ్లు పోసుకుని జ్యూస్ లాగా మిక్స్ చేసుకోవాలి. గార్నిష్ కోసం రోస్ సాల్ట్, మిరియాలు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఓ గ్లాస్ లో పోసుకుని, ఐస్ క్యూబ్స్ తో సర్వ్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

బనానా స్మూతీ.. బ్లెండర్‌లో అరటిపండ్లు, పెరుగు, రెండు టీస్పూన్ల తేనె, గుమ్మడి గింజలు వేయాలి. వీటిని ఒకసారి కలుపుకుని బ్లెండ్ చేసుకోవాలి. జ్యూస్ లాగా చేసుకుని గ్లాస్ లో పోసుకోవాలి. మరికొన్ని గుమ్మడికాయ గింజలు, తేనెతో అలంకరించుకోవాలి.

ప్రోటీన్ చాక్లెట్ స్మూతీ..పావు కప్పు రోల్డ్ ఓట్స్, ఒక చిన్న అరటిపండు, ఒక టీస్పూన్ నానబెట్టిన చియా గింజలు, పావు టీస్పూన్ కాఫీ పొడిని బ్లెండర్‌లో వేసుకుని కలుపుకోవాలి. 5 బాదంపప్పులు, 7-8 ఎండుద్రాక్షలు, ఒక టీస్పూన్ పీనట్ బట్టర్, ముప్పావు కప్పు పాలు, కొద్దిగా ప్రోటీన్ పౌడర్ కలపాలి. వీటిని మిక్సీ జార్ లో వేసుకుని జ్యూస్ లా చేసుకుంటే ప్రొటీన్ చాక్లెట్ స్మూతీ రెడీ అయినట్లే..

స్ట్రాబెర్రీ, ఓట్స్ స్మూతీ.. మిక్సర్ గ్రైండర్‌లో స్ట్రాబెర్రీలు, ఓట్స్, చియా గింజలను వేసుకోవాలి. స్మూతీ కోసం పాలు వేసుకోవాలి. అవసరం అనుకుంటే తేనె కూడా వేసుకోవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత