Vastu Tips: నైరుతి దిశలో ఈ తప్పులు చేశారా.? భారీ మూల్యం చెల్లించక తప్పదు..
ముఖ్యంగా ఇంట్లో ఏ దిశలో ఏ వస్తువులు పెట్టుకోవాలి.? ఏ దిశలో ఎలాంటి వస్తువులు పెట్టకోకూడదు అనేది వాస్తు శాస్త్రంలో స్పష్టంగా తెలిపారు. నైరుతి దిశ విషయంలో వాస్తును తూచా తప్పకుండా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ నైరుతి దిశలో ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలి.?

హిందూ సంప్రదాయంలో వాస్తుశాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రాచీన కాలం నుంచి వాస్తును విశ్వసిస్తూ వస్తున్నారు. ఇంటి నిర్మాణంతో పాటు ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల వరకు అన్నింటి విషయంలో వాస్తు ప్రకారం ఉండేలా చూసుకోవాలని పండితులు చెబుతుంటారు.
ముఖ్యంగా ఇంట్లో ఏ దిశలో ఏ వస్తువులు పెట్టుకోవాలి.? ఏ దిశలో ఎలాంటి వస్తువులు పెట్టకోకూడదు అనేది వాస్తు శాస్త్రంలో స్పష్టంగా తెలిపారు. నైరుతి దిశ విషయంలో వాస్తును తూచా తప్పకుండా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ నైరుతి దిశలో ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలి.? ఈ దిశలో ఎలాంటి వస్తువులు ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
* వాస్తు శాస్త్రం ప్రకారం నైరుతి దిశలో ఎట్టి పరిస్థితుల్లో పూజగది ఉండకూదని వాస్తు పండితులు చెబుతున్నారు. పొరపాటున ఈ దిశలో పూజగది నిర్మించిన మంచి కంటే చెడు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఈ దిశలో ఏర్పాటు చేసే పూజ గదిలో ప్రతిష్ఠించిన దేవతామూర్తులను పూజించినా ఫలితం ఉండదు.
* నైరుతి దిశలో మనస్సు ఏకాగ్రతగా ఉండదు. మనస్సు ఎల్లప్పుడూ సంచరిస్తూనే ఉంటుంది. అందుకే నైరుతి దిశలో చదువుకోవడం వల్ల పిల్లలకు ఏమీ గుర్తుండదు. ఈ కారణంగానే నైరుతి దిశలో స్టడీ రూమ్‌లను ఎట్టి పరిస్థితుల్లో నిర్మించుకోకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు.
* ఇక గెస్ట్ రూమ్‌లను, హాల్‌ను ఎట్టి పరిస్థితుల్లో నైరుతి దిశలో నిర్మించకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం.. రాహువు, కేతువుల దిశ కారణంగా ఈ దిశలో నివసించే వ్యక్తి మనస్సు, ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు వస్తుంది. అందువల్ల ఈ దిశలో అతిథి గదిని నిర్మించకుండా ఉండాలి.
* అలాగే నైరుతి దిశలో అండర్ గ్రౌండ్ వాటర ట్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో నిర్మించుకోకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెబుతున్నారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడుతాయి. అలాగే ఇలాంటి ఇంట్లో నివసించే వారు ఎల్లప్పుడూ అనారోగ్యంతో బాధపడుతుంటారు.
నోట్: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




