AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: బెడ్‌ రూమ్‌లో మనం చేసే ఈ తప్పులతో.. భారీ మూల్యం తప్పదు.

ముఖ్యంగా బెడ్ రూమ్‌లో మనం చేసే పొరపాట్ల కారణంగా ఎన్నో దుష్ఫ్రభావాలు ఎదుర్కోక తప్పదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పడకగదిలో చేసే తప్పుల కారణంగా.. శ్రమకు తగ్గ ఫలితం లభించదు. లక్ష్మీ కాటక్షం లభించదు. ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి కొన్ని వాస్తు తప్పులు ఏంటి.? వాటి వల్ల కలిగే దుష్ప్రభావం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

Vastu Tips: బెడ్‌ రూమ్‌లో మనం చేసే ఈ తప్పులతో.. భారీ మూల్యం తప్పదు.
Vastu
Narender Vaitla
|

Updated on: Dec 05, 2023 | 4:35 PM

Share

నిత్యం మనకు తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటాం. అయితే వీటివల్ల మనపై దుష్ఫ్రభావం చూపుతాయి. వీటిలో తప్పు ఏముంటుందిలే అనుకొని మనం చేసే పొరపాట్లతో భారీ మూల్యం చెల్లించకతప్పదు. ముఖ్యంగా బెడ్ రూమ్‌లో మనం చేసే పొరపాట్ల కారణంగా ఎన్నో దుష్ఫ్రభావాలు ఎదుర్కోక తప్పదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పడకగదిలో చేసే తప్పుల కారణంగా.. శ్రమకు తగ్గ ఫలితం లభించదు. లక్ష్మీ కాటక్షం లభించదు. ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి కొన్ని వాస్తు తప్పులు ఏంటి.? వాటి వల్ల కలిగే దుష్ప్రభావం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

* మహిళలు పడుకునే ముందు తాము ధరించిన నగలు తీసి దిండు కింద పెడుతుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరుగుతుంది. నగలను బీరువా లేదా లాకర్‌లో ఉంచడమే మంచిది.

* ఇక నిద్రపోయే ముందు తల వద్ద బాటిల్ పెట్టుకోవడం సర్వసాధారణమైన విషయం. రాత్రుళ్లు దాహం వేస్తే నీళ్లు తాగొచ్చని ఇలా చేస్తుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు. దీనివల్ల నెగిటివ్‌ ఎనర్జీ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వాటర్‌ బాటిల్‌ను బెడ్‌కు దూరంగా పెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

* చాలా మందికి నిద్రపోయే ముందు పుస్తకాలు చదవడం అలవాటు ఉంటుంది. ఇలా చదివిన తర్వాత పుస్తకాన్ని దిండుకింద పెట్టుకొని పడుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల సమస్యలు తప్పవని చెబుతున్నారు.

* ఇక ఎట్టి పరిస్థితుల్లో పడక గదిలో భోజనం చేయకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మంచంపై కూర్చొని తినడం వల్ల రాత్రి పూట పీడకలలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే దాంప్యత జీవితంలో అడ్డంకులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

* మనలో చాలామంది ఒకసారి వేసుకున్న దుస్తులను మంచంపై పడేయడం చేస్తుంటారు. అయితే ఇలా చేయడం కూడా మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవీ కాటక్షం లభించకపోవడమే కాకుండా, అప్పులు పెరిగే అవకాశం కూడా ఉంటుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..