Dream: కలలో చిన్న పిల్లలు కనిపిస్తున్నారా.. దాని అర్థం ఏంటో తెలుసా.?
నిద్రపోయిన తర్వాత కలలు రావడం సర్వసాధారణమైన విషయం. మనలో ప్రతీ ఒక్కరికీ కలలు వస్తూనే ఉంటాయి. అయితే మనం పడుకున్న సమయంలో, మన ప్రమేం లేకుండా వచ్చే కలలు మ జీవితంపై ప్రభావం చూపుతాయని మీకు తెలుసా.? స్వప్నశాస్త్రంలో ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను సవివరంగా తెలిపారు. మానసిక నిపుణులు సైతం ఇదే విషయాన్ని...

నిద్రపోయిన తర్వాత కలలు రావడం సర్వసాధారణమైన విషయం. మనలో ప్రతీ ఒక్కరికీ కలలు వస్తూనే ఉంటాయి. అయితే మనం పడుకున్న సమయంలో, మన ప్రమేం లేకుండా వచ్చే కలలు మ జీవితంపై ప్రభావం చూపుతాయని మీకు తెలుసా.? స్వప్నశాస్త్రంలో ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను సవివరంగా తెలిపారు. మానసిక నిపుణులు సైతం ఇదే విషయాన్ని చెబుతుంటారు. డ్రీమ్ సైన్స్‌లో ఇలాంటి విషాలను ప్రస్తావించార. మరి రాత్రి కలలో చిన్న పిల్లలు కనిపిస్తే దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..
* కలలో చిన్నారుల అందమైన పిల్లలు కనిపిస్తే మంచిదని చెబుతున్నారు. మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి నుంచి ఉపశమనం పొందనున్నారని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా అప్పుడే పుట్టిన శిశువులు కలలో కనిపించడం చాలా శుభప్రదమని పండితులు చెబుతున్నారు.
* ఒకవేళ కలలో చిన్నపిల్లలు ఏడుస్తున్నట్లు కనిపిస్తే మీ కోరికలలో ఒకటి త్వరలోనే నెరవేరుతుందని అర్థం చేసుకోవాలని స్వప్న శాస్త్రం చెబుతోంది. చాలా కాలం నుంచి ఉన్న మీ కోరిక నెరవేరబోతోందని అర్థం.
* ఇక కలలో చిన్నారులు తప్పిపోయినట్లు కనిపిస్తే.. ఆగిపోయిన పనిని త్వరలోనే తిరిగి ప్రారంభిస్తారని అర్థమని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆర్థిక సమస్యలు దూరమై మంచి రోజులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
* కలలో నవ్వుతున్న పిల్లలు కనిపిస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. నవ్వుతున్న పిల్లలు తరచూ కనిపిస్తే వచ్చే రోజుల్లో శుభవార్త వినబోతున్నారని అర్థం చేసుకోవాలి.
* ఒకవేళ కలలో కవల పిల్లలను చూసినట్లు కనిపిస్తే మీ వృత్తి జీవితం బాగుంటుందని అర్థం. త్వరలోనే మీరు ప్రమోషన్ పొందే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు.
* మీ ఒడిలో చిన్నారి నిద్రిస్తున్నట్లు కల వస్తే.. మీకు దగ్గరి బంధవుల్లో ఒకరికీ బిడ్డ జన్మించే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన వివరాలు పలువురు పండితులు, శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
