AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dream: కలలో కారు కనిపించిందా.? మీ జీవితంలో ఈ మార్పు జరగబోతున్నట్లే

రాత్రి పడుకున్న సమయంలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం. మనలో దాదాపు ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వచ్చే ఉంటాయి. అయితే ఈ కలలు మన నిజ జీవితంపై ప్రభావం చూపుతుతాయని పండితులు చెబుతున్నారు. స్వప్న శాస్త్రంలోనూ ఈ విషయాలను స్పష్టంగా తెలియజేశారు. అలాగే.. మానసిక నిపుణులు సైతం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు...

Dream: కలలో కారు కనిపించిందా.? మీ జీవితంలో ఈ మార్పు జరగబోతున్నట్లే
Dream In Car
Narender Vaitla
|

Updated on: Jun 30, 2024 | 2:46 PM

Share

రాత్రి పడుకున్న సమయంలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం. మనలో దాదాపు ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వచ్చే ఉంటాయి. అయితే ఈ కలలు మన నిజ జీవితంపై ప్రభావం చూపుతుతాయని పండితులు చెబుతున్నారు. స్వప్న శాస్త్రంలోనూ ఈ విషయాలను స్పష్టంగా తెలియజేశారు. అలాగే.. మానసిక నిపుణులు సైతం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కలలో మీకు కనిపించే అంశాలు మీ నిజ జీవితంలో జరిగే మార్పులకు సంకేతమని అంటున్నారు. అయితే స్వప్నశాస్త్రం ప్రకారం.. కలలో కారు కనిపిస్తే దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..

* కలలో మీరు కొత్త కారు కొనుగోలు చేస్తున్నట్లు కనిపిస్తే. మీరు త్వరలోనే ఏదో కొత్త ప్రయాణం చేయబోతున్నారని అర్థం. కేవలం జర్నీ అనే అర్థం కాకుండా, జీవితంలో ఏదో కొత్త నిర్ణయం తీసుకోబుతున్నారని అర్థం చేసుకోవాలి. కెరీర్‌ పరంగా కానీ వ్యక్తిగత జీవితం విషయంలో కానీ ఏదో కొత్త మార్గంలో వెళ్లనున్నారని తెలుసుకోవాలి.

* ఒకవేళ కలలో కారు ఎక్కుతున్నట్లు కనిపిస్తే. మీరు అనుకున్న ప్రయాణం కాకుండా వేరే ప్రయాణం చేయనున్నారని అర్థం చేసుకోవాలి. అంటే అప్పటికప్పుడు మీ నిర్ణయాలు మారుతాయని అర్థం చేసుకోవాలి.

* కారులోకి ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా ఎక్కలేక ఇబ్బంది పడుతున్నట్లు కల వస్తే.. మీ శత్రువులు మిమ్మల్ని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఇలాంటి కల వస్తే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

* ఒకవేళ కారు డోర్‌ వద్ద వేలాడుతున్నట్లు కల వస్తే మీకు భవిష్యత్తులో ఏదో తెలియని ఇబ్బంది వెంటాడబోతోందని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు.

* ఇక కారులో గమ్యాన్ని క్షేమంగా చేరుకున్నట్లు కల వస్తే. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మీరు అనుకున్న గమ్యాన్ని విజయవంతంగా చేరుకుంటారని అర్థం. కష్టాలను జయించి విజయం దిశగా అడుగులు వేస్తున్నారని అర్థం చేసుకోవాలి.

* ఒకవేళ కారులో నిద్రపోతున్నట్లు కనిపిస్తున్నట్లయితే మీరు ఒత్తిడితో బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారని అర్థం.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, శాస్త్రాల్లో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్‌ చేయండి..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్