wife: వైఫ్ అంటే అసలైన అర్ధం తెలుసా..? అసలు ఆ పదం ఎక్కడనుంచి వచ్చిందంటే..?
అసలు వైఫ్ అనే పదానికి అసలు అర్థం ఏమిటి.? ఆ పదం ఎక్కడ పుట్టింది అన్నది చాలా తక్కువ మందికే తెలుసు
చాలా మందికి భార్య అంటే సరైన అర్ధం తెలియకపోవచ్చు.. పెళ్లైన మహిళలను భార్య అని పిలుస్తారని కొందరు అంటుంటారు. మరికొందరైతే వైఫ్ ను తెలుగులో భార్య అని అంటారు అని కూడా సమాధానం చెప్తూ ఉంటారు. అసలు వైఫ్ అనే పదానికి అసలు అర్థం ఏమిటి.? ఆ పదం ఎక్కడ పుట్టింది అన్నది చాలా తక్కువ మందికే తెలుసు. మత గ్రంథాలలో భార్య అనే పదం చాలా గొప్పది. భార్యను అర్ధాంగి, జీవిత భాగస్వామి మొదలైన పేర్లతో పిలుస్తారు. దీనికి వివిధ భాషలలో అనేక పేర్లు, అర్థాలు ఉన్నాయి. భార్యను వైఫ్ అని ఎందుకు పిలుస్తారు.? వైఫ్ అనే పదం ఎక్కడ నుండి వచ్చింది అంటే..
ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ప్రకారం వైఫ్ అంటే వివాహిత మహిళ లేదా పెళ్లయిన స్త్రీ.. అంటే ఇక్కడ వివాహిత స్త్రీని వైఫ్ అంటారు. అయితే అదే సమయంలో, తన భర్త నుండి విడిపోయిన కూడా భార్య అని పిలుస్తారు. అయితే విడాకుల తర్వాత భార్యకు మాజీ అనే పదాన్ని ఉపయోగిస్తారు. వైఫ్ అనే పదం ఎక్కడ నుండి వచ్చింది అంటే? విదేశీ భాషా నిపుణుల అభిప్రాయం ప్రకారం భార్య అనే పదం జర్మన్ భాష నుండి వచ్చింది. ఇది ప్రోటో జర్మనీ పదం వైబామ్ నుండి వచ్చింది. వైఫ్ అంటే స్త్రీ. కాబట్టి భార్య అనే పదానికి నిజమైన అర్థం స్త్రీ మాత్రమే. భార్య అనే పదానికి పెళ్లికి సంబంధం లేదని అంటున్నారు నిపుణులు. అయినప్పటికీ, క్రమంగా భార్య అనే పదం వివాహంతో ముడిపడి ఉంది. పెళ్లైన ఆడవారిని భార్య అని పిలవడం అలవాటు చేసుకున్నారు. అలాగే అది ఆంగ్ల నిఘంటువులో కూడా భాగమైంది. కాబట్టి భార్య అనే పదానికి అసలైన అర్ధం స్త్రీ అని మాత్రమేనట.