Ghee: ‘నెయ్యి’ని ఈ జంతువుల పాలతోనూ తయారు చేస్తారు.. ధర ఎంతో తెలిస్తే కళ్లై బర్లు కమ్మాల్సిందే..
నెయ్యి అనగానే మనకు ఆవు నెయ్యి, గెదె నెయ్యి అని అంటారు. కానీ, ఆ రెండే కాదు.. మరికొన్ని జంతువుల పాలతోనూ నెయ్యిని తయారు చేస్తారని మీకు తెలుసా? అవును, ఆవు, గెదె మాత్రమే కాదు.. మరికొన్ని జంతువుల పాలతోనూ నెయ్యిని తయారు చేస్తారు. వాటికి ప్రపంచ మార్కెట్‌లో మాంచి డిమాండ్ కూడా ఉంది.

నెయ్యి అనగానే మనకు ఆవు నెయ్యి, గెదె నెయ్యి అని అంటారు. కానీ, ఆ రెండే కాదు.. మరికొన్ని జంతువుల పాలతోనూ నెయ్యిని తయారు చేస్తారని మీకు తెలుసా? అవును, ఆవు, గెదె మాత్రమే కాదు.. మరికొన్ని జంతువుల పాలతోనూ నెయ్యిని తయారు చేస్తారు. వాటికి ప్రపంచ మార్కెట్‌లో మాంచి డిమాండ్ కూడా ఉంది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మరి ఏయే జంతువుల పాలతో నెయ్యిని తయారు చేస్తారు. మార్కెట్‌లో వాటికున్న డిమాండ్ ఏంటి? ధర ఎంత? ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆవు, గేదె పాలతో నెయ్యి..
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా వాడకంలో ఉన్నది ఆవు, గెదె పాలతో తయారు చేసిన నెయ్యి మాత్రమే అని చెప్పొచ్చు. పశుసంవర్ధక రంగంలో ఎక్కువగా ఆవులు, గేదెలనే పెంచుతున్నారు రైతులు. దాంతో మార్కెట్‌లో ఆవు, గేదె పాలు, పాల ఉత్పత్తుల విక్రమయం అధికంగా ఉంటుంది. అయితే, ఇతర జంతువుల నుంచి వచ్చే పాల ఉత్పత్తుల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాటి ధర కూడా భారీగా ఉంటుంది.
మేక పాలు..
మేక పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మేక పాలతో తయారు చేసిన నెయ్యికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. మేక పాలతో తయారు చేసి నెయ్యి ధర 200 గ్రాములకు రూ. 600 నుంచి రూ. 800 వరకు పలుకుతోంది. అంటే కిలో రూ. 3,000 నుంచి 4,000 వరకు ఉంది.
ఒంటే పాలు..
ఒంటే పాలతో చేసిన నెయ్యికి కూడా మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. ఈ నెయ్యి మేక పాలతో చేసిన నెయ్యి కంటే ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఆన్‌లైన్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈ నెయ్యి 250 గ్రాముల ధర రూ. 980గా ఉంది. కిలో రూ. 4,000 పైగానే పలుకుతుంది.
గొర్రె పాలు..
గొర్రె పాలతో చేసిన నెయ్యికి మార్కెట్‌లో మాంచి ధర ఉంది. ఈ నెయ్యి కూడా 250 గ్రాములకు రూ. 890 ధర పలుకుతోంది. కిలో రూ. 4,000 వరకు పలుకుతోంది.
గాడిద పాలు..
ఇక అత్యంత ఖరీదైన పాలు అంటే గాడిద పాలు అని చెప్పుకోవచ్చు. గాడిద పాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని అంటారు. అందుకే ఈ పాలకు చాలా డిమాండ్ ఉంటుంది. ఈ పాలతో తయారు చేసిన నెయ్యికి కూడా బాగా డిమాండ్ ఉంది. గాడిద పాలతో చేసిన నెయ్యి 250 గ్రాముల ధర రూ. 2,500 వరకు ఉంది. కిలో రూ. 10 వేలకు పైగానే ఉంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..