జూలై నెలలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందో తెలుసా.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన అధ్యాయనాలు..

సాధారణంగా మనం పుట్టిన గడియను బట్టి మన స్వభావం ఆధారపడి ఉంటుంది అంటుంటారు పెద్దవాళ్లు. ఇక పుట్టిన తేదీ... వారం..

జూలై నెలలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందో తెలుసా.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన అధ్యాయనాలు..
Childrens

సాధారణంగా మనం పుట్టిన గడియను బట్టి మన స్వభావం ఆధారపడి ఉంటుంది అంటుంటారు పెద్దవాళ్లు. ఇక పుట్టిన తేదీ… వారం.. సమయాన్ని బట్టి వారి ప్రవర్తన ఉంటుందని అంటారు. ఉదాహరణకు రాత్రి సమయంలో జన్మించిన వారు.. పగలు సమయంలో ఎక్కువగా నిద్రపోతారని.. సాయంత్రాలు జన్మించిన వారికి కోపం ఎక్కువగా ఉంటుందని అంటారు. అయితే ఆయా నెలలను బట్టి కూడా స్వభావాలను డిసైడ్ చేయవచ్చట. ఇక మన భారత దేశంలో పుట్టిన తేది.. తిథి.. రోజు.. గడియలను బట్టి వారి జీవితాన్ని అంచనా వేస్తారు. శాస్త్రీయ పరంగా వారి స్వభావంతోపాటు.. భవిష్యత్తును కూడా అంచనా వేస్తుంటాం. అయితే జూలై నెలలో జన్మించిన వారి గురించి తెలుసుకోవడానికి కొందరు నిపుణులు అధ్యాయనాలు జరిపారు.

జూలై నెలలో జన్మించిన చాలా ప్రముఖులు… సామాన్య ప్రజలపై జరిపిన ఈ అధ్యయనంలో వారి లక్షణాలు, స్వభావం గురించి పలు విషయాలు వెలువడ్డాయి. జూలైలో జన్మించిన పిల్లలు సానుకూల ఆలోచనతో జీవితంలో ముందుకు సాగే అవకాశం ఉందని అధ్యయనాలలో తెలీంది. ప్రసిద్ధ రోమన్ హీరో జూలియన్ సీజర్ జూలైలో జన్మించారు. రోమన్ సామ్రాజ్యాన్ని నిర్మించడంలో సీజర్ పోషించిన పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తగిలిన ఎదురుదెబ్బలతో నిరుత్సాహపడకుండా ముందుకు సాగడం సీజర్ స్వభావం. జీవితంలో చాలా పాజిటివిటీతో ముందుకు సాగిన ప్రముఖుల పేర్లు ఇంకా చాలా ఉన్నాయి. నెల్సన్ మండేలా, ప్రిన్సెస్ డయానా, జార్జ్ డబ్ల్యూ. బుష్. బుష్ జూలైలో జన్మించారు. ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, రణవీర్ సింగ్, సౌరవ్ గంగూలీ, జెఆర్డి టాటా, కైలాష్ ఖేర్, ఎంఎస్ ధోని, కపిల్ దేవ్ ఈ నెలలోనే జన్మించారు.

ఇటీవల యునైటెడ్ స్టేట్స్ జరిపిన ఓ అధ్యయనం ప్రకారం.. జూలైలో జన్మించిన వారు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం చాలా తక్కువ ఉంటుదట. దాదాపు జూలై నెలలో జన్మించిన 1000 మందిపై ఈ అధ్యాయనాన్ని జరిపారు. జూలైలో జన్మించిన వారు ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉందని మరో అధ్యయనం తెలిపింది. వారు జీవితంలో ఆరోగ్యంగా ఉంటారని.. ఎంతో ఎత్తుకు ఎదురుగుతారని వెల్లడైంది. ఈ నెలలో జన్మించిన చాలా మంది ఎడమచేతి వాటం ఎక్కువగా ఉన్నారని తెలీంది. అయితే ఆగస్టు నెలలో జన్మించిన వారికి కుడిచేతి వాటం ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది.

జూలైలో జన్మించిన వారి మరొక లక్షణం ఉంటుంది. వారు చాలా ఆశాజనకంగా ఉంటారట. అదే సమయంలో వారు చాలా త్వరగా భావోద్వేగానికి లోనవుతారు. జూలైలో జన్మించిన వ్యక్తులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్లు ఎక్కువగా ఎవరి సహాయం తీసుకోరు. అరుదుగా ఇతరుల సహాయం తీసుకుంటారు. వారు స్వయంగా పనులు చేయటానికి ఇష్టపడతారు. అంతేకాదు.. తలపెట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారట. అసాధారణమైన నిర్వహణ నైపుణ్యాలను చూపుతారు. ఈ లక్షణాలతోనే వారు ఎక్కువగా నాయకులుగా.. నిర్వాహకులుగా ఉంటారట. మన భారత క్రికెట్‌లో ముగ్గురు ఉత్తమ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోని జూలైలో జన్మించారు.

Also Read: వారి మధ్య ఏ గొడవ లేదు.. కానీ ఆ స్టార్ హీరోలు ఇద్దరు 16 సంవత్సరాలు మాట్లాడుకోలేదు.. ఎందుకంటే..

Kangana Ranaut: మరోసారి వివాదాల్లోకి కంగన.. ముంబాయి హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్..