AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dholes: మన వీధి కుక్కల్లా ఇవి మొరగవ్.. వేట మొదలెడితే దేన్నీ వదలవ్..!

అడవి కుక్కలు (ధోల్‌లు) అడవిలో అత్యంత తెలివైన, సమర్థవంతమైన వేటగాళ్లలో ఒకటిగా గుర్తింపు పొందాయి. జట్టుగా వేటాడటం, ప్రత్యేక శబ్దాలతో సంభాషించడం, గంటల తరబడి ఆహారాన్ని వెంటాడటం వంటి విశేష లక్షణాలు వీటి సొంతం. ఒకప్పుడు ఆసియా వ్యాప్తంగా విస్తరించిన ఈ అరుదైన జాతి ప్రస్తుతం అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉండటంతో వాటి సంరక్షణపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Dholes: మన వీధి కుక్కల్లా ఇవి మొరగవ్.. వేట మొదలెడితే దేన్నీ వదలవ్..!
Wild Dogs
Ram Naramaneni
|

Updated on: Jun 10, 2026 | 7:27 AM

Share

అడవిలో సింహం, పులి, చిరుత వంటి జంతువుల గురించి ఎక్కువగా వింటుంటాం. కానీ ప్రకృతి ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన వేటగాళ్లలో ఒకటి అడవి కుక్క. భారతదేశంలోని అడవుల్లో కనిపించే ఈ అరుదైన జంతువులు తమ అసాధారణ తెలివితేటలు, జట్టు సమన్వయం, వేట నైపుణ్యాలతో ప్రత్యేక గుర్తింపు పొందాయి.

మన ఇంటి కుక్కల్లా అడవి కుక్కలు సాధారణంగా మొరగవు. వీటి మధ్య సంభాషణ ఎక్కువగా ఈలలు, కూతలు, ప్రత్యేక శబ్దాల ద్వారా జరుగుతుంది. అందుకే వీటిని కొన్నిచోట్ల ‘విస్లింగ్ డాగ్స్’అని కూడా పిలుస్తారు.సింహాల వేట విజయశాతం సుమారు 25–30 శాతం ఉంటే, అడవి కుక్కల వేట విజయశాతం 70–80 శాతం వరకు ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీనికి కారణం వీటి అద్భుతమైన జట్టు వ్యూహం. డవి కుక్కలు ఒంటరిగా కాకుండా 5 నుంచి 20 వరకు సభ్యులతో కూడిన గుంపులుగా జీవిస్తాయి. ఒక జంతువును వేటాడేటప్పుడు గుంపుగా చుట్టుముట్టి అలసిపోయే వరకు వెంటాడతాయి. దీంతో వేట తప్పించుకోవడం చాలా కష్టం. వేటకు వెళ్లేముందు ఇవి ఒక చోట సమావేశమవుతాయ్. అందులో 10 కుక్కలు తుమ్మితే చాలు.. మూకుమ్మడిగా వేటకు రెడీ అయిపోయినట్లే. అయితే ఆఫ్రికన్ అడవి కుక్కల్లోనే ఈ ప్రత్యేక లక్షణం ఉంది.

అడవి కుక్కలకు ఎక్కువ వేగం మాత్రమే కాదు, అద్భుతమైన స్టామినా కూడా ఉంటుంది. అవసరమైతే కిలోమీటర్ల దూరం వరకు తమ ఆహారాన్ని వెంటాడగలవు. ఒంటరిగా ఉన్న అడవి కుక్క పులికి బలహీనమే. కానీ పెద్ద గుంపుగా ఉన్నప్పుడు పులులు, చిరుతలు కూడా వీటి సమూహాన్ని చూసి దూరంగా వెళ్లిపోవడం జరుగుతుంది. అడవి కుక్కల గుంపులో పిల్లలను కేవలం తల్లి మాత్రమే కాదు, మొత్తం గుంపు కలిసి సంరక్షిస్తుంది. వేటకు వెళ్లిన పెద్ద కుక్కలు తిరిగి వచ్చాక పిల్లలకు ఆహారం అందిస్తాయి.

ఒకప్పుడు ఆసియా ఖండం అంతటా విస్తరించి ఉన్న అడవి కుక్కలు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. అడవుల నరికివేత, ఆహార కొరత, వ్యాధులు, మానవ జోక్యం కారణంగా వీటి సంఖ్య బాగా తగ్గింది. అడవి కుక్కల శరీరం ఎర్రటి-గోధుమ రంగులో ఉంటుంది. తోక చివర భాగం నల్లగా ఉండటం వీటి ప్రత్యేక లక్షణం. అడవి కుక్కలు కేవలం పరుగులోనే కాదు, ఈతలో కూడా దిట్టలు. నదులు, వాగులు దాటి ఆహారం కోసం ప్రయాణించగలవు. జింకలు, అడవి పందులు వంటి శాకాహార జంతువుల సంఖ్యను నియంత్రించడం ద్వారా అడవి కుక్కలు అడవుల్లో జీవావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

అడవి కుక్కలు పరిమాణంలో పెద్దగా కనిపించకపోయినా, తెలివితేటలు, జట్టు కృషి, వేట నైపుణ్యాల్లో ప్రకృతి సృష్టించిన అద్భుత జీవుల్లో ఒకటి. అడవుల్లో పులి, సింహం ఎంత ముఖ్యమో, అడవి కుక్కలు కూడా అంతే ముఖ్యమైనవి. ప్రకృతి సమతుల్యతను కాపాడే ఈ అరుదైన జీవులను సంరక్షించడం మనందరి బాధ్యత.

Follow Us
అడవి కుక్కలు.. అడవిలో అత్యంత తెలివైన వేటగాళ్లు!
అడవి కుక్కలు.. అడవిలో అత్యంత తెలివైన వేటగాళ్లు!
అయ్యబాబోయ్.. ఆస్ట్రేలియానే చిత్తు చిత్తుగా ఓడించేశారుగా..!
అయ్యబాబోయ్.. ఆస్ట్రేలియానే చిత్తు చిత్తుగా ఓడించేశారుగా..!
యువతిని వేధించిన వ్యాన్ డ్రైవర్, క్లీనర్.. సీన్ కట్‌చేస్తే..
యువతిని వేధించిన వ్యాన్ డ్రైవర్, క్లీనర్.. సీన్ కట్‌చేస్తే..
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?